AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Driverless Tractor: అన్నదాత వ్యవసాయానికి సాయం చేసిన ఓ యువరైతు.. డ్రైవర్ లేకుండా నడిచే ట్రాక్టర్ సృష్టి..

అన్నివాహనాల డ్రైవింగ్ కంటే.. భిన్నమైనది లారీ, ట్రాక్టర్ డ్రైవింగ్.. అందులో మరీ కష్టమైంది ట్రాక్టర్ ను నడపడం.. ఎందుకంటే ట్రాక్టర్ వెనుక ట్రాలీ ని కేరింగ్ గా ట్రాక్టర్ తో పాటు తీసుకొచ్చేలా చూసుకుంటూ...

Driverless Tractor: అన్నదాత వ్యవసాయానికి సాయం చేసిన ఓ యువరైతు.. డ్రైవర్ లేకుండా నడిచే ట్రాక్టర్ సృష్టి..
Driverless Tractor
Surya Kala
|

Updated on: Mar 29, 2021 | 1:02 PM

Share

Driverless Tractor :అన్నివాహనాల డ్రైవింగ్ కంటే.. భిన్నమైనది లారీ, ట్రాక్టర్ డ్రైవింగ్.. అందులో మరీ కష్టమైంది ట్రాక్టర్ ను నడపడం.. ఎందుకంటే ట్రాక్టర్ వెనుక ట్రాలీ ని కేరింగ్ గా ట్రాక్టర్ తో పాటు తీసుకొచ్చేలా చూసుకుంటూ డ్రైవింగ్ చేయాలి.. ఇక ట్రాక్టర్ తో పొలం దుక్కి దున్నేటప్పుడు ట్రాక్టర్ ను ఎవరూ లేకుండా మాయలు మంత్రాలు ఉన్న సినిమాల్లోలా.. దానికి అదే నడిస్తే.. బాగుంటుంది అని అనుకోని రైతు ఉండదేమో.. ఎందుకంటే ట్రాక్టర్ తో దుక్కి దున్నేటప్పుడు చాలా మంది రైతులు బాక్ పెయిన్ తో బాధపడుతుంటారు. ఇది ఎన్నో ఏళ్లుగా అన్నదాత ఎదుర్కొంటున్న సమస్య.. అయితే ఇప్పుడు ఆ సమస్యకు చెక్ పెడుతూ.. ట్రాక్టర్ దానంతట అదే దుక్కి దున్నేసే విధంగా ఓ యువ రైతు నయా ట్రాక్టర్ ను ఆవిష్కరించాడు.. వివరాల్లోకి వెళ్తే..

రాజస్థాన్ లోని బారో నివసిస్తున్న యోగేష్ అనే 19 ఏళ్ల యువ రైతు ఎవరూ లేకుండా టాక్టర్ నడిచే విధంగా సరికొత్త ట్రాక్టర్ ను ఆవిష్కరించాడు. డ్రైవర్‌ సాయంతో నడిచే ట్రాక్టర్‌లో మార్పులు చేసి ఈ ఘనత సాధించాడు.

యోగేష్ బీఎస్సి ఫస్ట్ చదువుతున్నాడు.. అప్పుడు నాన్నకు హెల్త్ ప్రాబ్లెమ్ ఉంది.. వెంటనే ఇంటికి రా అనే ఫోన్ వచ్చింది. దీంతో తండ్రి దగ్గర ఉన్న యోగేష్.. [పొలం పనులకు వెళ్లాల్సి వచ్చింది. అప్పుడు యోగేష్ కి వ్యవసాయంలోని కష్టనష్టాలపై కొంచెం అవగాహన వచ్చింది. ముఖ్యంగా పొలం దున్నే సమయంలో ట్రాక్టర్ ని నడపడం ఎంత కష్టమో అర్ధమయ్యింది. దీంతో తన బుర్రకు పదును పెట్టాడు.. అసలు ట్రాక్టర్ ను డ్రైవర్ లేకుండా ఎందుకు నడపకూడదు అనిఅనుకున్నాడు..

వెంటనే 2 వేల రూపాయలతో ప్రయోగం మొదలు పెట్టాడు.. అయితే తండ్రి ఇది ఎలా పనిచేస్తుందో తనకు వివరిస్తే.. అప్పుడు అది తనకు నచ్చితే అప్పుడు మరింత డబ్బులిస్తాను అని కొడుక్కి మాట ఇచ్చాడు. యోగేశ్ రెండు వేల రూపాయలతో కొన్ని పరికరాలను కొనుగోలు చేశాడు,రిమోట్ సాయంతో ట్రాక్టర్ ను వెనుక నుండి ముందుకు నడిపించాడు. తండ్రికి తన ఆలోచనలపై నమ్మకం కలిగించాడు.

అప్పుడు తండ్రి తన కొడుకు యోగేష్ చెప్పిన విషయంపై నమ్మకం కలిగి రూ. 50 వేలు అప్పు చేసి మరీ ఇచ్చాడు. యోగేశ్ డ్రైవర్ లేకుండా ట్రాక్టర్ తయారు చేశాడు. ఈ ట్రాక్టర్ తో రైతుకు ఎన్నో లాభాలు అంటున్నాడు యోగేష్.. ఆరోగ్య సమస్యలు లేకుండా చేస్తుందని.. డబ్బు, సమయం ఆదా అవుతుందని తెలిపాడు. యోగేష్ రూపొందించిన రిమోట్ కంట్రోలర్ ట్రాక్టార్ ను చూసిన స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: కరోనా నిబంధనలను పాటిస్తూ.. సేఫ్ గా రంగుల పండుగను జరుపుకుంటున్న హీరోయిన్లు జెనీలియా, రష్మిక, రకుల్

తనను తినడానికి వచ్చిన చిరుత పులితో హైడ్ అండ్ సీక్ ఆడిన కుందేలు… సోషల్ మీడియాలో వీడియో వైరల్