Vaishnav Tej: వైష్ణవ్‏తో జోడీ కట్టనున్న నాగశౌర్య హీరోయిన్.. త్వరలోనే సెట్స్ పైకి…

Vaishnav Tej New Movie Update: చిరంజీవి మేనల్లుడిగా.. ఉప్పెన సినిమాతో వెండితతెరకు పరిచయమై బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు

Vaishnav Tej: వైష్ణవ్‏తో జోడీ కట్టనున్న నాగశౌర్య హీరోయిన్.. త్వరలోనే సెట్స్ పైకి...
Vaishnav Tej
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 28, 2021 | 2:58 PM

Vaishnav Tej New Movie Update: చిరంజీవి మేనల్లుడిగా.. ఉప్పెన సినిమాతో వెండితతెరకు పరిచయమై బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు మెగా హీరో వైష్ణవ్ తేజ్. ఈ సినిమాను డైరెక్టర్ సుకుమార్ శిష్యూడు బుచ్చిబాబు తెరకెక్కించగా.. సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మించాయి. ఈ సినిమాతో కృతి శెట్టి హీరోయిన్‏గా పరిచయమయ్యింది. ఇందులో తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటించి ప్రశంసలు అందుకున్నాడు. ఈ సినిమా తర్వాత వైష్ణవ్‏కు ఆఫర్స్ క్యూకడుతున్నాయి. ఇప్పటికే రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు ఈ యంగ్ హీరో..

అందులో ఒకటి తర్వలో ప్రారంభం కానున్నట్లుగా సమాచారం. అర్జున్ రెడ్డి సినిమాను తమిళంలో రీమేక్ చేసిన డైరెక్టర్ గిరీశయ్య దర్శకత్వంలో వైష్ణవ్ ఓ సినిమా చేయనున్నాడు. ఈ చిత్రాన్ని బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించనున్నాడు. వచ్చే నెల ప్రారంభంలోనే ఈ మూవీకి పూజా కార్యక్రమాలు జరగనున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. తాజాగా వీరిద్ధరి కాంబో గురించి ఓ క్రేజీ అప్ డేట్ ఫిల్మ్ వర్గాల్లో వినిపిస్తోంది. ఇందులో వైష్ణవ్‏కు జోడిగా కేతిక శర్మ నటించనున్నట్లు సమాచారం. ఈ బ్యూటీ ఇప్పటికే యంగ్ హీరో నాగశౌర్య సరసన లక్ష్య సినిమాలో నటిస్తుంది. దీంతోపాటు ఆకాష్ పూరి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న రొమాంటిక్ చిత్రంలో నటిస్తుంది. ఇక వైష్ణవ్ తేజ్.. క్రిష్ డైరెక్షన్లలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీకి జంగిల్ బుక్ అనే టైటిల్‏ను పరిశీలిస్తున్నారట చిత్రయూనిట్. ఇందులో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‏గా నటిస్తోంది. ప్రముఖ రచయిత సున్నపురెడ్డి వెంకట రామిరెడ్డి రాసిన కొండపొలం అనే నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించినట్లుగా తెలుస్తోంది. అలాగే నాగార్జున కూడా వైష్ణవ్‌తో ఒక సినిమా చేయనున్నట్లుగా సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న త్వర‌లోనే రానుంది.  ఈ సినిమాను ఆగస్టులో విడుదలచేయాలని భావిస్తున్నారట చిత్రయూనిట్.

Also Read:

న్యూ వెబ్ సిరీస్ స్టార్ట్ చేసిన మెహబూబ్ దిల్‏సే.. నాగార్జున చేతులమీదుగా పోస్టర్ రిలీజ్.. పేరెంటో తెలుసా..

FilmFare Awards 2021: రికార్డు క్రియేట్ చేసిన ‘తప్పాడ్’.. మరోసారి ఉత్తమ నటిగా తాప్సీ..