స్టార్ హీరోపై చీటింగ్ కేసు.. ముందస్తు బెయిల్ ఇవ్వొద్దంటూ మద్రాసు హైకోర్టులో యువతి పిటిషన్..

Actor Arya : రాజారాణి, వరుడు సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు తమిళ స్టార్ హీరో ఆర్య. అటు తమిళంలో ఆయన చేసిన సినిమాలను

స్టార్ హీరోపై చీటింగ్ కేసు.. ముందస్తు బెయిల్ ఇవ్వొద్దంటూ మద్రాసు హైకోర్టులో యువతి పిటిషన్..
Hero
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 28, 2021 | 4:37 PM

Actor Arya : రాజారాణి, వరుడు సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు తమిళ స్టార్ హీరో ఆర్య. అటు తమిళంలో ఆయన చేసిన సినిమాలను తెలుగులో డబ్బింగ్‏తో విడుదల చేసి..టాలీవుడ్‏లోనూ మంచి విజయాలను అందుకున్నాడు ఈ యంగ్ హీరో. ఇటీవలే టెడ్డి సినిమాతో వచ్చిన ఆర్య.. సూపర్ హిట్‏ను సొంతం చేసుకున్నాడు. ఈ సినిమాకు శక్తి సుందర్ రాజన్ దర్శకత్వం వహించారు. ఇందులో ఆయన సతిమణి సాయేషా హీరోయిన్‏గా చేసింది. వీరిద్దరు రియల్ లైఫ్‏లో ప్రేమవివాహం చేసుకున్న సంగతి తెలిసింది. తాజాగా ఈ టాలెంటెడ్ హీరోపై చీటింగ్ కేసు నమోదైంది.

ఆర్య తనను వివాహం చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని.. అలాగే.. తన దగ్గర నుంచి రూ.70 లక్షలు తీసుకున్నాడని జెర్మనిలో నివసిస్తున్న శ్రీలంకకు చెందిన ఓ యువతి ఆర్యపై కేసు పెట్టింది. అంతేకాకుండా.. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ.. పీఎం, సీఎం, హోం మినిష్టర్ కార్యాలయాలకు లేఖ రాసింది. దీంతో ఆర్య అనుచరుడు మహమ్మద్ అర్మన్ ఆర్య కోసం ముందస్తు బెయిల్ కోరుతూ.. మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విషయం తెలుసుకున్న సదరు యువతి.. ఆర్యకు ముందస్తు బెయిల్ ఇవ్వకుడదని కోరుతూ.. మరో పిటిషన్ దాఖలు చేసింది యువతి. ఈ పిటిషన్‏ను శుక్రవారం న్యాయమూర్తి సెల్వ కుమార్ సమక్షంలో విచారణ జరిగింది. అనంతరం ఈ విచారణను ఏప్రిల్ 4వ తేదీకి వాయిదా వేశారు.

శ్రీలంకకు చెందిన యువతి… కరోనా సమయంలో ఆర్యకు సినిమా అవకాశాలు రాలేదని.. దీంతో తన దగ్గర నుంచి దాదాపు రూ.70 లక్షలు తీసుకున్నాడని.. అంతకు ముందు తనను పెళ్ళి చేసుకుంటానని నమ్మించాడని ఆ యువతి గత నెలలో పీఎం కార్యాలయానికి లెటర్ రాసిన సంగతి తెలిసింది. ఆర్య.. తనను మాత్రమే కాకుండా.. ఇంకా చాలా మంది ఆడవాళ్ళను మోసం చేసాడని.. తనను ప్రేమిస్తున్నానని చెప్పి.. మానసికంగా, శారీరకంగా వేధించేవాడని సదరు యువతి తెలిపింది. అతను డబ్బు తీసుకున్నాడని రుజువుగా తన దగ్గర ఆదారాలున్నాయని.. అతని ఫోన్ రికార్డ్స్, మేసేజ్ స్క్రీన్ షాట్స్ తన దగ్గర ఉన్నాయని వాపోయింది. డబ్బులు తిరిగి ఇవ్వాలని.. ఆర్యతోపాటు.. అతని తల్లిని అడిగానని.. అప్పుడు వారు తనతో అసభ్యంగా మాట్లాడారని చెప్పుకోచ్చింది. హీరో ఆర్యపై చర్యలు తీసుకోవాలని.. అలాగే తన డబ్బును తిరిగి ఇప్పించాలని సదరు యువతి గతనెలలో పిటిషన్ దాఖలు చేసింది.

Also Read:

Vaishnav Tej: వైష్ణవ్‏తో జోడీ కట్టనున్న నాగశౌర్య హీరోయిన్.. త్వరలోనే సెట్స్ పైకి…

న్యూ వెబ్ సిరీస్ స్టార్ట్ చేసిన మెహబూబ్ దిల్‏సే.. నాగార్జున చేతులమీదుగా పోస్టర్ రిలీజ్.. పేరెంటో తెలుసా..