Holi 2021: హోలీలో వాడే గులాల్ రంగు నుంచి మీ జుట్టును ఈ విధంగా కాపాడుకోండిలా..

Holi Festival 2021:హోలీ అంటేనే రంగుల పండుగ అని అర్థం. వయసుతో సంబంధం లేకుండా.. ఈ సంబరాలను జరుపుకుంటుంటారు.

Holi 2021: హోలీలో వాడే గులాల్ రంగు నుంచి మీ జుట్టును ఈ విధంగా కాపాడుకోండిలా..
Holi Tips For Hair
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 28, 2021 | 1:06 PM

Holi Festival 2021:హోలీ అంటేనే రంగుల పండుగ అని అర్థం. వయసుతో సంబంధం లేకుండా.. ఈ సంబరాలను జరుపుకుంటుంటారు. పెద్దవారు చిన్నపిల్లలుగా మారిపోయి.. రంగులను చల్లుకుంటూ ఎంజాయ్ చేస్తారు. ఈ వేడుకలలో ఎన్నో రకాల రంగులను ఉపయోగిస్తూంటారు. అయితే అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది గులాల్. ప్రతి హోలీ వేడుకలలో గులాల్ రంగు ప్రధానంగా వాడుతుంటారు. ఈ రంగు దుస్తులపై, జుట్టుపై పడితే వదిలించడం చాలా కష్టం. ఇక దానిని వదిలించుకోవడానికి మనం చేసే ప్రయత్నాలు అన్ని ఇన్ని కావు. ఇక ఈ రంగు జుట్టుపై పడితే.. నిర్జీవంగా మారిపోతుంది. అలాగే.. క్రమంగా జుట్టు ఉడిపోయే ప్రమాదం ఉంటుంది. అలా కాకుండా ఈ రంగు నుంచి మీ జుట్టును ఎలా కాపాడుకోవాలో తెలుసుకుందామా.

జాగ్రత్తలు..

1. హోలీ సంబరాల్లో పాల్గోనే ముందు మీ జుట్టును గట్టిగా అల్లి కొప్పుగా చుట్టుకోండి. ఇలా చేయడం వలన ప్రతి వెంట్రుకలోకి వెళ్లకుండా ఉంటాయి. 2. కొప్పుగా చుట్టిన జుట్టుకు స్కార్ఫ్ కట్టుకోవడం ఉత్తమం. అయితే స్కార్ఫ్ మరీ గట్టిగా కట్టకూడదు. ఎందుకంటే హోలీ సంబరాల్లో మీరున్న సమయంలో తలనొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. 3. హోలీ సంబరాలకు ముందుగా మీ తలకు ఆయిన్ పెట్టడం ఉత్తమం. ఎందుకంటే.. ఒకవేళ మీ జుట్టు పై గులాల్ వేసిన ఆ తర్వాత దానిని సులభంగా తొలగించుకోవచ్చు. 4. ఇక ఈ హోలీ వేడుకలు ముగిసిన తర్వాత మీ జుట్టును అలానే వదిలేయకుండా. షాంపుతో మసాజ్ లా చేయండి. ఒకవేళ జుట్టుపై గులాల్ పడినట్లయితే.. వేరే కెమికల్స్ షాంపూలను వాడకుండా.. ఆయుర్వేద షాంపూలను వాడడం ఉత్తమం. 5. జుట్టును కడిగే సమయంలో అసలు వేడి నీరు ఉపయోగించకూడదు. గోరు వెచ్చని నీటిలో జుట్టును కడగడం మంచింది. దీనివల్ల జుట్టు నిర్జివంగా మారిపోకుండా ఉంటుంది. 6. ఇక జుట్టును శుభ్రంగా కడిగిన అనంతరం.. కండీషనర్ లేదా ఆయిల్ పెట్టడం ముఖ్యం. అలాగే మీ హెయిర్ ఆరిన తర్వాత హెయిర్ మాస్క్ వేయడం ఉత్తమం.

Also Read:

Holi 2021: మీ ఫ్రెండ్స్‏కు హోలీ విష్ చేసారా ? అయితే వాట్సప్‏లో ఈ అందమైన హోలీ స్టిక్కర్లను పంపెయండిలా..