AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బరువు తగ్గాలనుకునేవారు ఏ రైస్ తింటే మంచిదో తెలుసా ? వైట్, బ్రౌన్ రైస్‍కు పోటీగా క్వినోవా.. ఇంతకీ ఏది బెటరంటే..

క్వినోవా గత కొన్ని సంవత్సరాలుగా దీనికి ప్రత్యేక గుర్తింపు ఏర్పడింది. ప్రస్తుతం కాలంలో బరువు తగ్గాలనుకునేవారు ఎక్కువగా ఈ దీనినే

బరువు తగ్గాలనుకునేవారు ఏ రైస్ తింటే మంచిదో తెలుసా ? వైట్, బ్రౌన్ రైస్‍కు పోటీగా క్వినోవా.. ఇంతకీ ఏది బెటరంటే..
Quinoa Vs. White Rice Vs. Brown rice
Rajitha Chanti
|

Updated on: Mar 31, 2021 | 1:34 PM

Share

క్వినోవా గత కొన్ని సంవత్సరాలుగా దీనికి ప్రత్యేక గుర్తింపు ఏర్పడింది. ప్రస్తుతం కాలంలో బరువు తగ్గాలనుకునేవారు ఎక్కువగా  దీనినే వాడుతున్నారు. అయితే దీని వలన మనం నిత్యం వాడే వైట్, బ్రౌన్ రైస్‏లపై కొంత వరకు సందేహాలు పెరిగాయి. బియ్యం నిజంగా బరువు పెంచుతుందా అనే సందేహం చాలా మందిలో కలుగుతుంది. అయితే వైట్, బ్రౌన్ రైస్ కంటే క్వినోవా ఏ విధంగా బెటర్ అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం.

వైట్ రైస్ & క్వినోవా…

సాధరణంగా చాలా మంది వైట్ రైస్ తింటుంటారు. ఇందులో ఎక్కువగా గ్లైసెమిక్ ఉంటుంది. అంటే రక్తంలో షూగర్ లెవెల్స్ త్వరగా పెరిగెందుకు సహయపడుతుంది. ఇక క్వినోవా విషయానికి వస్తే.. ఇందులో ఫైబర్, ప్రోటీన్ సమృద్దిగా ఉంటుంది. అలాగే అధిక పోషక విలువలను కలిగి ఉంటుంది. అంతేకాకుండా తక్కువ పిండి పదార్థాలను కలిగి ఉంటుంది. ఒక కప్పు క్వినోవా అంటే కప్పు తెల్ల బియ్యం కంటే రెండు రెట్లు ఎక్కువ ప్రోటీన్, 5 గ్రాముల ఫైబర్ అందిస్తుంది. అదిక మొత్తంలో ప్రోటీన్, ఫైబర్ ఉండడం వలన ఆరోగ్యంగా ఉంటారు. క్వినోవా కోలేస్ట్రాల్‏ను తగ్గించడమే కాకుండా.. రక్తంలో షుగర్ లెవల్స్ నియంత్రిస్తుంది.

బ్రౌన్ రైస్ & క్వినోవా..

వైట్ రైస్ కంటే బ్రౌన్ రైస్ చాలా ఆరోగ్యవంతమైనవి. ఇందులో ఎక్కువగా ఫైబర్ ఉంటుంది. అలాగే రక్తపోటును తక్కువగా కలుగచేస్తుంది. ఇది క్వినోవా మాదిరిగానే గ్లైసెమిక్ సూచిక. దీనివలన ఆకలి నియంత్రణలో ఉంటుంది.

