తేయాకు ఆకులు పెరగకుండానే ఎలా కోస్తారు.. అంతా ఉత్తుత్తి… ఫోటో సెషన్ కోసమే.. ప్రియాంకపై షా సెటైర్లు

దేశంలోని పలు రాష్ట్రాలలో ఇప్పుడు ఎన్నికల వేడి నడుస్తుంది. ఈ  క్రమంలో ప్రధాన పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు.

తేయాకు ఆకులు పెరగకుండానే ఎలా కోస్తారు.. అంతా ఉత్తుత్తి... ఫోటో సెషన్ కోసమే.. ప్రియాంకపై షా సెటైర్లు
Shah Slams Priyanka
Follow us
Ram Naramaneni

| Edited By: Rajeev Rayala

Updated on: Mar 27, 2021 | 4:12 PM

Assam Elections 2021: దేశంలోని పలు రాష్ట్రాలలో ఇప్పుడు ఎన్నికల వేడి నడుస్తుంది. ఈ  క్రమంలో ప్రధాన పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. ముఖ్యంగా ప్రియాంక గాంధీ టార్గెట్‌గా ఆయన విమర్శలు కొనసాగాయాయి. టీ ఆకులు పూర్తిగా పెరగలేదు కాని ప్రియాంక గాంధీ వాటిని ఫోటో సెషన్ల కోసం వినియోగించుకున్నారని షా ఎద్దేవా చేశారు. తోబుట్టువులు కేవలం పర్యాటకం కోసం అస్సాంకు వస్తారని విమర్శించారు. కరీమ్‌గంజ్‌లో జరిగిన బహిరంగా సభలో షా ఈ వ్యాఖ్యలు చేశారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా ప్రియాంకకు చురకలు అంటించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ‘ఛాయ్ వాలా’ అని ఎగతాళి చేసినవాళ్లు.. ఇప్పుడు టీ ఆకులు తెంచుతూ కనిపిస్తున్నారని ఎద్దేవా చేశారు.

ఈనెల ప్రారంభంలో అస్సాం పర్యటనకు వెళ్లిన కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ బిశ్వనాథ్ జిల్లాలోని  తేయాకు (టీ) తోటలను సందర్శించారు. అక్కడి కార్మికులతో కలిసి తానూ ఓ కార్మికురాలిగా మారి  టీ ఆకులను కోస్తూ కనిపించారు. నుదుటికి బ్యాండ్ కట్టుకుని దానికి బ్యాలన్స్ చేస్తున్నట్టు తన వెనుక బుట్టను ఏర్పాటు చేసుకున్న ఆమె.. అందులో టీ ఆకులు వేస్తూ తోటి కార్మికులతో  ముచ్చటిస్తూ వచ్చారు. అలాగే నడుముకు ఏప్రాన్ ను కూడా ప్రియాంక కట్టుకున్నారు. సాధురూ టీ గార్డెన్ అనే చోటికి ఈమె రాగానే.. ఆమెకు కార్మికులు ఘన స్వాగతం పలికారు.  ఇందుకు సంబంధించిన  ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

కాగా అస్సాంలో ప్రస్తుతం అమిత్ షా సుడిగాలి పర్యటన చేస్తున్నారు. ప్రేమ పేరుతో బలవంతంగా మతమార్పిడులకు పాల్పడే లవ్ జిహాద్‌‌కు తాము వ్యతిరేకమని స్పష్టం చేశారు. లవ్ జిహాద్‌‌కు వ్యతిరేకంగా చట్టాలు తీసుకొచ్చేందుకు తాము కట్టుబడి ఉన్నట్లు చెప్పారు. . ‘భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోలో చాలా అంశాలు ఉన్నాయి. అయితే వీటిల్లో లవ్, ల్యాండ్ జిహాద్‌‌కు వ్యతిరేకంగా చట్టాలు తీసుకురావడం ముఖ్యమైనవి’ అని షా  పేర్కొన్నారు. మహిళా సాధికారతలో భాగంగా కాలేజీలకు వెళ్లే అమ్మాయిలకు ఫ్రీగా స్కూటీలు ఇస్తామన్నారు. అస్సాంను ఉగ్రవాద రహిత రాష్ట్రంగా మార్చామని చెప్పారు.

Also Read: Variety Laddoos: పురావస్తుశాఖ తవ్వకాల్లో దొరికిన 7 విచిత్రమైన లడ్డూలు.. పరిశోధనలో విస్తుపోయే విషయాలు

చేపను కొనుగోలు చేసిన వ్యక్తి.. దాన్ని కటింగ్ చేయిస్తుండగా కడుపులో షాకింగ్ దృశ్యం

నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం.. రూ.6 కోట్ల లాటరీ టికెట్‌ అలా ఇచ్చేసింది.. మీరు కచ్చితంగా హ్యాట్సాఫ్ చెబుతారు