రహస్యంగా పెళ్ళి చేసుకున్న ‘చిన్నారి పెళ్ళి కూతురు’ !!.. సోషల్ మీడియాలో ఫోటోస్ షేర్ చేసిన అవికా గోర్..

Avika Gor: స్టార్ మాలో వచ్చిన చిన్నారి పెళ్లి కూతురు సీరియల్‏తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది అవికాగోర్. ఈ సినిమా తర్వాత ఉయ్యాల జంపాల

రహస్యంగా పెళ్ళి చేసుకున్న 'చిన్నారి పెళ్ళి కూతురు' !!.. సోషల్ మీడియాలో ఫోటోస్ షేర్ చేసిన అవికా గోర్..
Avika Gor
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 28, 2021 | 5:01 PM

Avika Gor: స్టార్ మాలో వచ్చిన చిన్నారి పెళ్లి కూతురు సీరియల్‏తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది అవికాగోర్. ఈ సినిమా తర్వాత ఉయ్యాల జంపాల సినిమాతో హీరోయిన్‏గా పరిచయమైంది. ఈ మూవీ తర్వాత సినిమా చూపిస్తా మామ, లక్ష్మీ రావే మా ఇంటికి, రాజుగారి గది 3, ఎక్కడికి పోతావు చిన్నవాడ వంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది అవికాగోర్. తాజాగా ఈ అమ్మడు రహస్యంగా ఓ చర్చిలో పెళ్ళి చేసుకుంది. ఇందుకు సంబందించిన ఫోటోలను తన ఇన్‏స్టాగ్రామ్‏లో షేర్ చేసుకుంది. ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు.. అవికాకు శుభాకాంక్షలు చెబుతుండగా.. మరికొందరు పెళ్ళి ఎప్పుడు చేసుకున్నావు అంటూ కామెంట్స్ చేశారు. అయితే ఆ తర్వాతే ఆ ఫోటోల వెనుక ఉన్న అసలు రహస్యం బయటపడింది.

Avika Gor Marriage

Avika Gor Marriage

అవికా గోర్, ఆదిల్ ఖాన్ ఇద్దరూ కలిసి కాదిల్ అనే సాంగ్ చేశారు. ఈ పాటలో భాగంగా చర్చిలో పెళ్లి జరిగినట్లుగా వెడ్డింగ్ షూట్ చేశారట. త్వరలోనే ఈ సాంగ్ విడుదల కాబోతుంది. అయితే ఇందుకు సంబంధించిన ఓ ఫోటోను అవికా తన ఇన్ స్టాలో షేర్ చేస్తూ.. ఫైనల్లీ అంటూ హార్ట్ సింబల్ జోడించింది. ఇంకేముంది ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు.. అవికాకు పెళ్ళి అయిపోయింది అనుకున్నారు. కానీ.. ఆ హ్యాష్ ట్యాగ్ చివర్లో కాదిల్ స్టే టన్డ్ అంటూ కామెంట్ పెట్టింది అవికా. అంటే..కాదిల్ సాంగ్ త్వరలో రాబోతుందని హింట్ ఇచ్చింది. ఇలా పోస్ట్ చేయడానికి గల కారణం.. సాంగ్ ప్రమోషన్స్‏లో భాగమే అని మరికొందరు అభిప్రాయపడ్డారు. మొత్తానికి అవికా తన ఫ్యాన్స్‏ను ఆటపట్టించిందనే చెప్పుకోవాలి. అవికా  ఎప్పుడూ.. సోషల్ మీడియాలో యాక్టివ్‏గా ఉంటుందన్న విషయం తెలిసిందే. తాను మిలింద్ చంద్వానీ అనే వ్యక్తితో డేటింగ్‌లో ఉన్నట్లు అవికా గత ఏడాది ప్రకటించింది. అయితే ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని కూడా చెప్పింది. మిలింద్ కలిసి దిగిన ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో చాలాసార్లు షేర్ చేసింది. అలాగే డ్యాన్స్‏ను ఎంతగానో ఇష్టపడే అవికా.. అందుకు సంబంధించిన వీడియోలను ఎప్పుడూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూనే ఉంటుంది.

అవికా గోర్ ట్వీట్..

View this post on Instagram

A post shared by Avika Gor (@avikagor)

Also Read:

స్టార్ హీరోపై చీటింగ్ కేసు.. ముందస్తు బెయిల్ ఇవ్వొద్దంటూ మద్రాసు హైకోర్టులో యువతి పిటిషన్..