Japan gives India 225 bn Yen : చిన్న దేశం, పెద్ద మనసు : భారత్‌కు రెండు బిలియన్ డాలర్ల సాయం చేస్తున్న మిత్ర దేశం ఏదో తెలుసా.?

Japan gives India 225 bn Yen : ఇండియాలో పలు ప్రాజెక్టులకు జపాన్ భారీ ఆర్ధిక సాయం..

  • Venkata Narayana
  • Publish Date - 10:11 pm, Sat, 27 March 21
1/7
Indo Japan 2
ఇండియాలో పలు కీలక ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులకు జపాన్ భారీ ఆర్ధిక సాయాన్ని ప్రకటించింది. 200 కోట్లకు పైగా (2.11 బిలియన్ డాలర్లు) ఫైనాన్షియల్ హెల్ప్ కింద ఈ నిధులను విడుదల చేస్తున్నట్టు జపాన్ ప్రభుత్వం తెలిపింది.
2/7
Indo Japan 9
ఇందులో ఢిల్లీ మెట్రో నాలుగో దశకు ఉద్దేశించిన సాయం కూడా ఉంది. బెంగుళూరు మెట్రో రైలు రెండో దశ ప్రాజెక్టుకు 52.03 బిలియన్ యెన్ లు, ఢిల్లీ మెట్రో నాలుగో దశకు 119.97 బిలియన్ యెన్ లు విడుదల కానున్నాయి. ఢిల్లీ మెట్రోకు మొదటి నుంచీ జపాన్ సాయం చేస్తూ వస్తోంది.
3/7
Indo Japan 3
హిమాచల్ ప్రదేశ్ క్రాప్ డైవర్సిఫికేషన్ ప్రమోషన్ రెండో దశ ప్రాజెక్టుకు 11.30 బిలియన్ యెన్ ల ఆర్ధిక సాయం లభించబోతోంది.
4/7
Indo Japan 7
ముఖ్యంగా రాజస్థాన్ లోని రెండు జిల్లాలలో (జునిజ్ను, బార్మర్) గ్రామీణ నీటి సరఫరా వ్యవస్థకు ఈ సాయం ఉద్దేశించినది.
5/7
Indo Japan 4
అండమాన్ నికోబార్ దీవుల్లో పవర్ సప్లయ్ ప్రాజెక్టులకు 4.01 బిలియన్ యెన్ రుణం లభిస్తుందని జపాన్ ఎంబసీ తెలిపింది.
6/7
Indo Japan 8
ఆర్ధిక శాఖ ఉన్నతాధికారి మహాపాత్ర - జపాన్ రాయబారి సతోషి సుజుకీ చర్చల సారం
7/7
Indo Japan 1
ఆర్ధిక మంత్రిత్వ శాఖకు చెందిన డిపార్ట్ మెంట్ ఆఫ్ ఎకనామిక్ ఎఫైర్స్ అదనపు కార్యదర్శి సీ.ఎస్. మహాపాత్ర.. జపాన్ రాయబారి సతోషి సుజుకీ మధ్య జరిగిన చర్చల నేపథ్యంలో ముఖ్యంగా ఇండియాకు సంబంధించిన ఈ రుణసాయం తాలూకు ఒడంబడిక కుదిరింది.