Health Tips: రాత్రి నిద్రపోయే సమయంలో ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా..? ఇది తెలుసుకోండి.. ఫిట్‌గా ఉండండి..!

Health Tips: ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు పెద్దలు. ఆరోగ్యంగా ఉంటేనే.. ఏమైనా చేయగలం.. ఏదైనా సాధించగలం. కానీ ప్రస్తుత...

Health Tips: రాత్రి నిద్రపోయే సమయంలో ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా..? ఇది తెలుసుకోండి.. ఫిట్‌గా ఉండండి..!
Fruits
Follow us
Shiva Prajapati

|

Updated on: Mar 29, 2021 | 2:58 PM

Health Tips: ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు పెద్దలు. ఆరోగ్యంగా ఉంటేనే.. ఏమైనా చేయగలం.. ఏదైనా సాధించగలం. కానీ ప్రస్తుత ఉరుకులు, పురుగుల ప్రపంచంలో ప్రజల జీవన విధానమే పూర్తిగా మారిపోతోంది. ఫలితంగా అనారోగ్యం బారిన పడుతున్నారు. పరిస్థితి చేయిదాటిపోతుండటంతో ఇప్పుడిప్పుడే జనాల్లోనూ ఆరోగ్యంపై అవగాహన వస్తోంది. అనారోగ్యానికి గురై.. ఆస్పత్రుల్లో లక్షలు పారబోసుకునే బదులు కొద్దిగా జీవన శైలిలో మార్పులు చేసుకుని, మంచి ఆహారం, కాస్త వ్యాయామం చేస్తే సరిపోతుందని నిర్ణయానికి వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆరోగ్య నిపుణులు ప్రజలకు పలు సూచనలు, సలహాలు చేస్తు్న్నారు. ఏ టైమ్‌లో ఎలాంటి ఆహారం తీసుకోవాలనే దానిపై వివరిస్తున్నారు. ఇక ఉదయం సమయంలో టిఫిన్ తీసుకోవడం ఎంత ముఖ్యమో.. రాత్రి పడుకునే సమయంలోనూ ఆహారం తినడం అంతే ముఖ్యం అంటున్నారు వైద్యులు. ముఖ్యంగా రాత్రి సమయంలో తేలికపాటి, పోషకాలతో నిండిన ఆహారం తీసుకుంటే మంచిదని చెబుతున్నారు. ప్రోటీన్లు, కార్పోహైడ్రేట్స్, ఫైబర్ ఎక్కువగా ఉండే స్నాక్స్‌కు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచిస్తున్నారు. ఫలితంగా బరువు కూడా తగ్గుతారని చెబుతున్నారు.

మరి వైద్యులు సూచిస్తున్న ఆ తేలికపాటి ఆహారం ఏంటో ఒకసారి చూద్దాం.. 1. రాత్రి సమయంలో తేలికగా జీర్ణమయ్యే పండ్లను తినడం చాలా మంచిది. 2. కీరదోస చాలా మంచిది. ఇది ప్రొటీన్లు, ఫ్యాట్స్, కార్పోహైడ్రేట్‌ల జీవక్రియలను వేగవంతం చేస్తాయి. 3. ద్రాక్ష, స్ట్రాబెర్రీ, అరటిపండు, యాపిల్ తో కలిపి యోగర్ట్ చేసుకోవాలి. దీనిని తినడం ద్వారా శరీరానికి కావాల్సిన శక్తి వస్తుంది. రాత్రి సమయంలో ఇది తినడం వలన నిద్రకూడా పడుతుంది. 4. ద్రాక్ష, దానిమ్మ, యాపిల్ పండ్లను నేరుగా తినడం ద్వారా కూడా మంచి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. 5. ప్రొటీన్లు సమృద్ధిగా ఉండే పీనట్ బటర్ టోస్ట్‌ను రాత్రిపూట నిద్రపోయే సమయంలో తింటే చాలా మంచిదని వైద్యులు చెబుతున్నారు.

మొత్తంగా రాత్రి పడుకునే సమయంలో తేలికపాటి ఆహారం తీసుకుంటేనే మంచి ఆరోగ్య ఫలితాలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు.