AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Corona Cases: ఏపీలో కరోనా స్వైర విహారం.. కొత్తగా 947 పాజిటివ్ కేసులు.. యాక్టివ్ కేసుల సంఖ్య ఇలా ఉంది

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల తీవ్రత కొనసాగుతుంది. గడిచిన 24 గంటల్లో ( శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి శనివారం ఉదయం 9 గంటల వరకు) 42,696 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా..

AP Corona Cases: ఏపీలో కరోనా స్వైర విహారం.. కొత్తగా 947 పాజిటివ్ కేసులు.. యాక్టివ్ కేసుల సంఖ్య ఇలా ఉంది
AP-Corona
Ram Naramaneni
|

Updated on: Mar 27, 2021 | 4:56 PM

Share

Andhra Covid cases:  ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల తీవ్రత కొనసాగుతుంది. గడిచిన 24 గంటల్లో ( శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి శనివారం ఉదయం 9 గంటల వరకు) 42,696 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 947 మందికి వైరస్ సోకినట్లు తేలింది. ఫలితంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 897810కు చేరింది. అదృష్టవశాత్తూ కోవిడ్ వల్ల శుక్రవారం ఒక్క మరణం కూడా సంభవించలేదు. కాగా రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు మరణాల సంఖ్య 7203గా ఉంది.  కొత్తగా 337 మంది వ్యాధి నుంచి కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు. మొత్తం రికవరీల సంఖ్య 885892గా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 4715 యాక్టివ్ కేసులున్నాయి. నేటి వరకు రాష్ట్రంలో 1,49,58,897 కరోనా టెస్టులు చేసినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ శనివారం రిలీజ్ చేసిన బులిటెన్‌లో తెలిపింది.

జిల్లాలవారీగా కేసుల వివరాలు దిగువన చూడవచ్చు

Ap Corona

కరోనా కేసుల ఉధృతి పెరిగిన నేపథ్యంలో జాగ్రత్తలు పాటించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మాస్క్ ధరించడం, భౌతికదూరం పాటించడం తప్పనిసరి అని చెబుతున్నారు. వైరస్‌ను లైట్ తీసుకోవద్దని, అది మరోసారి విజృంభిస్తే ప్రమాదకర పరిస్థితులు తప్పవని హెచ్చరిస్తున్నారు.

దేశంలో కూడా కరోనా విజృంభన:

దేశంలో కరోనా వైరస్ ప్రమాదకరంగా విజృంభిస్తుంది. కొత్త కేసులు, మరణాల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. కొత్తగా దేశంలో 62,258 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. సుమారు ఐదు నెలల తరవాత ఈ రేంజ్ పెరుగుదల కనిపించింది. తాజాగా 291మంది వైరస్ కారణంగా ప్రాణాలు విడిచారు. మొత్తంగా దేశంలో ఇప్పటివరకు 1,19,08,910 మంది వైరస్ భారిన పడగా..1,61,240 మంది ప్రాణాలు విడచినట్లు కేంద్రం తెలిపింది.  ప్రస్తుతం దేశంలో 4,52,647 యాక్టివ్ కేసులున్నాయి. శుక్రవారం ఒక్కరోజే 30,386 మంది వైరస్‌ నుంచి కోలుకున్నారు.

Also Read: Variety Laddoos: పురావస్తుశాఖ తవ్వకాల్లో దొరికిన 7 విచిత్రమైన లడ్డూలు.. పరిశోధనలో విస్తుపోయే విషయాలు

తేయాకు ఆకులు పెరగకుండానే ఎలా కోస్తారు.. అంతా ఉత్తుత్తి… ఫోటో సెషన్ కోసమే.. ప్రియాంకపై షా సెటైర్లు