IPL 2021: ఐపీఎల్​ అభిమానులకు గుడ్ న్యూస్. అక్కడి మ్యాచ్​లపై క్లారిటీ వచ్చేసింది

దేశంలో కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతుంది. కేసుల సంఖ్య ప్రమాదకంగా పెరుగుతుంది. ముఖ్యంగా మహారాష్ట్రలో వ్యాధి తీవ్రత ఎక్కువంగా ఉంది...

IPL 2021:  ఐపీఎల్​ అభిమానులకు గుడ్ న్యూస్. అక్కడి మ్యాచ్​లపై క్లారిటీ వచ్చేసింది
Ipl 2021
Follow us
Ram Naramaneni

|

Updated on: Mar 28, 2021 | 11:10 AM

దేశంలో కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతుంది. కేసుల సంఖ్య ప్రమాదకంగా పెరుగుతుంది. ముఖ్యంగా మహారాష్ట్రలో వ్యాధి తీవ్రత ఎక్కువంగా ఉంది. ఈ నేపథ్యంలో మార్చి 28 నుంచి రాత్రిపూట కర్ఫ్యూ విధిస్తున్నట్లు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రమంలో ముంబైలో జరగనున్న ఐపీఎల్ మ్యాచ్‌లపై కరోనా ఎఫెక్ట్ ఉంటోదేమోనని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. ఐపీఎల్​లో పాల్గొనే క్రికెటర్లు, ఇతర సిబ్బంది బయో బబుల్​ ఉంటారని, దీంతో వాళ్లకు ఈ రూల్స్‌లో వారికి మినహాయింపు ఉంటుందని అసీమ్ గుప్తా చెప్పారు. మ్యాచ్​ల నిర్వహణకు ఎలాంటి ఇబ్బంది ఉండదని, ప్రేక్షకులకు అనుమతి లేదు కాబట్టి షెడ్యూల్​ ప్రకారం అవి జరుగుతాయని వెల్లడించారు.

ముంబై వాంఖడే స్టేడియంలో ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, కోల్​కతా నైట్​రైడర్స్, పంజాబ్ కింగ్స్ జట్లు సాధన చేస్తున్నాయి. ఒకవేళ మహారాష్ట్రలోని కరోనా ఆంక్షలు ఐపీఎల్​ను ప్రభావితం చేసే పరిస్థితి వస్తే అక్కడి మ్యాచ్​లనే వేరే చోటుకు తరలించే విషయమై బీసీసీఐ ఆలోచన చేస్తోందని బోర్డు అధికారి ఒకరు పేర్కొన్నారు. ఏప్రిల్ 9న ప్రారంభమయ్యే ఈ సీజన్​ మొదటి మ్యాచ్​లో ముంబై-బెంగళూరు జట్లు చెన్నై వేదికగా తలపడనున్నాయి. చెన్నై-ఢిల్లీ మధ్య రెండో మ్యాచ్​ ముంబైలో జరగనుంది. కాగా ఐపీఎల్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆతృతతో ఎదురుచూస్తున్నారు. తమ ఫేవరెట్ టీమ్స్.. సత్తా చాటాలని ఆశపడుతున్నారు. మరి ఈ కరోనా మహమ్మారి విరుచుకుపడుతున్న నేపథ్యంలో మ్యాచ్‌లు ఎలా జరుగుతాయో, కప్పు ఎవరు ఎగరేసుకుపోతారో చూడాలి.

Also Read:  పురావస్తుశాఖ తవ్వకాల్లో దొరికిన 7 విచిత్రమైన లడ్డూలు… పరిశోధనలో విస్తుపోయే విషయాలు

చేపను కొనుగోలు చేసిన వ్యక్తి.. దాన్ని కటింగ్ చేయిస్తుండగా కడుపులో షాకింగ్ దృశ్యం

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!