AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Benefits of Dates: ఖర్జూర పండ్లతో ఎంతో ఆరోగ్యం.. పుష్కలంగా ఖనిజాలు, ఎన్నో ప్రయోజనాలు

నేటి వేగవంతమైన జీవితంలో ఒత్తిడి, అలసట సర్వసాధారణం అయిపోయాయి . అయితే, ఒత్తిడి మన మెదడును కూడా ప్రభావితం చేస్తుంది.

Health Benefits of Dates: ఖర్జూర పండ్లతో ఎంతో ఆరోగ్యం.. పుష్కలంగా ఖనిజాలు, ఎన్నో ప్రయోజనాలు
Dates Benifits
Ram Naramaneni
|

Updated on: Mar 31, 2021 | 9:29 AM

Share

Benefits of eating dates: నేటి వేగవంతమైన జీవితంలో ఒత్తిడి, అలసట సర్వసాధారణం అయిపోయాయి . అయితే, ఒత్తిడి మన మెదడును కూడా ప్రభావితం చేస్తుంది. మెదడు సామర్థ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. మనందరికీ తెలిసినట్లుగా, ఖర్జూర పండ్లు ఆరోగ్యానికి చాలా ఉపయోగపడతాడు. ఖర్జూర పండ్లలో భాస్వరం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం ఉంటాయి. ఇవి మీ ఎముకలకు బలం చేకూరుస్తాయి.

  1. ఖర్జూర పండ్లలో  కొలెస్ట్రాల్, చక్కెర తక్కువగా ఉంటాయి. దీంతో గుండె ఆరోగ్యానికి ఎటువంటి ముప్పు ఉండదు. చక్కెర శాతం తక్కువగా ఉండటం చాలా ప్రయోజనకరం. ప్రపంచంలో ఎక్కువగా వినియోగించే పండ్లలో ఖర్జూరం కూడా ఒకటి.
  2. ఆయుర్వేదానికి అనుగుణంగా,  ఖర్జూరం.. అనేక వ్యాధులను నయం చేసే అద్భుత ఔషధం. శారీరక బలహీనత, లో బీపీ,  గుండె జబ్బులు  అధిక దాహం వంటి సమస్యలతో పోరాడటానికి ఖర్జూర పండ్లు ఉపయోగపడతాయి
  3.  ఖర్జూర పండ్లలో ఫ్లేవనాయిడ్లు, కెరోటినాయిడ్లు, ఫినోలిక్ ఆమ్లాలు ఉంటాయి. ఇవి వివిధ రకాల వ్యాధులను ఎదుర్కోవడంతో సాయపడతాయి. డేట్స్‌లో ఉండే విటమిన్లు,  ఖనిజాలు చర్మానికి మేలు చేస్తాయి.
  4. మీరు ప్రతి ఉదయం 2 డేట్స్ తినడం ప్రారంభిస్తే.. ఈ అలవాటు వల్ల కలిగే ప్రయోజనాలు అతి కొద్ది రోజుల్లోనే స్పష్టంగా కనిపిస్తాయి.
  5. శరీరంలో  తక్కువ స్థాయిలో ఇనుము ఉంటే ఒత్తిడి పెరుగుతుంది. ఖర్జూర పండ్లలో అధిక స్థాయిలో ఇనుము ఉంటుంది.  బ్రీతింగ్ సమస్యలు, రక్తహీనత వంటి సమస్యలను కూడా ఎదుర్కొనడంలో కూడా డేట్స్ బాగా ఉపకరిస్తాయి.

Also Read: జుట్టు రాలడం సమస్యతో బాధపడుతున్నారా ?.. డోంట్ వర్రీ.. పరిష్కారం ఇదిగో..!

మాస్క్ పెట్టుకోని వ్యక్తులపై కేసులు నమోదు చేసిన పోలీసులు.. నేడు కోర్టు ముందుకు