తెల్లబియ్యం లేదా గోధుమ బియ్యం…

వైట్ రైస్ ప్రాసెసింగ్ సమయంలో అందులో ఉండే పోషకాలతోపాటు సూక్ష్మక్రిమి బయటకు వెళ్లిపోతాయి. ఇది కృత్రిమంగా తయారు చేసిన పోషకాపదార్థం లాగా ఉంటుంది. ఇక బ్రౌన్ రైస్ ఆరోగ్యకరమైన బ్రామ్, సూక్ష్మక్రిమిని నిలుపుకుంటుంది. ఇది వైట్ కోల్పోయే పోషకాలను తిరిగి పెంపోందించడానికి సహయపడుతుంది. అలాగే ఇది రక్తపోటును తగ్గిస్తుంది. బ్రౌన్ రైస్, క్వినోవా రెండూ కూడా బరువు నియంత్రణకు తోడ్పడుతాయి.

బెస్ట్ ఆప్షన్..

వైట్ రైస్… అనేది ఆరోగ్యానికి బెటర్ కానీ… తగినన్ని పోషక విలువులు ఉండవు. అలాగే బ్రౌన్ రైస్, క్వినోవా రెండు కూడా ఆరోగ్యానికి మంచివి. ఇందులో ఫైబర్, ఐరన్ అధికంగా ఉండడంతోపాటు.. రక్తంలో షుగర్ లెవల్స్ నియంత్రించడంలో సహయపడతాయి.

Also Read:

వేసవి కాలం వచ్చేసింది.. భానుడి ప్రతాపాన్ని తట్టుకోవడానికి ఈ హెల్తీ టీ ఎంతో బెస్ట్.. చిటికెలో రెడీ..

Follow Us
భారత్‌లో టాప్ యాప్స్, గేమ్స్‌ ప్రకటించిన గూగుల్
భారత్‌లో టాప్ యాప్స్, గేమ్స్‌ ప్రకటించిన గూగుల్
నీళ్లను తాడుతో కట్టేయాలి.. ఎలా? మీ తెలివికి పరీక్ష పెట్టే ప్రశ్న
నీళ్లను తాడుతో కట్టేయాలి.. ఎలా? మీ తెలివికి పరీక్ష పెట్టే ప్రశ్న
బండి తాళాలకు ఈ మెటల్ ట్యాగ్ ఎందుకో తెలిస్తే అస్సలు పారేయరు
బండి తాళాలకు ఈ మెటల్ ట్యాగ్ ఎందుకో తెలిస్తే అస్సలు పారేయరు
తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. మరో వందే భారత్‌ ఫిక్స్..
తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. మరో వందే భారత్‌ ఫిక్స్..
వెంకీ కోసం ఏకంగా తండ్రితో గొడవ పడిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?
వెంకీ కోసం ఏకంగా తండ్రితో గొడవ పడిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?
టీవీకి బ్రేక్.. చదువుకు గ్రీన్ సిగ్నల్! AIతో తండ్రి స్కెచ్!
టీవీకి బ్రేక్.. చదువుకు గ్రీన్ సిగ్నల్! AIతో తండ్రి స్కెచ్!
ముందు వ్యాన్.. వెనుక బైక్.. అధికారులకు అనుమానమొచ్చి చెక్ చేయగా..
ముందు వ్యాన్.. వెనుక బైక్.. అధికారులకు అనుమానమొచ్చి చెక్ చేయగా..
ఉదయం లేవగానే వేడి నీళ్లు తాగుతున్నారా? ఆయుర్వేదం ఏం చెప్తోంది
ఉదయం లేవగానే వేడి నీళ్లు తాగుతున్నారా? ఆయుర్వేదం ఏం చెప్తోంది
ఎంత బిజీగా ఉన్నా ఆరోగ్యమే ముఖ్యం.. యశోద హాస్పిటల్స్ వేదికగా..
ఎంత బిజీగా ఉన్నా ఆరోగ్యమే ముఖ్యం.. యశోద హాస్పిటల్స్ వేదికగా..
ఎండలో కూర్చోవడం వల్ల విటమిన్ డి మాత్రమే కాదు.. ఎన్ని లాభాలో
ఎండలో కూర్చోవడం వల్ల విటమిన్ డి మాత్రమే కాదు.. ఎన్ని లాభాలో