AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Alia Bhatt: ఆర్ఆర్ఆర్ హీరోయిన్‌కు కరోనా… ఇన్‌స్టాలో వెల్లడించిన బాలీవుడ్ ముద్దుగుమ్మ.. ఆ చిత్ర యూనిట్‌లో టెన్షన్

COVID-19 positive: సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీల వరకూ ఈ మహమ్మారి అందరినీ పట్టిపీడిస్తోంది. తాజాగా బాలీవుడ్ హీరోయిన్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. ఆర్ఆర్ఆర్ హీరోయిన్.. బాలీవుడ్ ముద్దుగుమ్మ

Alia Bhatt: ఆర్ఆర్ఆర్ హీరోయిన్‌కు కరోనా... ఇన్‌స్టాలో వెల్లడించిన బాలీవుడ్ ముద్దుగుమ్మ.. ఆ చిత్ర యూనిట్‌లో టెన్షన్
Alia Bhatt
Shaik Madar Saheb
|

Updated on: Apr 02, 2021 | 2:40 AM

Share

COVID-19 positive: కరోనావైరస్ దేశవ్యాప్తంగా కొరలు చాస్తోంది. ఎన్ని జాగ్రత్త చర్యలు పాటించినప్పటికీ.. అందరూ కరోనా బారిన పడుతున్నారు. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీల వరకూ ఈ మహమ్మారి అందరినీ పట్టిపీడిస్తోంది. తాజాగా బాలీవుడ్ హీరోయిన్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. ఆర్ఆర్ఆర్ హీరోయిన్.. బాలీవుడ్ ముద్దుగుమ్మ అలియా భట్‌కు కరోనా సోకింది. ఈ మేరకు అలియా భట్ ఇన్‌స్టా‌లో గురువారం అర్థరాత్రి వెల్లడించింది. తనకు కోవివ్-19 కు పాజిటివ్ నిర్థారణ అయిందని.. వెంటనే ఇంట్లోనే ఐసోలేషన్‌లోకి వెళ్లిపోయినట్లు అలియా పేర్కొంది. వైద్యుల సలహా మేరకు ఎప్పటికప్పుడు అన్ని రకాల రక్షణ చర్యలు తీసుకుంటున్నానని తెలిపింది. అందరి ప్రేమానురాగాలకు.. తనకు మద్దతు తెలుపుతున్నందుకు కృతజ్ఞతలని, దయచేసి సురక్షితంగా ఉండండి.. జాగ్రత్త వహించండి.. అంటూ అలియా భట్ పోస్ట్ చేసింది. కాగా.. ప్రస్తుతం అలియా భట్ ముంబైలో సంజయ్ లీలా భన్సాలీ తీస్తున్న గంగూబాయి కతియావాడి చిత్రీకరణలో బిజీగా ఉంది.

ఇదిలాఉంటే.. మార్చి ప్రారంభంలో భన్సాలీ కరోనావైరస్ బారిన పడ్డారు. దీంతోపాటు.. ఆమె బాయ్‌ఫ్రెండ్ నటుడు రణబీర్ కపూర్‌కు కూడా కరోనావైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అప్పుడు అలియా భట్ క్వారంటైన్‌లో ఉండి కరోనా పరీక్షలు చేయించుకుంది. ఈ పరీక్షల్లో నెగటివ్‌గా నిర్థారణ అయినట్లు అలియా వెల్లడించిన విషయం తెలిసిందే. తాజాగా అలియాకు కరోనా సోకడంతో గంగూబాయి కతియావాడి చిత్ర యూనిట్‌లో టెన్షన్ మొదలైంది.

ఇదిలాఉంటే.. రామ్‌చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కిస్తోన్న మల్టీస్టారర్ ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలో అలియా భట్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్‌లో సైతం అలియా అంతకుముందు పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో అలియా భట్ రామ్ చరణ్ సరసన.. సీత పాత్రలో కనిపించనుంది. ఎన్టీఆర్‌ జోడీగా ఒలివియా మోరిస్‌ నటిస్తోంది.

Also Read:

Anasuya Bharadwaj: జబర్దస్త్ యాంకర్ అనసూయ భరద్వాజ్ లేటెస్ట్ ఫోటో గ్యాలెరీ..

Alekhya Harika : వెబ్ సిరీస్ తో రానున్న బిగ్ బాస్ బ్యూటీ.. త్వరలో మూవీ హీరోయిన్ గానూ మారనున్న హారిక