Corona: మహారాష్ట్రలో తగ్గుతున్న కరోనా కేసులు.. పెరుగుతున్న మరణాలు.. తాజాగా ఎంతమంది చనిపోయారంటే?
Maharashtra COVID-19 cases: దేశంలో కరోనావైరస్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. నిత్యం వేలల్లో కేసులు పెరుగుతుండటంతో అంతటా ఆందోళన నెలకొంది. ముఖ్యంగా మహారాష్ట్రలో
Maharashtra COVID-19 cases: దేశంలో కరోనావైరస్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. నిత్యం వేలల్లో కేసులు పెరుగుతుండటంతో అంతటా ఆందోళన నెలకొంది. ముఖ్యంగా మహారాష్ట్రలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. కొన్నిరోజుల నుంచి 30 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా కేసుల సంఖ్య కొంతమేర తగ్గగా.. మరణాల సంఖ్య భారీగా పెరిగింది. సోమవారం నుంచి మంగళవారం సాయంత్రం వరకు 24 గంటల వ్యవధిలో కొత్తగా 27,918 కరోనా కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా 139 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు మహారాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం రాత్రి హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. మహారాష్ట్రలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 27,73,436 కి పెరగగా.. మరణించిన వారి సంఖ్య 54,422 కి చేరింది.
ఇదిలాఉంటే.. గత 24 గంటల్లో కరోనా నుంచి 23,820 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 23,77,127 కి పెరిగినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రస్తుతం మహారాష్ట్ర వ్యాప్తంగా 3,40,542 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇదిలాఉంటే.. దేశంలో కరోనా కేసులు, మరణాల పరంగా మహారాష్ట్ర తొలిస్థానంలో కొనసాగుతోంది. ఇప్పటికే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే కరోనా నిబంధనలు పాటించకపోతే.. కఠినమైన లాక్డౌన్‌ను అమలు చేయక తప్పదని హెచ్చరించిన సంగతి తెలిసిందే. మహారాష్ట్రలో ఇప్పటికే.. పలు ప్రాంతాల్లో కఠినమైన లాక్డౌన్, నైట్ కర్ఫ్యూను సైతం అమలు చేస్తున్నారు. అయినప్పటికీ రాష్ట్రంలో కోవిడ్ కేసులు నిరంతరం పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
మహారాష్ట్ర కరోనా కేసుల వివరాలు..
Maharashtra reports 27,918 new #COVID19 cases, 23,820 discharges and 139 deaths in the last 24 hours.
Total cases 27,73,436 Total recoveries 23,77,127 Death toll 54,422
Active cases 3,40,542 pic.twitter.com/xp5pcX9dsF
— ANI (@ANI) March 30, 2021
Also Read: