మయన్మార్‌‌లో మారణహోమం.. సైన్యం కాల్పుల్లో 114 మంది బలి.. అంతర్జాతీయంగా వెల్లువెత్తిన నిరసన

మయన్మార్‌ వీధులు రక్తమోడాయి. ఆ దేశ మిలటరీ తూటాలకు రక్తం ఏరులైపారింది. వంద మందికి పైగా పిట్టల్లా రాలిపోయారు. ఈ ఘటనను యావత్ ప్రపంచం ముక్తకంఠంతో ఖండించింది.

మయన్మార్‌‌లో మారణహోమం..  సైన్యం కాల్పుల్లో 114 మంది బలి..  అంతర్జాతీయంగా వెల్లువెత్తిన నిరసన
At Least 114 Killed In Myanmar
Follow us
Balaraju Goud

|

Updated on: Mar 28, 2021 | 1:28 PM

Myanmar in deadliest: మయన్మార్‌ వీధులు రక్తమోడాయి. ఆ దేశ మిలటరీ తూటాలకు రక్తం ఏరులైపారింది. వంద మందికి పైగా పిట్టల్లా రాలిపోయారు. ఈ ఘటనను యావత్ ప్రపంచం ముక్తకంఠంతో ఖండించింది. సైనిక దళాలు సృష్టించిన మారణహోమాన్ని భయానక చర్యగా అభివర్ణించింది.

మయన్మార్ మిలటరీ ఒకవైపు సాయుధ బలగాల దినోత్సవాన్ని జరుపుకుంటూనే నిరసనకారులపై తన క్రూరత్వాన్ని ప్రదర్శించింది. మిలటరీకి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్న వారిపై తుపాకీగుళ్ల వర్షం కురిపించింది. ఈ కాల్పుల్లో శనివారం 114 మందిపైగా మిలటరీ తూటాలకు బలైనట్టుగా మయన్మార్‌లో స్వతంత్ర అధ్యయన సంస్థ వెల్లడించింది. ఫిబ్రవరి 1న మయన్మార్‌లో ప్రభుత్వాన్ని కూలదోసి అధికారాన్ని చేజిక్కించుకుంది సైన్యం. మిలటరీ చర్యకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతోంది.

ఆ దేశ సైన్యాధికారులు ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణిచివేస్తున్నారు. ఇందులో భాగంగా యాంగాన్, మాండాలే సహా 12 పట్టణాల్లో నిరసనకారులపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. మండాలేలో జరిగిన కాల్పుల్లో అయిదేళ్ల బాలుడు మరణించడంతో విషాదం నెలకొంది. మయన్మార్‌ సైనికులు తమని అణగదొక్కాలని చూస్తున్నప్పటికీ వారు గద్దె దిగేవరకు పోరాటం చేస్తూనే ఉంటామని నిరసనకారులు ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నారు. మిలటరీ అధికారాన్ని చేజిక్కించుకున్న తర్వాత ఈ స్థాయిలో కాల్పులు జరగడం ఇదే తొలిసారి. కాగా, ఇప్పటివరకు జరిగిన ఆందోళనల్లో మిలటరీ చర్యలకు మొత్తంగా 400 మంది అమాయకులు ప్రాణాలను కోల్పోయారు.

ఒకే రోజు ఈ స్థాయిలో అమాయకులు బలైపోవడంతో అంతర్జాతీయంగా మయన్మార్‌ మిలటరీపై తీవ్రంగా విమర్శలు వెల్లువెత్తాయి. ‘‘సాయుధ బలగాలు ఇవాళ సిగ్గుతో తలదించుకోవాల్సిన రోజు’’ అని మిలటరీకి వ్యతిరేకంగా అధికారాన్ని కోల్పోయిన ప్రజాప్రతినిధుల కూటమి అధికార ప్రతినిధి డాక్టర్‌ శస అన్నారు. సాయుధబలగాల దినోత్సవం బీభత్సంగా జరిగింది. ఇలాంటి చర్యలు ఎంత మాత్రం సమర్థనీయం కాదు అని మయన్మార్‌లో యూరోపియన్‌ యూనియన్‌ ప్రతినిధుల బృందం మండిపడింది.

