Masks compulsory: మాస్క్ పెట్టుకోని వ్యక్తులపై కేసులు నమోదు చేసిన పోలీసులు.. నేడు కోర్టు ముందుకు

మాస్క్‌ వేసుకోకపోతే.. జైలే అన్న సిగ్నల్‌ ఇస్తున్నారు పోలీసులు. ఇవ్వడమే కాదు.. ఓ చోట కేసులు పెట్టి లోపలేశారు. అందులో భాగంగానే ఇవాళ వారిని మంథని కోర్టులో హాజరుపర్చబోతున్నారు.

Masks compulsory: మాస్క్ పెట్టుకోని వ్యక్తులపై కేసులు నమోదు చేసిన పోలీసులు.. నేడు కోర్టు ముందుకు
ప్రతీకాత్మక చిత్రం
Follow us
Ram Naramaneni

|

Updated on: Mar 31, 2021 | 7:37 AM

మాస్క్‌ వేసుకోకపోతే.. జైలే అన్న సిగ్నల్‌ ఇస్తున్నారు పోలీసులు. ఇవ్వడమే కాదు.. ఓ చోట కేసులు పెట్టి లోపలేశారు. అందులో భాగంగానే ఇవాళ వారిని మంథని కోర్టులో హాజరుపర్చబోతున్నారు.

కరోనా కోరలు చాస్తుండడంతో.. ఇప్పటికే రోడ్లపైకి వచ్చారు పోలీసులు. ప్రజల్లో అవగాహన కల్పించి.. మాస్క్‌ ధరించేలా చూస్తున్నారు. అంతేకాదు.. ఫైన్ల మోత కూడా మోగిస్తున్నారు. అప్రమత్తంగా లేకపోతే.. వైరస్‌ మరింత వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని భావిస్తున్న తరుణంలో.. ప్రభుత్వం కూడా మాస్క్‌ను తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులను కూడా జారీ చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా స్పెషల్‌ డ్రైవ్‌లు చేస్తూ మాస్క్‌ ధరించేలా చూస్తుండగా.. పెద్దపల్లి జిల్లాలో మాత్రం ఏకంగా కేసులు పెట్టడం సంచలనంగా మారింది.

సుల్తానాబాద్‌ మండలంలో మాస్క్‌ లేకుండా తిరుగుతున్న 11 మందిపై కేసు నమోదు చేశారు. వారిని ఇవాళ మంథని కోర్టులో హాజరుపర్చనున్నారు. మాస్క్‌లు సరిగా పెట్టుకోకపోతే.. కేసులు తప్పవన్నట్టుగా ఇక్కడి పోలీసులు వార్నింగ్‌ ఇస్తున్నారు. ఇప్పటి వరకు ఫైన్లు విధించడాన్నే చూస్తున్న ప్రజలకు.. ఇది నిజంగా షాకింగే. తెలంగాణలో మాస్క్‌ పెట్టుకోని వారిపై కేసులు పెట్టడం కూడా ఇది తొలిసారి. ఇలా చేయడం ద్వారా అయినా మార్పు వస్తుందని ఆశిస్తున్నారు. మాస్క్‌ పెట్టుకోకపోతే.. కఠినంగా వ్యవహరిస్తామని సంకేతాలు ఇస్తుండడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తెలంగాణవ్యాప్తంగా ప్రజలకు, వాహనదారులకు మాస్క్‌లపై పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు. కొందరు ధరించకుంటే.. హైదరాబాద్‌ లాంటి కొన్నిచోట్ల పోలీసులే మాస్క్‌లను కొనిచ్చి వేసుకునేలా చూస్తున్నారు. మాస్క్‌ పెట్టుకోవడం ఒక్కటే కాదు.. గుంపులు గుంపులుగా గాదరింగ్‌ కూడా కావద్దని అంటున్నారు. భౌతికదూరం పాటించాలని సూచిస్తున్నారు. బహిరంగ ప్రదేశాలు, పని ప్రదేశాలు, పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ లో మాస్కుల వినియోగం తప్పనిసరని సర్కార్‌ జీఓలో స్పష్టం చేసింది. మాస్కులు ధరించని వారిపై డిజాస్టర్ మేనేజ్మెంట్ చట్టం, ఐపీసీ కింద చర్యలు తీసుకుంటామని చెప్పింది. ఆ క్రమంలోనే అప్రమత్తంగా లేకపోతే.. రాబోయే రోజుల్లో పాజిటివ్‌ కేసులు మరిన్ని పెరిగే అవకాశమున్నందున.. మాస్క్‌ మస్ట్‌ అంటూ గట్టిగానే జనంలోకి తీసుకెళ్లేయత్నం చేస్తున్నారు పోలీసులు.

Also Read: Horoscope Today: ఈరాశుల వారికి ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి… ఈరోజు రాశిఫలాలు..

Petrol Diesel Rates: వాహనదారులకు గుడ్ న్యూస్.. పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి..!