Horoscope Today: ఈరాశుల వారికి ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి… ఈరోజు రాశిఫలాలు..
Horoscope Today 31st March 2021: ప్రస్తుతం చాలా మంది రాశిఫలాలను నమ్ముతుంటారు. ఇక ఏదైనా పని మొదలుపెట్టాలన్న.. లేదా ఎక్కడికైనా
Horoscope Today 31st March 2021: ప్రస్తుతం చాలా మంది రాశిఫలాలను నమ్ముతుంటారు. ఇక ఏదైనా పని మొదలుపెట్టాలన్న.. లేదా ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నా.. వారి రాశిఫలం ఎలా ఉంది అనేది తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటారు. ఈరోజు మార్చి 31 బుధవారం రోజు తులరాశిలో చంద్రుడు ఉండనున్నాడు. ఈరోజు మేషరాశి నుంచి మీనం వరకు రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ముందుగానే తెలుసుకుందాం.
మేషరాశి..
ఈరోజు వీరు ఆర్థిక ఇబ్బందుల విషయంలో కొంతవరకు జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసరంగా ఆందోళన చెందకూడదు. ఈరోజు వీరికి శ్రీవెంకటేశ్వర దర్శనం మేలు చేస్తుంది.
వృషభ రాశి..
వీరికి ఈరోజు వ్యవహారిక విషయంలో అనుకూలంగా ఉంటుంది. ఆస్తి వివాదాలను పరిష్కరించుకుంటారు. ఈరోజు లలితా సహస్త్ర నామా స్త్రోత్ర పారాయణం మేలు చేస్తుంది.
మిధున రాశి..
ఈరోజు వీరు చెపట్టినటువంటి పనులు వాయిదా పడే అవకాశాలున్నాయి. ఉద్యోగస్తులకు పని భారాలు పెరుగుతాయి. వీరికి శ్రీరాజమాతంగై నమః అనే నామాస్మరణ మేలు చేస్తోంది.
కర్కాటక రాశి..
ఈరోజు వీరు తెలియని విషయాలు తెలుసుకుంటారు. అలాగే వీరు నిర్వహిస్తున్న వ్యాపారాలు సజావుగా సాగుతుంటాయి. వీరికి ఈరోజు అష్టలక్ష్మీ స్తోత్ర పారాయణం మేలు చేస్తుంది.
సింహరాశి..
ఈరోజు వీరికి కష్టానికి తగిన ఫలితం ఉంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఈరోజు వీరికి నవగ్రహ స్త్రోత్ర పారాయణం మేలు చేస్తుంది.
కన్య రాశి..
ఈరోజు వీరు ముఖ్యమైన కార్యాక్రమాలు ప్రారంభిస్తారు. అలయాలు, ఆశ్రమాలు సందర్శిస్తారు. పేదవారికి ధాన దర్మాలు చేయడం, కాయకూరలు ఇవ్వడం మంచిది.
తులరాశి..
ఈరోజు వీరు చేపట్టిన పనులు ఏమాత్రం కూడా మధ్యలో ఆగిపోకుండా.. తగినటువంటి ప్రణాళికలు ఏర్పాటు చేసుకోవాలి. ఈరోజు వీరికి శివ పంచాక్షరి మంత్రం మంచింది.
వృశ్చిక రాశి..
ఈరోజు వీరికి పరిచయాలు పెరుగుతాయి. క్రయవిక్రయాల్లో లాభాలు ఉంటాయి. ఈరోజు వీరికి లక్ష్మీ నరసింహ దర్శనం మేలు చేస్తుంది.
ధనుస్సు రాశి..
ఈరోజు వీరు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగాల విషయంలో గందరగోళం ఏర్పడుతుంది. శివాలయ దర్శనం మేలు చేస్తుంది.
మకర రాశి..
ఈరోజు వీరు ఎప్పటినుంచే అనుకుంటున్న పనులు ప్రారంభిస్తారు. భూమి విషయాలు, వ్యాపార విషయాలలో లాభాలు ఉంటాయి. అష్టలక్ష్మీ స్త్రోత్ర పారాయణం మేలు చేస్తుంది.
కుంభరాశి..
ఈరోజు వీరికి అనుకూలమైన ప్రయోజనాలు ఉంటాయి. ఖర్చులను నియంత్రించుకోవాలి. ఈరోజు వీరికి దుర్గ సప్తశ్లోకి పారాయణం మేలు చేస్తుంది.
మీన రాశి..
ఈరాశివారు పెట్టుబడుల విషయంలో తొందరపడకూడదు. రావాల్సినటువంటి బాకీలు ఆలస్యం అవుతాయి. సుబ్రమణ్య స్వామి అర్చన, నవగ్రహ స్త్రోత్ర పారాయణం మేలు చేస్తుంది.
Also Read:
Holi Bhai Dooj 2021: హోలీ భాయ్ దూజ్ ప్రాముఖ్యత.. పురాణాల్లో ఉన్న స్టోరీ ఎంటో తెలుసా..
Happy Holi 2021: మన దేశంలో హోలీ పండుగను ఏఏ రాష్ట్రాల్లో ఏ పేర్లతో పిలుస్తారో తెలుసా..