Yusuf Pathan: సచిన్ తర్వాత.. యూసఫ్ పఠాన్‌కు కరోనా పాజిటివ్.. ఆ టోర్నీలో పాల్గొన్న వారిలో కలవరం
Covid-19 positive: దేశంలో కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. ఎన్ని రక్షణ చర్యలు తీసుకుంటున్నప్పటికీ కోవిడ్ బారిన పడుతున్న వారి సంఖ్య
Covid-19 positive: దేశంలో కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. ఎన్ని రక్షణ చర్యలు తీసుకుంటున్నప్పటికీ కోవిడ్ బారిన పడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీల వరకూ అందరూ ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. ఈ రోజు ఉదయం క్రికెట్ మాజీ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. తాజాగా మరో మాజీ క్రికెటర్ కరోనా బారిన పడ్డాడు. మాజీ ఆల్‌రౌండర్ యూసఫ్ పఠాన్‌కు కరోనా సోకింది. ఈ మేరకు ఆయన ట్విట్ చేసి వెల్లడించాడు. తేలికపాటి కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్ష చేయించుకున్నానని.. పాజిటివ్‌గా నిర్థారణ అయిందని యూసఫ్ పఠాన్ ట్విట్ చేశాడు. దీంతో ఇంట్లో ఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలిపాడు. వైద్యుల సలహా మేరకు మందులు తీసుకున్నానని తెలిపాడు. ఇటీవల తనను కలిసిన వారు కూడా జాగ్రత్తగా ఉండాలని, అవసరమైతే కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించాడు.
కాగా.. యూసఫ్ పఠాన్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన తరువాత.. రాయ్‌పూర్‌లో జరిగిన రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్‌లో పాల్గొన్నాడు. ఈ టోర్నీలో సచిన్ టెండూల్కర్, వీరేందర్ సెహ్వాగ్, యువరాజ్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్ సహా పలువురు భారత మాజీ క్రికెటర్లు పాల్గొన్నారు. ఈ క్రమంలోనే సచిన్ టెండూల్కర్ అనంతరం యూసఫ్‌కు పాజిటివ్‌గా నిర్థారణ కావడంతో పలువురు ఆటగాళ్లల్లో ఆందోళన మొదలైంది.
Also Read: