Beauty Tips: నిత్యం ఆహారంగా తీసుకునే బియ్యంతోనే అద్భుతమైన ముఖారవిందం మీ సొంతం.. అదెలాగంటే..
Beauty Tips: అందంగా కనిపించేందుకు మనం రకరకాల ప్రయోగం చేస్తుంటారు. భారీ స్థాయిలో డబ్బులు వెచ్చించి కాస్మోటిక్స్ కొనుగోలు..
Beauty Tips: అందంగా కనిపించేందుకు మనం రకరకాల ప్రయోగం చేస్తుంటారు. భారీ స్థాయిలో డబ్బులు వెచ్చించి కాస్మోటిక్స్ కొనుగోలు చేసి అప్లై చేస్తుంటారు. ఇంకొందరు ఏవేవో క్రీములు వాడుతుంటారు. ముఖారవిందం కోసం కొత్త ప్రయోగాలు చేస్తుంటారు. అయితే అవేవీ లేకుండానే, సహజ సౌందర్యాన్ని ఇలా సొంతం చేసుకోండి. మనం నిత్యం ఆహారంగా తీసుకున్న బియ్యంతో అద్భుతమైన ముఖ వర్ఛస్సును పొందొచ్చు. బియ్యం పిండిని ఫేస్‌మాస్క్‌గా ఉపయోగించడం ద్వారా మృదువైన చర్మంతో పాటు.. కళకళలాడే ముఖారవిందం మీ సొంతం అవుతుంది. మరి బియ్యం పిండితో ఫేస్ మాస్క్ ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
బియ్యం పిండితో ఫేస్‌మాస్క్‌లు ఎలా చేయాలంటే.. 1. ఒక బౌల్‌లో రెండు టేబుల్‌స్పూన్ల బియ్యం పిండి తీసుకోవాలి. ఆ పిండికి సరిపడా పాలు పోలి మెత్తగా కలపాలి. ఆ పేస్టును ముఖానికి రాసుకుని 30 నిమిషాల తరువాత మంచినీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా తరచుగా చేయడం వలన మంచి ఫలితం ఉంటుంది. 2. ఒక కప్‌లో సరిపడినంత బియ్యం పిండిని తీసుకోవాలి.ఆ పిండిలో ఒక టేబుల్ స్పూన్ అలొవెరా రసాన్ని కలపాలి. దాంతోపాటు.. ఒక టేబుల్ స్పూన్ తేనె వేసి మూడింటినీ బాగా కలపాలి. మొత్తం ఒక పేస్టులా తయారు చేసుకోవాలి. కాసేపటి తరువాత ఆ పేస్ట్‌ను ముఖానికి మాస్క్‌లా అప్లై చేసుకోవాలి. 20 నుంచి 30 నిమిషాల తరువాత నీటితో ముఖాన్ని కడుక్కోవాలి. ఇలా చేయడం ద్వారా ముఖ చర్మం మెరుస్తుంది. 3. ఒక కప్ సైజ్ గిన్నెలో ఫేస్‌కు సరిపడా బియ్యం పిండిని తీసుకోవాలి. దాంట్లో కొంత అరటి పండు గుజ్జు, అరటేబుల్ స్పూన్ ఆముదం వేసి బాగా కలపాలి. దాన్ని పేస్టులా తయారు చేసుకుని ముఖానికి అప్లై చేయాలి. అరగంటల తరువాత చన్నీళ్లతో శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేయడం ద్వారా చర్మం నిగారింపు పెరుగుతుంది.
Also read: