AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sharad Pawar : ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌‌కు తీవ్ర అస్వస్థత.. ముంబైలోని బ్రీచ్ కాండీ ఆస్పత్రిలో చేరిక..

Sharad Pawar :ఎన్‌సిపి చీఫ్, సీనియర్ రాజకీయ నాయకుడు శరద్ పవార్‌ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఒక్కసారిగా..

Sharad Pawar : ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌‌కు తీవ్ర అస్వస్థత.. ముంబైలోని బ్రీచ్ కాండీ ఆస్పత్రిలో చేరిక..
Sharad Pawar
Shiva Prajapati
| Edited By: Ram Naramaneni|

Updated on: Mar 29, 2021 | 5:01 PM

Share

Sharad Pawar :ఎన్‌సిపి చీఫ్, సీనియర్ రాజకీయ నాయకుడు శరద్ పవార్‌ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఒక్కసారిగా కడుపునొప్పి రావడంతో ఆయనను చికిత్స కోసం ముంబైలోని బ్రీచ్ కాండీ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆయనకు పరీక్షలు నిర్వహించి.. పిత్తాశయంలో సమస్య ఉత్పన్నమైనట్లుగా తేల్చారు. అయనకు శస్త్ర చికిత్స చేయాల్సిన అవసరం ఉందని వైద్యులు చెప్పారు. వైద్యుల సూచనల మేరకు శరద్ పవార్‌ ఈనెల 31వ తేదీన శస్త్ర చికిత్స చేయించుకోనున్నారు. ఈ విషయాన్ని ఎన్‌సీపీ నాయకుడు నవాబ్ మాలిక్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. శరద్ పవార్‌ అరోగ్య పరిస్థితి సరిగా లేదని, ఆయన ఉదరసంబంధమైన సమస్యలతో తీవ్రంగా బాధపడుతున్నారని పేర్కొన్నారు. తమ నేత ఆరోగ్యం మెరుగయ్యే వరకు అన్ని కార్యక్రమాలను రద్దు చేస్తున్నట్లు నవాబ్ మాలిక్ ప్రకటించారు.

Nawab Malik Tweet:

ఇదిలాఉంటే.. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో శరద్ పవార్ భేటీ అయినట్లు వార్తలు గుప్పుమన్నాయి. దీనిపై అటు హోమంత్రి అమిత్ షా, ఎన్సీపీ నేతలు స్పందించారు. అలాంటి సమావేశమేమీ జరుగలేదని తేల్చి చెప్పారు. కాగా, అమిత్ షాతో భేటీ అయ్యారంటూ వార్తలు గుప్పుమన్న గంటల వ్యవధిలోనే శరద్ పవార్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. వాస్తవానికి ఎన్సీపీ అధినేత శరద్ పవార్ పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ తరఫున ప్రచారం చేయాల్సి ఉంది. ఏప్రిల్ 1న పశ్చిమబెంగాల్‌లో మూడు రోజుల పాటు పవార్ రాజకీయ పర్యటను పెట్టుకున్నారు. ఆ మూడు రోజుల షెడ్యూల్‌లో పవార్ వివిధ ర్యాలీలు, సమావేశాలు, సభలలో పాల్గొనాల్సి ఉంది. అయితే, తాజాగా పరిణామాల నేపథ్యంలో ఆయన షెడ్యూల్ అంతా క్యాన్సిల్ అయినట్లైంది.

Also read:

Tirupati Bypoll 2021: ఆంధ్రప్రదేశ్‌కు కాబోయే ముఖ్యమంత్రి ఆయనే.. మోదీ చెప్పారంటూ సోము వీర్రాజు సంచలన కామెంట్స్..

Viral Video: తనను తినడానికి వచ్చిన చిరుత పులితో హైడ్ అండ్ సీక్ ఆడిన కుందేలు… సోషల్ మీడియాలో వీడియో వైరల్

Holi 2021:కరోనా నిబంధనలను పాటిస్తూ.. సేఫ్ గా రంగుల పండుగను జరుపుకుంటున్న హీరోయిన్లు జెనీలియా, రష్మిక, రకుల్

మోదీ పాలనలో అంబేద్కర్ ఆలోచనల ప్రతిధ్వని
మోదీ పాలనలో అంబేద్కర్ ఆలోచనల ప్రతిధ్వని
సైకిల్‌ కంటే నెమ్మదిగా ప్రయాణించే రైలు..! అయినా ఫుల్లు డిమాండ్..
సైకిల్‌ కంటే నెమ్మదిగా ప్రయాణించే రైలు..! అయినా ఫుల్లు డిమాండ్..
పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