Tirupati Bypoll 2021: ఆంధ్రప్రదేశ్‌కు కాబోయే ముఖ్యమంత్రి ఆయనే.. మోదీ చెప్పారంటూ సోము వీర్రాజు సంచలన కామెంట్స్..
Tirupati Bypoll 2021: పవన్ కల్యాణ్‌ను ఈ రాష్ట్రానికి అధిపతిని చెయ్యాలి. అంటే ఏపీకి సీఎంని చేస్తారా..? పవన్‌ని సీఎం చేసే లక్ష్యంతోనే..
Tirupati Bypoll 2021: పవన్ కల్యాణ్‌ను ఈ రాష్ట్రానికి అధిపతిని చెయ్యాలి. అంటే ఏపీకి సీఎంని చేస్తారా..? పవన్‌ని సీఎం చేసే లక్ష్యంతోనే బీజేపీ ఉందా? అవుననే సంకేతాలే ఇస్తోంది ఏపీ బీజేపీ. పవన్‌ని పువ్వుల్లో పెట్టుకుని చూసుకోవాలని సోమువీర్రాజుకి మోదీ చెప్పారట. తిరుపతి ఉప ఎన్నిక ప్రచార సభలో ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు సోము. ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్‌షాలకు పవన్ బాగా ఇష్టమైన వ్యక్తి అని, అతన్ని అన్ని విధాలా గౌరవించి తీరతామంటున్నారు బీజేపీ రాష్ట్ర నేతలు. అంతేకాదు.. ఈ అంశాన్ని ట్రూ స్పిరిట్‌తో బీజేపీ, జనసేన కార్యకర్తలు తీసుకోవాలని సూచిస్తు్నారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి అంటూ ఘంటాపథంగా నొక్కి చెప్పారు సోము వీర్రాజు.
ఇంతకీ ఏం జరిగిందంటే.. తిరుపతి ఉపఎన్నికల నేపథ్యంలో బీజేపీ, జనసేన పార్టీలు సమన్వయ సమావేశాన్ని నిర్వహించాయి. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ, జనసేన శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించిన సోము వీర్రాజు.. పవన్ కళ్యాణ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి కాబోయే సీఎం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాన్ అని అన్నారు. పవన్‌ను సీఎంగా చూడాలని ప్రధాని మోదీ కూడా అభిలషించారని చెప్పుకొచ్చారు. ‘పవన్ కళ్యాణ్‌కు సముచిత గౌరవం ఇవ్వాలని స్వయంగా ప్రధాని మోదీనే నాకు సూచించారు. తామిద్దరం హెలికాప్టర్‌లో ప్రయాణిస్తున్నప్పుడు.. పవన్‌ను పువ్వులా చూడాలన్నారు.’ అంటూ సోము ప్రసంగించారు. అంతేకాదు.. పవన్ అంటే ప్రధాని మోదీకి, అమిత్ షాకు విపరీతమైన అభిమానం అట. 2014 ఎన్నికల సమయంలో వర్షంలో తడుస్తూ ఇదే తిరుపతిలో నరేంద్ర మోదీ, పవన్ కళ్యాణ్ బహిరంగ సభలో ప్రసంగించారని నాటి సందర్భంగాన్ని సోము వీర్రాజు గుర్తు చేశారు. ప్రధాని మోదీ ఆకాంక్షను బీజేపీ, జనసేన కార్యకర్తలు ట్రూ స్పిరిట్‌తో తీసుకోవాలని, సమన్వయంతో పని చేసి తదుపరి ఎన్నికల్లో విజయబావుటా ఎగురవేయాలని పిలుపునిచ్చారు.
ఇదిలాఉంటే.. సోము ప్రసంగం అనంతరం జనసేన పార్టీ ముఖ్య నేత నాదెండ్ల మనోహర్ ప్రసంగించారు. ఆయన కూడా ఇలాంటి కామెంట్సే చేశారు. పవన్ కళ్యాణ్ ముమ్మాటికీ సీఎం అభ్యర్థి అని ఉద్ఘాటించారు. అంకిత భావంతో పని చేసే నాయకుడు ఆయనేనని పేర్కొన్నారు. ఆయన కోసం అందరం కలిసి కష్టపడి పని చేయాలని అన్నారు.
Also read:
LIC Housing Finance: కస్టమర్లకు బంపర్ ఆఫర్… ఆరు నెలల ఈఎంఐ (EMI)లు మాఫీ.. ఎలాగంటే..!
Ever Given Re-Floated: హమ్మయ్య.. సూయజ్ కాలువలో ఇరుక్కుపోయిన భారీ కంటైనర్ షిప్ ఎట్టకేలకు కదిలింది..