Amazing Tips: ముఖం అందంగా మెరవాలా? ఈ ఫేస్ ప్యాక్‌తో.. ఇదిగో ఇలా ట్రై చేయండి…!
Carrot Face Pack: విటమిన్-ఎ ఎక్కువగా ఉంటుంది. విటమిన్-ఎ కంటి చూపును మెరుగుపరుస్తుంది. చర్మ సౌందర్యాన్ని కూడా పెంచుతుందనే సంగతి మీకు తెలుసా? అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం...
పండ్లు, కందమూలాలు మానవుడికి ప్రకృతి ప్రసాదించిన అపురూపమైన వరంగా చెప్పుకోవచ్చు. ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలుగా తెలుసు. అన్నంతో అవసరం లేకుండా ప్రకృతిసిద్ధమైన పండ్లు, కూరగాయలు ఇతర త్రుణధాన్యాలను ఆహారంగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి. ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం. అయితే క్యారెట్లలో అన్ని పోషకాల లోకెల్లా విటమిన్-ఎ ఎక్కువగా ఉంటుంది. విటమిన్-ఎ కంటి చూపును మెరుగుపరుస్తుంది. చర్మ సౌందర్యాన్ని కూడా పెంచుతుందనే సంగతి మీకు తెలుసా? అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం…
క్యారెట్ వల్ల ఆరోగ్యానికి లభించే ప్రయోజనాలు గురించి మీకు తెలిసిందే. అయితే క్యారెట్ ఆరోగ్యం కోసం మాత్రమే కాదు. అందాన్ని కూడా పెంచుతుంది. శరీరానికి శక్తిని అందించినట్లే.. సౌందర్య సాధనంగా కూడా క్యారెట్ ఉపయోగపడుతుంది. క్యారెట్‌లో బీటా కెరోటిన్లూ, విటమిన్-A, విటమిన్-C, విటమిన్-K పుష్కలంగా ఉంటాయి. మీ ముఖ వర్చస్సు మెరవాలంటే తప్పకా ఇలా చేయండి…
ఈ ఫేస్ మాస్కుతో ఇలా ట్రై చేయండి…
- – 4 స్పూన్ల క్యారెట్ జ్యూస్‌లో 2 స్పూన్ల బొప్పాయి జ్యూస్, అందులో కొద్దిగా పాలు వేసి బాగా మిక్స్ కావాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి గంట తర్వాత నీళ్లతో కడిగేస్తే చాలు ముఖం కాంతివంతంగా మారుతుంది.
- – క్యారెట్ యాంటీ ఏజింగ్ కారకంగా కూడా పనిచేస్తుంది. రెండు టీ స్పూన్ల క్యారెట్ రసంలో, కొంచెం అరటి పండు గుజ్జు, గుడ్డులోని తెల్లసొన, నాలుగు చుక్కల నిమ్మరసం వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖంపై రాసుకుని 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగితే ముఖం మీద మడతలు మాయమవుతాయి.
- – ఒక టీస్పూన్ క్యారెట్ రసంలో, కొద్దిగా తేనె కలిపి ముఖానికి రాసుకోవాలి. 15 నిమిషాల తర్వాత ముఖాన్ని చల్లటి నీటితో కడిగేయండి. ఇలా వారానికి మూడు సార్లు చేస్తే చాలు ముఖం ఫ్రెష్‌గా మారుతుంది.