‘వైల్డ్ డాగ్’ మూవీ ప్రమోషన్స్ పెంచిన నాగార్జున.. ఆదివారం సాయంత్రం హైదరాబాద్‏లో బేస్ క్యాంప్ ఈవెంట్..

Akkineni Nagarjuna: అక్కినేని నాగార్జున చాలా రోజుల తర్వాత 'వైల్డ్ డాగ్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇప్పటికే షూటింగ్

'వైల్డ్ డాగ్' మూవీ ప్రమోషన్స్ పెంచిన నాగార్జున.. ఆదివారం సాయంత్రం హైదరాబాద్‏లో బేస్ క్యాంప్ ఈవెంట్..
Nagarjuna Wild Dog Movie Ba
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 28, 2021 | 5:23 PM

Akkineni Nagarjuna: అక్కినేని నాగార్జున చాలా రోజుల తర్వాత ‘వైల్డ్ డాగ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ మూవీ.. ఏప్రిల్ 2న గ్రాండ్‏గా విడుదల కాబోతుంది. హైదరాబాద్‏లో జరిగిన బాంబు దాడుల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. ఇందులో నాగార్జున నేష‌న‌ల్ ఇన్వెస్టిగేష‌న్ ఏజెన్సీ (ఎన్ఐఏ)లో ఏసీపీ విజయ్ వర్మ పాత్రలో నాగార్జున కనిపించబోతున్నాడు. బాంబు దాడులు జరిపిన టెర్రరిస్టులను నేష‌న‌ల్ ఇన్వెస్టిగేష‌న్ ఏజెన్సీ (ఎన్ఐఏ)లో ఏసీపీగా ప‌నిచేసే విజ‌య్ వ‌ర్మ ఎలా తుద‌ముట్టించాడనే విష‌యాన్ని ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా ట్రైలర్‏లో చూపించేసాడు డైరెక్టర్ అహిషోర్ సాల్మన్. ఈ సినిమాలో నాగార్జునకు జోడీగా బాలీవుడ్ క్వీన్ దియామీర్జా నటిస్తోంది.

ఇక సినిమా విడుదల తేదీ దగ్గరికి వస్తుండడంతో.. మూవీ ప్రమోషన్స్‏ను వేగవంతం చేసింది చిత్రయూనిట్. ఇప్పటికే నాగార్జున తన టీంతో కలిసి డిఫరెంట్‏గా మూవీ ప్రమోషన్స్ చేస్తున్నాడు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అన్ని ఛానెల్స్ కు కూడా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. అంతేకాదు సోషల్ మీడియాలో అభిమానులతో కలుస్తున్నాడు. వాళ్లు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్తున్నాడు. ఎప్పటికప్పుడు కొత్త ప్రోమోలను విడుదల చేస్తున్నాడు. ఇందులో భాగంగానే.. ఈ సినిమా ప్రచారంలో భాగంగా.. ఆదివారం సాయంత్రం హైదరాబాద్‏లో వైల్డ్ డాగ్ బేస్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. ఈ వేడుకను టీవీ9లో లైవ్ టెలికాస్ట్‏లో చూడవచ్చు.

అటు నాగార్జున ప్రస్తుతం డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంఓ మూవీ చేస్తున్నాడు. ఇందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్‏గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ గోవాలో జరుగుతుంది. గోవా షెడ్యూల్ పూర్తైన త‌ర్వాత మిగిలిన చిత్రీక‌రణ కోసం నాగ్ టీం హైద‌రాబాద్‌కు రానుంది. మార్చి 31 నుంచి ఈ సినిమా చిత్రీకరణంలో కాజల్ పాల్గొననుంది. ఇందులో నాగ్ చెల్లెలిగా చంఢీఘర్ భామ, మిస్ ఇండియా టైటిల్ విన్నర్ గుల్‌పనాగ్‌, మేనకోడలి పాత్రలో మలయాళీ నటి అనిఖ నటిస్తోంది.

టీవీ9 లైవ్..

Also Read:

రహస్యంగా పెళ్ళి చేసుకున్న ‘చిన్నారి పెళ్ళి కూతురు’ !!.. సోషల్ మీడియాలో ఫోటోస్ షేర్ చేసిన అవికా గోర్..

స్టార్ హీరోపై చీటింగ్ కేసు.. ముందస్తు బెయిల్ ఇవ్వొద్దంటూ మద్రాసు హైకోర్టులో యువతి పిటిషన్..