వధువు నుదిటిపై తిలకం.. పడిన తీరు అద్భుతం.. పెళ్లి వీడియో చూస్తే ఆశ్చర్యం.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో..
Serial Marriage Video Viral : బుల్లితెర ప్రపంచం విభిన్నంగా ఉంటుంది.. ఇందులో కొన్ని సీరియల్స్ జనాల్లో విశేష ఆదరణ పొందుతాయి. వాటిలోని కథ,
Serial Marriage Video Viral : బుల్లితెర ప్రపంచం విభిన్నంగా ఉంటుంది.. ఇందులో కొన్ని సీరియల్స్ జనాల్లో విశేష ఆదరణ పొందుతాయి. వాటిలోని కథ, సన్నివేశాలను సందర్భానుసారంగా తలుచుకుంటారు. అయితే ఒక సీరియల్‌లో యాదృచ్చిక వివాహం గురించి చాలా చర్చలు జరుగుతున్నాయి. ఈ పెళ్లి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..
ఈ సన్నివేశం ఏ సీరియల్‌లో ఉందో ఖచ్చితంగా తెలియదు కానీ పెళ్లి చేసుకోవడానికి ముందు 30 సెకన్లలో జరిగిన యాదృచ్చిక సంఘటన ఆశ్చర్యంగా ఉంది. ఈ వీడియోలో వధువు డ్రెస్సింగ్ టేబుల్ ముందు కూర్చుని అలంకరణ చేసుకుంటుంది. అదే సమయంలో వరుడు డ్రెస్సింగ్ టేబుల్ వద్దకు వస్తాడు. టేబుల్ మీద ఉన్న దువ్వెన తీసుకొని జుట్టును దువ్వడం ప్రారంభిస్తాడు. అయితే యాదృచ్చికంగా అతను ధరించిన షెర్వానీలో ఇరుక్కున్న కుంకుమ భరణి నుంచి ఆమె నుదుటిపై కుంకుమ పడుతుంది. అనుకోకుండా జరిగిన ఈ సంఘటనతో వధువు కళ్లలోకి నీళ్లు చేరుతాయి. ఈ మొత్తం సంఘటన అద్దంలో కనిపిస్తుంది.
ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కరెక్ట్ టైమ్‌కి అలా ఎలా జరగుతుందని కామెంట్స్ చేస్తున్నారు. కొంతమంది సీరియల్‌లో ఏదైనా జరగొచ్చని సరదాగా చెప్పారు. ఈ వీడియోను చూసిన కొందరు నవ్వుతున్నారు. అయితే ఇప్పటివరకు 60,000 మంది ప్రజలు ఈ వీడియోను చూడటం షాకింగ్ న్యూస్. రెండు వేలకు పైగా లైక్‌లు వచ్చాయి. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Don’t you love it when you accidentally get married? ?
TV serials circa 2020 pic.twitter.com/gJ6SqGfB6p
— (I’m done)ⁿ (@Shayonnita15) March 25, 2021