BHEL Recruitment 2021: హైదరాబాద్ బీహెచ్‌ఈఎల్‌లో అప్రెంటిస్ పోస్టులు.. తెలంగాణ అభ్యర్థులకు ప్రాధాన్యం..
BHEL Recruitment 2021: హైదరాబాద్‌లోని రామచంద్రపురంలో ఉన్న ప్రముఖ ప్రభుత్వ రంగం సంస్థ భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (బీహెచ్‌ఈఎల్) అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి, అర్హత కలిగినవారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. అయితే...
BHEL Recruitment 2021: హైదరాబాద్‌లోని రామచంద్రపురంలో ఉన్న ప్రముఖ ప్రభుత్వ రంగం సంస్థ భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (బీహెచ్‌ఈఎల్) అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి, అర్హత కలిగినవారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. అయితే ఈ పోస్టులను ఏడాది కాలపరిమితికి భర్తీ చేయనున్నారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన వారికి ప్రాధాన్యత ఉంటుంది. పూర్తి వివరాలకు https://apprenticeshipindia.org/, https://hpep.bhel.com/ చూడండి.
ముఖ్య విషయాలు..
మొత్తం ఖాళీలు: 130 భర్తీ చేయనున్న స్థానాలు: ఫిట్టర్ 58, ఎలక్ట్రీషియన్ 18, మెషినిస్ట్ 16, మెషినిస్ట్ గ్రైండర్ 3, టర్నర్ 15, వెల్డర్ 11, కార్పెంటర్ 2, ఫౌండ్రీ మ్యాన్ 2, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్ 2, ఎలక్ట్రానిక్ మెకానిక్ 2, డీజిల్ మెకానిక్ 1, మోటార్ మెకానిక్ 1, మెకానిక్ ఆర్ అండ్ ఏసీ 1. అర్హతలు: పదో తరగతితోపాటు సంబంధిత ట్రేడ్‌లో 60 శాతం మార్కులతో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. 2018 తర్వాత ఐటీఐ ఉత్తీర్ణులైనవారు దరఖాస్తు చేసుకోవాలి. వయసు: ఈ అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేసుకోవాలనుకునే అభ్యర్థులు 2021, మార్చి 1 నాటికి 27 ఏళ్లలోపువారై ఉండాలి. వయోపరిమితి: కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు ఉంటాయి. దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌లో దరఖాస్తులకు చివరితేదీ: ఏప్రిల్ 11 వెబ్‌సైట్: https://apprenticeshipindia.org/, https://hpep.bhel.com/