Smanatha Insta post: అక్కినేని వారి కోడలు సండే ఇంట్లో ఎలా గడుపుతుందో తెలుసా.? సామ్ ఇన్‌స్టా పోస్ట్‌పై ఓ లుక్కేయండి..
Smanatha Insta post: వివాహం తర్వాత కూడా వరుస సినిమాలు చేస్తూ దూసుకెళుతోంది అక్కినేని వారి కోడలు నటి సమంత. ఓవైపు సినిమాల్లో నటిస్తూనే మరో వైపు వ్యాపార రంగంలోనూ తనదైన ముద్ర వేస్తోందీ సామ్. ఇలా క్షణం తీరిక లేకుండా గడిపే సమంత...
Smanatha Insta post: వివాహం తర్వాత కూడా వరుస సినిమాలు చేస్తూ దూసుకెళుతోంది అక్కినేని వారి కోడలు నటి సమంత. ఓవైపు సినిమాల్లో నటిస్తూనే మరో వైపు వ్యాపార రంగంలోనూ తనదైన ముద్ర వేస్తోందీ సామ్. ఇలా క్షణం తీరిక లేకుండా గడిపే సమంత సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తన వ్యాపార, సినిమా, వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకోవడం సామ్‌కు అలవాటు. ఈ క్రమంలోనే తాజాగా ఆదివారం ఎలా గడుపుతున్నానన్న విషయాన్ని సామ్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలియజేసింది. సోఫాలో తన పెట్ డాగ్‌ను హగ్ చేసుకుంటున్న సమయంలో దిగిన ఓ ఫొటోను పోస్ట్ చేసిన సమంత.. ‘సండే రెస్ట్ డే.. కేరింగ్ డే.. హ్యాపీ డే’ అనే ఆసక్తికరమైన క్యాప్షన్‌ను జోడించింది. ఇక వివాహం తర్వాత సమంత పాత్రల ఎంపికలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఆచితూచి ఎంచుకుంటూ అప్‌కమింగ్ హీరోయిన్లకు సైతం సవాళు విసురుతోందీ బ్యూటీ. సమంత నటించిన పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కిన ‘ది ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక గుణశేఖర్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ‘శాకుంతలం’ సినిమాతో పాటు మరో తమిళ చిత్రంలో నటిస్తోందీ భామ.
సమంత ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్..
View this post on Instagram