Balaraju Goud |
Updated on: Mar 28, 2021 | 2:22 PM
అంతర్జాతీయ వాణిజ్యానికి జీవనాడి లాంటి ఈజిప్టు సమీపంలోని సూయిజ్ కాలువలో అతిపెద్ద కంటైనర్ నౌకల్లో ఒకటైన ఎవర్ గివెన్ నౌక చిక్కుకుంది.
జపాన్‌లోని షూయీ కిసెన్ కేకే సంస్థకు చెందిన ఎవర్ గివెన్ నౌక సూయిజ్ కాలువలో అడ్డంగా ఇరుక్కుపోయింది.
ఒకవైపు భాగం కాల్వ ఒడ్డును ఢీకొనడంతో అందులో కూరుకుపోయింది. టగ్‌బోట్లు, డ్రెడ్జర్ల సహాయంతో ఇరుక్కుపోయిన నౌకను తప్పించేందుకు సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.
కాలువలో ఎవర్ గివెన్ నౌక అడ్డంగా ఇరుక్కుపోవడంతో ఈ మార్గంలో నౌకల రాకపోకలు నిలిచిపోయాయి ప్రస్తుతం నౌకకు ఉత్తరం, దక్షిణ భాగంలో 200లకు పైగా నౌకలు నిలిచాయి. మరో 100 నౌకలు ఇదే మార్గం దిశగా వస్తున్నాయి.
ఈ నౌక మట్టిలో కూరుకుపోయిన కారణంగా గంటకు సుమారు రూ.2,896 కోట్ల వ్యాపారంపై ప్రభావం పడుతున్నట్టు నిపుణులు అంచనా వేశారు.
ఐరోపా, ఆసియాలను కలిపే సూయిజ్ కాలువ పొడవు 193 కిలోమీటర్లు. ఈజిప్టు వద్ద ఈ కీలక జలమార్గాన్ని 1859-69 మధ్య ఏర్పాటు చేశారు.
ఎవర్ గివెన్‌లో నౌకను బయటకు తీసేందుకు భారతీయ సిబ్బంది సైతం తమ సేవలను అందిస్తున్నారు.