Homemade Summer Drink: వేసవిలో శరీరాన్ని చల్లబరిచే సొంపు డ్రింక్ తయారీ .. ఈ డ్రింక్ తో ప్రయోజనాలు తెలిస్తే వదలరుగా..!

వేసవి కాలం వచ్చింది. భానుడు భగభగా మండుతూ.. తన ప్రతాపం చూపిస్తున్నాడు. ఇక దాహం కూడా ఓ రేంజ్ వేస్తుంది. మరోవైపు ఎండనుంచి వచ్చిన శరీరం చల్లదనాన్ని కోరుకుంటుంది. డీహైడ్రేషన్ ఏర్పడితే..

Homemade Summer Drink: వేసవిలో శరీరాన్ని చల్లబరిచే సొంపు డ్రింక్ తయారీ .. ఈ డ్రింక్ తో ప్రయోజనాలు తెలిస్తే వదలరుగా..!
Fennel Powder Drink Recipe
Follow us
Surya Kala

|

Updated on: Mar 29, 2021 | 3:18 PM

Homemade Summer Drink: వేసవి కాలం వచ్చింది. భానుడు భగభగా మండుతూ.. తన ప్రతాపం చూపిస్తున్నాడు. ఇక దాహం కూడా ఓ రేంజ్ వేస్తుంది. మరోవైపు ఎండనుంచి వచ్చిన శరీరం చల్లదనాన్ని కోరుకుంటుంది. డీహైడ్రేషన్ ఏర్పడితే.. సహజంగా కూల్ డ్రింక్స్ వైపు దృష్టిసారిస్తారు.. అయితే కృత్రిమమైన డ్రింక్స్ బదులు.. సహజసిద్ధంగా తయారు చేసుకునే పానీయాలు తీసుకుంటే.. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎంతో మంచిది. ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా.. ఈరోజు వేసవి దాహార్తిని తీర్చే సోంపు గింజలతో డ్రింక్ తయారీ విధం.. ఉపగయోగాలు తెలుసుకుందాం..!

త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు:

సోంపు గింజ‌ల పొడి పావు క‌ప్పు నీళ్లు రెండు కప్పులు ప‌టిక బెల్లం రుచికి సరిపడా నిమ్మ ర‌సం కొంచెం న‌ల్లరంగు కిస్మిస్ ఒక స్పూన్

త‌యారీ విధానం:

ముందుగా సోంపు గింజ‌ల పొడిని నీటిలో 2 నుంచి 3 గంట‌ల పాటు నాన‌బెట్టాలి. అదే సమయంలో న‌ల్ల కిస్మిస్‌ల‌ను కూడా నీటిలో నాన‌బెట్టాలి. మూడు గంటల తర్వాత సోంపు గింజ‌ల పొడి నీటిని వడకట్టి.. దానిని ఒక గ్లాస్ లోకి తీసుకోవాలి. తరువాత నల్ల కిస్మిస్ ను మెత్తగా చేసుకుని ఆ సోంపు నీటిలో కలపాలి. ఆ మిశ్ర‌మంలో ప‌టిక బెల్లం, నిమ్మ‌ర‌సం క‌లుపుకోవాలి.తర్వాత టెస్ట్ కు సరిపడే నీరు వేసుకోవాలి.. అంతే సోంపు గింజ‌ల డ్రింక్ త‌యార‌వుతుంది.

ఉపయోగాలు :

ఈ సొంపు గింజల డ్రింక్ ను వేస‌విలో రోజూ తాగితే..వేసవి తాపం నుంచి ఉపశమనం పొందవచ్చు. శ‌రీరం చ‌ల్ల‌గా ఉంటుంది. వేసవిలో ఉష్ణోగ్ర‌త‌ల నుంచి ర‌క్ష‌ణ ల‌భిస్తుంది. డీహైడ్రేష‌న్ బారిన ప‌డ‌కుండా ఉంటారు. శ‌రీరంలోని వ్య‌ర్థాలు బ‌య‌ట‌కు పోతాయి. అధిక బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు. అనేక ఆరోగ్య‌క‌రమైన ప్ర‌యోజ‌నాలు కూడా ఉన్నాయి.

Also Read:  ప్రపంచంలోనే ఈ బీచ్ వెరీ స్పెషల్.. రోజుకు రెండు గంటలు మాయం.. అప్పుడు ముత్యాలు లభ్యం ఎక్కడంటే..!

మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!