Prison island : అందమైన ద్వీపం.. ప్రమాదకర నేరస్థుల ఖైదు స్థలం.. షాకింగ్ నిజాలు

సముద్రాల మధ్యలో ఉండే  ద్వీపాలు ఎంత సౌంధర్యంతో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చుట్టూరా అందమైన ప్రకృతి.. సముద్రపు జలాలు..

Prison island : అందమైన ద్వీపం.. ప్రమాదకర నేరస్థుల ఖైదు స్థలం.. షాకింగ్ నిజాలు
Brazil's Prison Island
Follow us
Ram Naramaneni

|

Updated on: Mar 28, 2021 | 1:31 PM

సముద్రాల మధ్యలో ఉండే  ద్వీపాలు ఎంత సౌంధర్యంతో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చుట్టూరా అందమైన ప్రకృతి.. సముద్రపు జలాలు.. పక్షుల కిలకిలరావాలు.. ఇసుక తిన్నెలు.. ఆహా భూతల స్వర్గమే కదా. అందుకే సహజ సౌందర్యంతో కూడిన అందమైన ద్వీపాలను చూసేందుకు ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులు వస్తారు. అయితే భయంకరమైన నేరస్థులను ఖైదు చేయడానికి కూడా ఒక ద్వీపం ఉండేదని మీకు తెలుసా. అవును, ఓ అందరమైన ద్వీపాన్ని ఒకప్పుడు ప్రమాదకరమైన నేరస్థుల ఖైదు కోసం వినియోగించారు.

ఒకానొక సమయంలో నేరస్థులను బ్రెజిల్‌లోని ఫెర్నాండో డి నోరోన్హా దీవుల్లో ఖైదు చేశారు. ఈ ద్వీపం సమూహం చుట్టూ 20 చిన్న ద్వీపాలు ఉన్నాయి. ఫెర్నాండో డి నోరోన్హా ద్వీపం 28.5 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఈ ద్వీపాన్ని 16 వ శతాబ్దంలో పోర్చుగీస్ సముద్రయానకుడు ఫెర్నాండో డి నోరోన్హా కనుగొన్నారు. ఆ తరువాత, డచ్, పోర్చుగల్ దేశాల సాయుధ దళాలు దీనిని ఉపయోగించాయి. కానీ తరువాత దీనిని జైలుగా మార్చారు. 18-20 శతాబ్దాల మధ్య ఈ ద్వీపం బ్రెజిల్‌లోని అత్యంత ప్రమాదకరమైన నేరస్థులకు జైలుగా ఉపయోగించబడింది.  ఈ జైలు 1957 లో మూసివేయబడింది. ఆసక్తికర విషయం ఏమిటంటే 1822 లో బ్రెజిల్,  పోర్చుగల్ నుంచి స్వాతంత్య్రం పొందినప్పుడు, ఆ వార్త ఫెర్నాండో డి నోరోన్హా ద్వీపానికి చేరడానికి రెండు సంవత్సరాలు పట్టింది.

ఈ ద్వీపాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించారు. ప్రస్తుతం ఈ ద్వీపానికి వెళ్లాలంటే ప్రత్యేక అనుమతి తీసుకోవాలి. రోజుకు 420 మంది పర్యాటకులు మాత్రమే అక్కడికి వెళ్లేందుకు అనుమతిస్తారు.

Also Read:  ఐపీఎల్​ అభిమానులకు గుడ్ న్యూస్. అక్కడి మ్యాచ్​లపై క్లారిటీ వచ్చేసింది

రామనవమి రోజు భద్రాద్రికి రావొద్దు.. ఆన్ లైన్ టిక్కెట్లు బుక్ చేసుకున్న భ‌క్తుల డబ్బులు వాపస్”.. మంత్రి క్లారిటీ