Facebook Save Life: నిండు ప్రాణం నెలబెట్టిన సోషల్‌ మీడియా.. ఆపద్భాంధవులైన ఆన్‌లైన్‌ స్నేహితులు..

Facebook Save Life: 'సోషల్ మీడియాలో చెడు స్నేహాలతో తప్పుదోవ పడుతోన్న యువత.. సోషల్‌ మీడియా ద్వారా అమ్మాయిలను వేధిస్తోన్న ప్రబుద్దుడు..' సోషల్‌ మీడియాకు సంబంధించి మనం ఎక్కువగా వినే మాటలు ఇవే. అయితే...

Facebook Save Life: నిండు ప్రాణం నెలబెట్టిన సోషల్‌ మీడియా.. ఆపద్భాంధవులైన ఆన్‌లైన్‌ స్నేహితులు..
Facebook Friends Save Life
Follow us
Narender Vaitla

|

Updated on: Mar 28, 2021 | 2:25 PM

Facebook Save Life: ‘సోషల్ మీడియాలో చెడు స్నేహాలతో తప్పుదోవ పడుతోన్న యువత.. సోషల్‌ మీడియా ద్వారా అమ్మాయిలను వేధిస్తోన్న ప్రబుద్దుడు..’ సోషల్‌ మీడియాకు సంబంధించి మనం ఎక్కువగా వినే మాటలు ఇవే. అయితే ఇటీవల కృష్ణాజిల్లా జగ్గయ్యపేటలో జరిగిన ఓ సంఘటన మాత్రం సోషల్‌ మీడియా ద్వారా చెడే కాదు మంచి కూడా జరుగుతుందని చాటి చెప్పింది. వివరాల్లోకి వెళితే.. సతీష్‌ అనే యువకుడు పదిహేనేళ్లుగా కృష్ణాజిల్లా జగ్గయ్యపేటలోని హోటళ్లలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కరోనా లాక్‌డౌన్‌ కారణంగా సతీష్‌ ఉపాధిని కోల్పోయి తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడు. ఈ క్రమంలోనే స్వస్థలం అయిన అనంతపురం వెళ్లిన సతీష్‌ గత కొన్ని రోజులుగా ఫేస్‌బుక్‌ స్నేహితులతో తన కష్టాలను చెప్పుకొచ్చాడు. అయితే తాజాగా ఆర్థిక ఇబ్బందులు మరింత ఎక్కువ కావడంతో తనువు చాలించాలని నిర్ణయించుకున్న సతీష్‌ రైల్వే ట్రాక్‌పై ప్రాణాలు విడవాలని డిసైడ్‌ అయ్యాడు. చివరిగాసారిగా.. ‘ఇక అందరికి గుడ్‌ బై సూసైడ్ చేసుకుంటున్నాను. నన్ను అభిమానించిన వారందరికీ ధన్యవాదాలు. నా జీవితం అంతే తప్పు చేశా’ అంటూ స్టేటస్‌ పెట్టుకున్నాడు. దీంతో ఆ స్టేటస్‌ను చూసిన ఫేస్‌బుక్‌ ఫ్రెండ్స్‌ వెంటనే అలర్ట్‌ అయ్యి సతీష్‌కు ఫోన్ కాల్‌ చేశారు. కానీ సతీష్ ఎంతకు కాల్‌ లిఫ్ట్‌ చేయకపోయే సరికి.. అన్నపూర్ణ సేవాసమితి వ్యవస్థాపకుడు మహంకాళి ప్రకాష్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వెంటనే అప్రమత్తమైన పోలీసులు టెక్నికల్‌ ఇన్‌ఫర్మేషన్‌ ఆధారంగా సతీష్‌ అనంతపురానికి 10 కి.మీల దూరంలో ఉన్నట్లు గుర్తించారు. వెంటనే సతీష్ ఉన్న ప్రాంతానికి చేరుకున్న పోలీసులు ఆయనను కాపాడారు. మరో ఏడు నిమిషాల్లో రైలు వస్తుందన్న సమయంలో సతీష్‌ను రక్షించారు. ఇలా ఫేస్‌బుక్‌ ఓ నిండు ప్రాణాన్ని కాపాడింది.

Also Read: మయన్మార్‌‌లో మారణహోమం.. సైన్యం కాల్పుల్లో 114 మంది బలి.. అంతర్జాతీయంగా వెల్లువెత్తిన నిరసన

Holi 2021: హోలీలో వాడే గులాల్ రంగు నుంచి మీ జుట్టును ఈ విధంగా కాపాడుకోండిలా..

Prison island : అందమైన ద్వీపం.. ప్రమాదకర నేరస్థుల ఖైదు స్థలం.. షాకింగ్ నిజాలు