Benefits of Rice water: అన్నం ఉడికిన తర్వాత గంజి పారబోస్తున్నారా..? ఈ ప్రయోజనాలు తెలిస్తే చుక్క కూడా వేస్ట్ చెయ్యరు
చాలా సార్లు మనం ఒక పాత్రలో బియ్యం ఉడికించినప్పుడు, అన్నం ఉడికిన మిగిలిన నీటిని పారబోస్తాము. వీటిని పల్లెటూరి భాషలో గంజి అంటాం.
చాలా సార్లు మనం ఒక పాత్రలో బియ్యం ఉడికించినప్పుడు, అన్నం ఉడికిన మిగిలిన నీటిని పారబోస్తాము. వీటిని పల్లెటూరి భాషలో గంజి అంటాం. అయితే మన పూర్వీకులు.. ఈ గంజిని కూడా ఆహారంలో భాగం చేసుకునేవారు. ఇప్పటి జనరేషన్‌లో చాలామందికి ఆ విషయం కూడా తెలియదు. ఈ గంజి గురించి ప్రయోజనాలు తెలిస్తే.. మీరు కూడా దాన్ని మీ డైలీ మెనూలో భాగం చేసుకుంటారు. గంజి మీ జుట్టు, చర్మ ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతుంది.
‘రైస్ వాటర్’ యొక్క ప్రయోజనాలు:
– కాలానుగుణ ఇన్ఫెక్షన్ లేదా వైరల్ జ్వరం సమయంలో గంజి తాగడం వల్ల డిహైడ్రేషన్ ఉండదు. జ్వరం కూడా తగ్గుతుంది. వేసవిలో గంజి డిహైడ్రేషన్ నుంచి కాపాడుతుంది.
– గంజి మలబద్ధకం సమస్యను తొలగిస్తుంది. జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. జీవక్రియ రేటును పెంచుతుంది.
– గంజిలో కార్బోహైడ్రేట్లు చాలా ఉన్నాయి. ఇవి శరీరానికి తక్షణ శక్తిని ఇస్తాయి. అలాగే, ఇన్‌ఫెక్షన్ సోకకుండా కాపాడుతుంది
– గంజి మంచి కండీషనర్ కూడా. షాంపూ పెట్టిన తర్వాత జుట్టు మీద కండీషనర్‌గా వాడండి. ఇది జుట్టు క్వాలిటీని మెరుగుపరుస్తుంది.
– జుట్టు రాలడం వంటి సమస్యలతో బాధపడుతుంటే… గంజి మీకు మంచి మెడిసిన్. దీనిలోని అమైనో ఆమ్లాలు జుట్టు రాలడాన్ని నివారిస్తాయి. గంజిలో విటమిన్ బి, సి, ఇలను కలిగి ఉంటుంది. ఇవి జుట్టు పెరుగుదలకు ఉపకరిస్తాయి.
– ఈ నీరు స్కిన్ టోనర్‌గా కూడా పనిచేస్తుంది. ముడతల నుండి ముఖాన్ని రక్షిస్తుంది. ఇందుకోసం గంజిని కాటన్ బాల్‌లో తీసుకొని ముఖం మీద మెత్తగా పూసుకుని ఆరనివ్వండి. ఆరిపోయిన తర్వాత శుభ్రం చేసుకోండి.
– మొటిమల సమస్యలు ఎదుర్కోవడంలో కూడా గంజి మేలు చేస్తుంది. ఇది మొటిమల కారణంగా ఏర్పడిన ఎరుపు మచ్చలు, వాపు, దురదలను తొలగిస్తుంది. కొత్త మొటిమలు ఏర్పడకుండా నిరోధిస్తుంది. రాత్రి పడుకునేటప్పుడు రోజూ ముఖానికి గంజి పూసుకుంటే ముఖంలో గ్లో పెరుగుతుంది.
బియ్యం నీటిని ఎలా తయారు చేయాలి?
ఒక పాత్రలో.. బియ్యం, రెట్టింపు నీరు వేసి మరిగించాలి. అన్నం మంచిగా ఉడికిన తర్వాత..అందులో మిగిలిన నీటిని జల్లెడ ద్వారా వేరు చేయాలి. ఆ తర్వాత ఆ నీటిని జుట్టు లేదా చర్మ సంరక్షణ కోసం వినియోగించొచ్చు. మీరు ఈ నీరు త్రాగాలనుకుంటే.. కొద్దిగా నెయ్యి, ఉప్పు వేసి త్రాగొచ్చు.
(గమనిక: ఏదైనా చికిత్సకు ముందు వైద్యుడ్ని సంప్రదించండి)
Also Read: జుట్టు రాలడం సమస్యతో బాధపడుతున్నారా ?.. డోంట్ వర్రీ.. పరిష్కారం ఇదిగో..!
ఖర్జూర పండ్లతో ఎంతో ఆరోగ్యం.. పుష్కలంగా ఖనిజాలు, ఎన్నో ప్రయోజనాలు