Hair Care Healthy Tips : పొడవైన, నల్లగ నిగనిగలాడే అందమైన ఆరోగ్యవంతమైన జుట్టు మీ సొంతం కావాలంటే..

ఆడవారికి అందాన్నిచ్చేది జుట్టు. అందుకే జుట్టున్నమ్మ ఏ కొప్పేసినా అందంగానే ఉందంటారు. ముఖ్యంగా కరోనా వచ్చిన తర్వాత జుట్టు ఊడిపోతుంది అని బాధపడుతున్నవారికోసం ఒత్తైన జుట్టు పెరగడానికి వంటింట్లో..

Hair Care Healthy Tips : పొడవైన, నల్లగ నిగనిగలాడే అందమైన ఆరోగ్యవంతమైన జుట్టు మీ సొంతం కావాలంటే..
Black Long Healthy Hair
Follow us
Surya Kala

|

Updated on: Mar 27, 2021 | 3:08 PM

Hair Care Healthy Tips : ఆడవారికి అందాన్నిచ్చేది జుట్టు. అందుకే జుట్టున్నమ్మ ఏ కొప్పేసినా అందంగానే ఉందంటారు. ముఖ్యంగా కరోనా వచ్చిన తర్వాత జుట్టు ఊడిపోతుంది అని బాధపడుతున్నవారికోసం ఒత్తైన జుట్టు పెరగడానికి వంటింట్లో చిట్కాలే బాగా ఉపయోగపడతాయి.

పొడవైన జుట్టు కోసం

అలోవేరా జెల్ ఈ – విటమిన్ కాప్సిల్స్ కొబ్బరి నూనె ఆముదం అలోవెరా జెల్‌ని తీసుకుని జుట్టుకి పట్టించి నెమ్మదిగా ఓ అయిదు నిమిషాలపాటు మర్దనా చేయాలి. ఆ తరువాత మరో బౌల్‌లో ఈ-విటమిన్ కాప్సిల్‌లో ఉండే ఆయిల్‌ని తీసుకుని అందులో 1 స్పూన్ ఆముదం, 2 స్పూన్ల కొబ్బరి నూనె తీసుకుని బాగా కలపాలి. ఈ మిశ్రమానికి కొద్దిగా వేడి నీరు కూడా జత చేయాలి. దీన్ని తలకు పట్టించి 5 నిమిషాలపాటు మర్దనా చేయాలి. ఇలా మళ్లీ ఒకసారి చేయాలి. ఓ గంట సేపు ఉంచి గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. ఇలా వారానికి 4,5 సార్లు చేస్తే జుట్టు మృదువుగా ఉండడమే కాకుండా, పొడవుగా పెరుగుతుంది.

ఇప్పుడున్న పొల్యూషన్ వల్ల కావచ్చు, మనం తీసుకునే ఆహారం వల్ల కావచ్చు, రోజు రోజుకు పెరుగుతున్న వత్తిడి వల్ల కావచ్చు ఇలా అనేక కారణాల వల్ల చుండ్రు సమస్యని కూడా బాగా ఎదుర్కుంటున్నాము. దీని నివారణకు చక్కని చిట్కా మనకు తెలసిన వస్తువులతోనే..

చుండ్రు నివారణకు

1 స్పూన్ మెంతి పోడి 1 స్పూన్ కుంకుడుకాయ పొడి 1 స్పూన్ పుల్లటి పెరుగు పై మూడింటిని కలిపి గంటసేపు నానబెట్టాలి. దీన్నితలకు ప్యాక్‌లా వేసి 45 నిమిషాలు వుంచి గోరువెచ్చని నీళ్లతో కడగాలి. ఇది తలలో వుండే చుండ్రుని షాంపూలకంటే మెరుగ్గా నిర్మూలిస్తుంది.

తెల్ల జుట్టుని నల్లగా మార్చే చిన్న చిట్కా

4 స్పూన్ల ఉసిరిపొడి 4 స్పూన్ల కుంకుడుకాయ పొడి 4 స్పూన్ల శీకాయపొడి పై మూడింటిని రాత్రిపూట నీటిలో నానబెట్టాలి. దీనికి ఉదయాన్నే 4 స్పూన్ల గోరింటపొడి కలిపి రెండు మూడు గంటలు నానబెట్టాలి. తరువాత ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తే తెల్లజుట్టు నల్లగా మారుతుంది. అయితే ఎన్ని చేసినా మరోవైపు తప్పనిసరిగా మంచి పోషకాహారం తినాల్సిందే.. !

Also Read: Vedam Nagaiah Passed Away: టాలీవుడ్ లో మరో విషాదం.. అనారోగ్యంతో వేదం నాగయ్య కన్నుమూత 11. Most Visited Places in India: మనదేశంలోని ఈ ప్రముఖ ప్రదేశాలను తక్కువ ఖర్చుతో చూడవచ్చు.. వివరాల్లోకి వెళ్తే..!

రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట
ఇస్లాం మతంలోకి మారాలని అభిమాని సలహా.. బిగ్ బాస్ బ్యూటీ ఏమందంటే?
ఇస్లాం మతంలోకి మారాలని అభిమాని సలహా.. బిగ్ బాస్ బ్యూటీ ఏమందంటే?
అనిల్‌ అంబానీ లగ్జరీ ఇల్లు గురించి మీకు తెలుసా? దాని విలువ ఎంతంటే
అనిల్‌ అంబానీ లగ్జరీ ఇల్లు గురించి మీకు తెలుసా? దాని విలువ ఎంతంటే
మద్యం సేవించినా ఏమీ కాకూడదంటే పచ్చి మిర్చి తింటే చాలు..
మద్యం సేవించినా ఏమీ కాకూడదంటే పచ్చి మిర్చి తింటే చాలు..