Weather Report: రైతులూ బీ అలర్ట్.. నేటి నుంచి మూడు రోజులు వర్షాలు పడే అవకాశం.. వాతావరణ శాఖ హెచ్చరిక..
Weather Report: భారత వాతావరణ శాఖ పిడుగు లాంటి వార్తను వెల్లడించింది. వాతావరణ మార్పుల కారణంగా నేటి నుంచి(శుక్రవారం) దేశంలోని...
Weather Report: భారత వాతావరణ శాఖ పిడుగు లాంటి వార్తను వెల్లడించింది. వాతావరణ మార్పుల కారణంగా నేటి నుంచి(శుక్రవారం) దేశంలోని పలు రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. అయితే, ప్రస్తుతం పంట కోత సమయం. ఈ సమయంలో వర్షాలు పడితే రైతులు చాలా నష్టపోయే ప్రమాదం ఉంది. అందుకే రైతులు అప్రమత్తంగా ఉండాలని భారత వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ఏ రాష్ట్రాల్లో వర్షం పడే అవకాశం ఉందంటే.. దక్షిణ అండమాన్ సముద్రం, అండమాన్ మరియు నికోబార్, అస్సాం, ఒడిశా, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్‌ల రానున్న రెండు, మూడు రోజులలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. ఇక మత్స్యకారులను సముద్రంలోకి వెళ్లవద్దని వాతావరణ శాఖ అధికారులు ఎల్లో వార్నింగ్ జారీ చేశారు. తూర్పు, మధ్య, ఈశాన్య భారతదేశంలో సగటు ఉష్ణోగ్రత మూడు నుంచి నాలుగు డిగ్రీల వరకు పడిపోతుందని తెలిపారు. ఫలితంగా ప్రజలకు ఎండ వేడిమి నుంచి ఉపశమనం లభిస్తుందన్నారు. ఇక పంజాబ్, ఉత్తర రాజస్థాన్, హర్యానా, చంఢీగర్, ఢిల్లీ, పశ్చిమ ఉత్తర ప్రదేశ్, వాయువ్య మధ్యప్రదేశ్‌లలో రాబోయే 24 గంటల్లో బలమైన గాలులు వీస్తాయన్నారు.
ఇక కేరళ, జమ్మూ కాశ్మీర్, లడఖ్ లోని ప్రాంతాల్లో తేలికపాటి వర్షం పడవచ్చని చెప్పారు. ఒడిశా, గంగా పశ్చిమ బెంగాల్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదువుతున్నాయి. రానున్న రోజుల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావణ శాఖ అధికారులు తెలిపారు.
Also read: