Gold Price Today: బ్యాడ్‌న్యూస్.. భారీగా పెరిగిన బంగారం ధర.. దేశంలోని ప్రధాన నగరాల్లో ధరల వివరాలు
Gold Rate Today: బంగారం ధరల్లో ప్రతి రోజు హెచ్చు తగ్గులు చోటు చేసుకుంటాయి. బంగారం ధరల్లో ఒకరోజు తగ్గుతుంటే మరో రోజు పెరుగుతోంది. అయితే తాజాగా శుక్రవారం పసిడి
Gold Rate Today: బంగారం ధరల్లో ప్రతి రోజు హెచ్చు తగ్గులు చోటు చేసుకుంటాయి. బంగారం ధరల్లో ఒకరోజు తగ్గుతుంటే మరో రోజు పెరుగుతోంది. అయితే తాజాగా శుక్రవారం పసిడి ధరలు ఎగబాకాయి. 10 గ్రాముల ధరపై రూ.610 పెరిగింది. గత కొన్నిరోజులుగా పసిడి ధరల్లో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. రోజురోజుకు బంగారం ధరలు దిగివస్తుంటే ఈ రోజు మాత్రం పెరిగాయి.
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 43,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,790 ఉంది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.41,650 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,440 ఉంది. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.43,370 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,370 ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.42,380 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,200 ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,290 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,990 ఉంది. కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.41,650 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,440 ఉంది. అలాగే పూణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.43,370 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,370 ఉంది.
విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.41,650 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,440 ఉంది. విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.41,650 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,440 ఉంది.
మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా పసిడి ధర పెరిగింది. బంగారం ధర ఔన్స్‌కు 0.87 శాతం పెరుగుదలతో 1730 డాలర్లకు చేరింది. బంగారం ధర పెరిగితే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. ఔన్స్‌కు 2.03 శాతం పెరుగుదలతో 25.03 డాలర్లకు ఎగసింది
అయితే దేశీయంగా బంగారం, వెండి ధరలు పెరగడానికి చాలా కారణాలున్నాయంటున్నారు బులియన్ మార్కెట్ నిపుణులు. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు చేర్పులు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్దాలు వంటి పలు అంశాలపై పసిడి ధరలపై ప్రభావం చూపుతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఎప్పటికప్పుడు బంగారం, వెండి ధరల్లో మార్పు చేర్పులు జరుగుతుండటంతో ఈ ఈ విషయాన్ని గమనించాల్సి ఉంటుంది.