డీఎంకే ఎంపీ ఎ. రాజా వ్యాఖ్యలపై తమిళనాడు సీఎం పళనిస్వామి ఆగ్రహం, ఉద్వేగం, కంట తడి
డీఎంకే ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి ఎ.రాజా చేసిన అనుచిత వ్యాఖ్యలపై తమిళనాడు సీఎం, అన్నాడీఎంకే నేత పళనిస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక దశలో కన్నీటి పర్యంతమయ్యారు.
డీఎంకే ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి ఎ.రాజా చేసిన అనుచిత వ్యాఖ్యలపై తమిళనాడు సీఎం, అన్నాడీఎంకే నేత పళనిస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక దశలో కన్నీటి పర్యంతమయ్యారు. చెన్నైలో ఆదివారం జరిగిన ఓ ర్యాలీలో పాల్గొన్న ఆయన.. తన తల్లి పట్ల రాజా చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమన్నారు. డీఎంకే చీఫ్ స్టాలిన్ ని, పళనిస్వామి నాయకత్వాన్ని రాజా పోలుస్తూ ..స్టాలిన్ పొలిటికల్ కెరీర్ పూర్తిగా పరిణతి చెందిన బేబీలా ఉండగా, పళని నాయకత్వం అక్రమ సంబంధంతో పుట్టిన అపరిణత బేబీలా ఉందని వ్యాఖ్యానించారు. ఇంతఘోరమైన మాటలను ఒక ముఖ్యమంత్రికి ఆపాదించి అంటారా అని పళనిస్వామి ప్రశ్నించారు.
ఒక ముఖ్యమంత్రికే ఇలా ఉంటే ఇక సామాన్యుల మాటేమిటన్నారు. వారిని ఎవరు రక్షిస్తారన్నారు. తను పేద రైతు కుటుంబం నుంచి వచ్చానని, తన తల్లి ఓ గ్రామంలో రైతుగా రాత్రి, పగలు కష్టపడేదని ఆయన అన్నారు. ఆమె మరణించి చాలా కాలమైందని, మహిళల పట్ల ఒక నేత గౌరవం లేకుండా ఇలా అనుచితంగా మాట్లాడడం ఏ మాత్రం క్షంతవ్యం కాదని అన్నారు. ఇలాంటి వారు అధికారంలోకి వస్తే ఇక సామాన్య ప్రజల గతి ఏమవుతుందో ఆలోచించాలన్నారు. ఇలాంటివారికి ప్రజలే గుణపాఠం చెప్పాలని ఆయన అన్నారు.
తల్లులు పేదలైనా, ధనికులైనా సమాజంలో వారికి ఉన్నత స్థానం ఉందని, వారిని ఎవరు అవమానించినా దేవుడు శిక్షిస్తాడని పళనిస్వామి చెప్పారు. కాగా పళనిస్వామి పుట్టుక గురించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన రాజాపై అన్నాడీఎంకే నేతల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దాఖలు చేశారు. తమిళనాడులో పలు చోట్ల అన్నాడీఎంకే కార్యకర్తలు రాజా దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. ఆయనను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. రాజా తమ పార్టీ నేత స్టాలిన్ ని ప్రశంసిస్తూ, పళనిస్వామిని దూషిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
TN CM EPS emotionally breaks down about DMK MP A Raja’s derogatory remarks about his mother. Campaigning in Thiruvotriyur he said just because an ordinary person who is not from a big family has become 1/2 pic.twitter.com/f81DQUgycV
— Savukku_Shankar (@savukku) March 28, 2021
మరిన్ని ఇక్కడ చదవండి: Tirupati Bypoll 2021: ఆంధ్రప్రదేశ్‌కు కాబోయే ముఖ్యమంత్రి ఆయనే.. మోదీ చెప్పారంటూ సోము వీర్రాజు సంచలన కామెంట్స్..