ఏపీలో కొనసాగుతన్న కరోనా ఉధృతి.. కొత్తగా 1,271 మందికి పాజిటివ్.. మరో ముగ్గురు మృతి
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. మెల్లమెల్లగా కొత్త కేసులు పెరుగుతున్నాయి. గత 24 గంటల వ్యవధిలో 31,809 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 1,271 మందికి పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది.
AP Coronavirus cases today: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. మెల్లమెల్లగా కొత్త కేసులు పెరుగుతున్నాయి. గత 24 గంటల వ్యవధిలో 31,809 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 1,271 మందికి పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 9,03,260 మందికి కరోనా వైరస్ సోకింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ పేర్కొంది.
కాగా, గడచిన 24 గంటల్లో కరోనా మహమ్మారి నుంచి 464 మంది కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఏపీలో ఇప్పటివరకు 8,87,898 మంది పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. గత 24 గంటల్లో కరోనా బారినపడి అనంతపురం, గుంటూరు, విశాఖపట్నంలో ఒక్కొక్కరు చొప్పున మొత్తం ముగ్గురు మృతిచెందగా, ఇప్పటివరకు రాష్ట్రంలో 7,220 మంది ప్రాణాలను కోల్పోయారు. ఇక, ఏపీలో ప్రస్తుతం 8,142 యాక్టివ్ కేసులు ఉన్నాయి. నేటి వరకు రాష్ట్రంలో 1,51,14,988 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించినట్ల రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
ఇక, జిల్లావారిగా నమోదైన కరోనా వైరస్ కేసులు ఇలా ఉన్నాయిః
Read Also… ఆంధ్రప్రదేశ్ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్.. ఈ నెల 8న పోలింగ్, 10న ఫలితాలు