AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీ పిల్లలు ఆన్‌లైన్‌ క్లాసులు వింటున్నారా…? ఒక్కసారి ఈ విషయం చెక్ చేసుకోండి.. లేదంటే వారి భవిష్యత్‌కే ప్రమాదం

ఆన్‌లైన్‌ గేమ్స్, జస్ట్ ఫన్ కోసం మొదలుపెడితే, ఆ గేములే విద్యార్థుల పాలిట శాపంగా మారుతున్నాయి. స్మార్ట్ గేమ్స్‌కు అలవాటుపడిన విద్యార్థులు సమస్తం కోల్పోతున్నారు.

మీ పిల్లలు ఆన్‌లైన్‌ క్లాసులు వింటున్నారా...? ఒక్కసారి ఈ విషయం చెక్ చేసుకోండి.. లేదంటే వారి భవిష్యత్‌కే ప్రమాదం
Online Games
Ram Naramaneni
|

Updated on: Mar 27, 2021 | 7:06 PM

Share

ఆన్‌లైన్‌ గేమ్స్, జస్ట్ ఫన్ కోసం మొదలుపెడితే, ఆ గేములే విద్యార్థుల పాలిట శాపంగా మారుతున్నాయి. స్మార్ట్ గేమ్స్‌కు అలవాటుపడిన విద్యార్థులు సమస్తం కోల్పోతున్నారు. గంటల తరబడి గేమ్స్ మోజులో పడి విద్యకు దూరమై తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు విద్యార్థులు.

పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కనుకుల గ్రామానికి చెందిన 6వ తరగతి విద్యార్థి విపరీతంగా ఆన్‌లైన్‌ గేమ్స్‌కు అలవాటుపడ్డాడు. ఆన్‌లైన్‌ క్లాస్‌ల కోసం తల్లిదండ్రులు కూలీ పని చేసిన స్మార్ట్‌ కొనిస్తే…దాన్ని ఇలా ఉపయోగించుకున్నాడు. ఆన్‌లైన్‌ క్లాసుల పేరుతో 24గంటలూ..మొబైల్‌లో ‌ గేమ్స్‌ ఆడుతూ టైమ్‌ పాస్‌ చేసేవాడు. గేమ్‌లో భాగంగా బొమ్మలకు డ్రస్సులు, షూ, గన్నులు ఇలా రకరకాల ఐటమ్స్ కోసం డబ్బు ఖర్చుచేస్తుండేవాడు. తల్లిదండ్రులకు తెలియకుండా ఇంట్లో, బ్యాంకు ఖాతాల్లో నగదు ఖాళీ చేస్తున్నట్లు తల్లిదండ్రులు గుర్తించారు. కొడుకు పరిస్థితి తెలిసి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కనుకుల గ్రామంలో ఒక్కరు కాదు ఇద్దరు కాదు దాదాపు యాభై మంది విద్యార్థులకు పైగానే ఆన్‌లైన్‌ క్లాసుల పేరుతో ఇలా గేమ్స్ ఆడుతున్నట్లు సమాచారం. ఒక్కో విద్యార్థి వేలల్లో డబ్బులు పోగొట్టుకున్నారు. తల్లిదండ్రులకు తెలియకుండా ఇంట్లో డబ్బులు కూడా దొంగిలిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు తోటి స్నేహితుల వద్ద అప్పులు కూడా చేస్తున్నట్టు నమ్మలేని నిజాలు తెలుస్తున్నాయి. కరోనా మహమ్మారి కారణంగా బడులు మూతపడటంతో విద్యార్థులు ఇటువంటి అడ్డదారులు పడుతున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇకనైనా తల్లిదండ్రులు తస్మాత్ జాగ్రత్త…. మీ పిల్లలు ఏం చేస్తున్నారు…. ఆన్లైన్ క్లాసులో ఉంటున్నారా… లేక ఆన్లైన్ మనీ గేమ్ ఆడుతున్నారా… ఒక్కసారి చూడండి. అయితే కొందరు పేరెంట్స్ మాత్రం ఈ ఆన్లైన్ మనీ గేమ్స్ ను ప్రభుత్వం నిషేధించి, భావి భారత విద్యార్థుల బంగారు భవిష్యత్తును కాపాడాలని కోరుతున్నారు.

Also Read: పురావస్తుశాఖ తవ్వకాల్లో దొరికిన 7 విచిత్రమైన లడ్డూలు.. పరిశోధనలో విస్తుపోయే విషయాలు

ఏపీలో కరోనా స్వైర విహారం.. కొత్తగా 947 పాజిటివ్ కేసులు.. యాక్టివ్ కేసుల సంఖ్య ఇలా ఉంది