మయన్మార్ ఆందోళనకారులపై జరిగిన కాల్పులను అగ్రరాజ్యం అమెరికా తీవ్రంగా ఖండించింది. సైన్యం సృష్టించిన రక్తపాతాన్ని భయానక చర్యగా అభివర్ణించింది. ఈ మేరకు అమెరికా విదేశాంగ శాఖ మంత్రి ఆంటోని బ్లింకెన్ ట్విట్టర్ వేదికగా తన నిరసన తెలిపారు. కొంత మంది కోసం మిలటరీ వ్యవహారిస్తుందని, దీన్ని బర్మా ప్రజలు వ్యతిరేకిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

మరోవైపు మిలటరీ చీఫ్‌ సీనియర్‌ జనరల్‌ మిన్‌ ఆంగ్‌ హాలింగ్‌ ప్రజల పరిరక్షణ కోసమే తామున్నామని అన్నారు. త్వరలోనే స్వేచ్ఛగా, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించి కొత్తగా ఎన్నికైన ప్రభుత్వానికి అధికారాన్ని అప్పగిస్తామని చెప్పారు.

Read Also… ఇండోనేసియాలోని చర్చిని టార్గెట్ చేసిన సూసైడ్ బాంబర్లు, అనేకమందికి గాయాలు

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కాన్వాయ్ చూశారా ??
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కాన్వాయ్ చూశారా ??
రోగాల బెండు తీసే కూరగాయ.. ఆ జిగురుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు..
రోగాల బెండు తీసే కూరగాయ.. ఆ జిగురుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు..
అమ్మా.. నీ అవసరం తీరిపోయింది నిన్నొదిలేస్తున్నా.! వృద్ధాశ్రమం బయట
అమ్మా.. నీ అవసరం తీరిపోయింది నిన్నొదిలేస్తున్నా.! వృద్ధాశ్రమం బయట
30 దాటాకా పెళ్లయినా.. పెద్దగా లాభం లేదట.! ఆలోచించుకోండి మరి..
30 దాటాకా పెళ్లయినా.. పెద్దగా లాభం లేదట.! ఆలోచించుకోండి మరి..
ఒకటి.. రెండు కాదు.. ఒకేసారి వికసించిన 26 బ్రహ్మ కమలాలు.! వీడియో
ఒకటి.. రెండు కాదు.. ఒకేసారి వికసించిన 26 బ్రహ్మ కమలాలు.! వీడియో
బంగారం ధర.. ఇవాళ ఎంతుందంటే.! తగ్గినట్టే తగ్గి మళ్లీ పరుగు..
బంగారం ధర.. ఇవాళ ఎంతుందంటే.! తగ్గినట్టే తగ్గి మళ్లీ పరుగు..
ఇలాంటి కష్టకాలంలో వాళ్లకు రెహమాన్‌ లీగల్ నోటీసులు.! వీడియో.
ఇలాంటి కష్టకాలంలో వాళ్లకు రెహమాన్‌ లీగల్ నోటీసులు.! వీడియో.
కాబోయే భార్యను ఉద్దేశించి నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు.. వీడియో.
కాబోయే భార్యను ఉద్దేశించి నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు.. వీడియో.
విజయ్‌-రష్మిక మళ్లీ దొరికేశారుగా.! లంచ్ చేస్తున్న ఫోటో వైరల్‌..
విజయ్‌-రష్మిక మళ్లీ దొరికేశారుగా.! లంచ్ చేస్తున్న ఫోటో వైరల్‌..
నా మాజీ కోసం చాలా ఖర్చు చేశాను.! సమంత కామెంట్స్ వైరల్‌..
నా మాజీ కోసం చాలా ఖర్చు చేశాను.! సమంత కామెంట్స్ వైరల్‌..