ఇండోనేసియాలోని చర్చిని టార్గెట్ చేసిన సూసైడ్ బాంబర్లు, అనేకమందికి గాయాలు

Umakanth Rao

Umakanth Rao | Edited By: Anil kumar poka

Updated on: Mar 28, 2021 | 1:12 PM

ఇండోనేసియాలోని మకస్సిర్ సిటీలో ఓ చర్చిని టార్గెట్ చేసుకున్న ఇద్దరు సూసైడ్ బాంబర్లు తమను తాము పేల్చివేసుకున్నారు.   ఈ ఘటనలో 14  మంది గాయపడినట్టు అధికారికంగా ప్రకటించినప్పటికీ ఈ సంఖ్య ఇంకా...

ఇండోనేసియాలోని చర్చిని టార్గెట్ చేసిన  సూసైడ్ బాంబర్లు, అనేకమందికి గాయాలు
2 Suicide Bombers Target Mass At Indonesia Church

ఇండోనేసియాలోని మకస్సిర్ సిటీలో ఓ చర్చిని టార్గెట్ చేసుకున్న ఇద్దరు సూసైడ్ బాంబర్లు తమను తాము పేల్చివేసుకున్నారు.   ఈ ఘటనలో 14  మంది గాయపడినట్టు అధికారికంగా ప్రకటించినప్పటికీ ఈ సంఖ్య ఇంకా ఎక్కువే ఉండవచ్చునని భావిస్తున్నారు. ఈస్టర్ పవిత్ర వారం  మొదలైన తోలి రోజే సూసైడ్ బాంబర్లు ఇలా  కేథలిక్ చర్చి బయట చేరి  తమను తాము పేల్చివేసుకున్నారు. సులవేసి ద్వీపం వద్ద గల ఈ చర్చిలోనికి బాంబర్లలో ఒకరు చొరబడేందుకు ప్రయత్నించాడని, అయితే సెక్యూరిటీ గార్డు అతడిని ఆపివేశాడని చర్చ్ ఫాదర్ తెలిపారు. దాంతో ఆ సూసైడ్ బాంబర్ తనను తాను పేల్చివేసుకోవడంతో ఆ ప్రాంతమంతా మంటలు, పొగలతో   భీతావహ వాతావరణం ఏర్పడింది. కొన్ని శరీర భాగాలు  రోడ్డు మధ్యలో ఎగిరి పడ్డాయని, అవి ఈ బాంబర్లవేనా అన్నదిఇంకా నిర్ధారణ కావలసి ఉందని అధికారులు చెప్పారు. ఈ పేలుడుకు తమదే బాధ్యత అని ఎవరూ ప్రకటించనప్పటికీ..  ఇస్లామిక్ స్టేట్ ప్రోత్సాహంతో జమాహ్  అన్షరుత్ దౌలా అనే గ్రూపే దీనికి కారణమని తాము భావిస్తున్నామని పోలీసులు చెప్పారు. లోగడ2018 లోసురబయ సిటీలోని పోలీసు పోస్ట్ పైన, చర్చీల పైనా ఈ విధమైన దాడులు జరిగాయని ఆ దాడుల్లో 30 మంది మృతి చెందగా అనేకమంది గాయపడ్డారని వారు చెప్పారు.

సులవేసి లోని మకస్సిర్ అతి పెద్ద నగరం. ఈ సిటీలో పెద్ద సంఖ్యలో ముస్లిములు, క్రైస్తవులు, ఇతర మతాల వారు నివసిస్తున్నారు . 2002 లో బాలి లోని  టూరిస్ట్ ద్వీపంలో ఇస్లామిక్  మిలిటెంట్లు జరిపిన దాడుల్లో 202 మంది మరణించారు. వీరిలో చాలామంది విదేశీ టూరిస్టులే..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

మరిన్ని చదవండి ఇక్కడ:జక్కన సర్‌ప్రైజ్ గిఫ్ట్‌కు.. షాకైన చెర్రీ..ఫిదా అవుతున్న నెటిజెన్లు..: Rajamouli Gift For Ram Charan Birthday Video.

తల్లిదండ్రులకు విజ్ఞప్తి ..తస్మాత్ జాగ్రత్త ..! మీలాంటి వారి కోసమే ఈ వీడియో..: Message For Parents Video.

టీనేజ్ కూతురితో మజాక్ చేస్తున్న నటి ప్రగతి.. వైరల్ అవుతున్న వీడియో : Actor Pragathi Viral Video.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu