AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

janmashtami: నేడు కన్నయ్య పుట్టిన రోజు వేడుకలకు తెరుచుకోనున్న అయోధ్య దర్బార్.. అర్ధరాత్రి ఘనంగా ఉత్సవాలు

రామజన్మభూమి కాంప్లెక్స్‌లో శ్రీకృష్ణుని పుట్టిన రోజుని వైభవంగా నిర్వహించేందుకు సన్నాహాలు ప్రారంభించారు. శ్రీకృష్ణుడు అర్థరాత్రి 12 గంటలకు జన్మించాడని.. అదే సంప్రదాయాన్ని పాటిస్తూ..  నేటికీ అదే సంప్రదాయంలో మఠంలో స్వామివారి ఉత్సవాలను నిర్వహిస్తారు.

janmashtami: నేడు కన్నయ్య పుట్టిన రోజు వేడుకలకు తెరుచుకోనున్న అయోధ్య దర్బార్.. అర్ధరాత్రి ఘనంగా ఉత్సవాలు
Janmashtami Ayodhya
Surya Kala
| Edited By: |

Updated on: Aug 20, 2022 | 1:53 PM

Share

janmashtami: అయోధ్యలోని శ్రీ రామ్‌లాలా ఆస్థానం నేడు (ఆగష్టు 19వ తేదీ) రాత్రి మరోసారి తెరవనున్నారు. కృష్ణాష్టమి వేడుకలను నిర్వహించడానికి ఒక 1 గంట పాటు తెరవబడుతుంది. భద్రతా అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. కృష్ణాష్టమి సందర్భంగా పూజారులు  హారతినిస్తారు. పూజలు చేస్తారు. ఈ రోజున శ్రీరాముడి గర్భగుడిలో శ్రీకృష్ణుని జన్మదిన వేడుకలు జరపనున్నారు. శ్రీకృష్ణుడు అర్థరాత్రి 12 గంటలకు జన్మించాడని.. అదే సంప్రదాయాన్ని పాటిస్తూ..  నేటికీ అదే సంప్రదాయంలో మఠంలో స్వామివారి ఉత్సవాలను నిర్వహిస్తారు. శ్రీ కృష్ణ భగవానుడి జన్మదినోత్సవాన్ని మధుర, బృందావనంలో అత్యంత వైభవంగా జరుపుకున్నప్పటికీ, అయోధ్యలో కూడా చాలా ఉత్సాహంగా జరుపుకుంటారు.

జన్మాష్టమిని అయోధ్యలోని వందలాది దేవాలయాల్లో శ్రీకృష్ణుడు జనన సమయంలో గొప్ప హారతి, పూజలు నిర్వహించనున్నారు. దీనితో పాటు, శ్రీ కృష్ణ భగవానుడి ఉత్సవాలను నిర్వహించేందుకు చాలా చోట్ల ఘనంగా సన్నాహాలు చేస్తున్నారు. అదే సమయంలో రామజన్మభూమి కాంప్లెక్స్‌లో శ్రీకృష్ణుని పుట్టిన రోజుని వైభవంగా నిర్వహించేందుకు సన్నాహాలు ప్రారంభించారు.

కృష్ణాష్టమి వేడుకల సన్నాహాల గురించి అయోధ్యలోని రామ మందిరం ప్రధాన అర్చకుడు ఆచార్య సత్యేంద్ర దాస్ మాట్లాడుతూ, ఆగస్టు 19న రామజన్మభూమిలో కృష్ణ జన్మాష్టమి కూడా జరుపుకోనున్నట్లు తెలిపారు. సాయంత్రం భక్తులకు పూజలు చేసిన ..  సాయంత్రం హారతి అనంతరం మూసివేయనున్నామని తెలిపారు. తాత్కాలిక ఆలయాన్ని రాత్రి 11.30 గంటలకు తెరవనున్నారు. ఈ సమయంలో సనాతన ధర్మం ప్రకారం హారతినిచ్చి, పూజలు చేసి తిరిగి 12.30 గంటలకు మళ్లీ మూసివేయనున్నామని చెప్పారు. రాముడు, కృష్ణుడు ఇద్దరూ ఒక్కటే. ఇద్దరికి పూజా విధానం ఒకటే.. అందుకే తాము అయోధ్యలో ప్రతి సంవత్సరం చైత్ర రామనవమి, కృష్ణ జన్మాష్టమి వేడుకలను జరుపుతున్నామని చెప్పారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది కూడా కృష్ణ జన్మదిన వేడుకలను అత్యంత ఘనంగా జరుపుకోనున్నామని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

 మహా హారతి అనంతరం నైవేద్యం:  ఈ సందర్భంగా 1500 కిలోల నాలుగు రకాల పంజిరీలు, 40 లీటర్ల పంచామృతం, 15 కిలోల కోవ స్వీట్స్, 20 కిలోల పండ్లు కన్నయ్యకు నైవేద్యంగా అందజేయనున్నారు. అదే సమయంలో.. అప్పుడు అక్కడ ఉన్న భద్రతా అధికారులు, ఉద్యోగులకు ఆ ప్రసాదాలను పంపిణీ చేస్తామని పేర్కొన్నారు. అయితే భద్రత దృష్ట్యా భక్తులెవరినీ అనుమతించరు. అయితే ఆలయం తెరిచిన తర్వాత ఆ ప్రసాదం కూడా భక్తులకు పంపిణీ చేయబడుతుందని పేర్కొన్నారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

(ఇక్కడ ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలు, నమ్మకం పై ఆధారపడి ఇవ్వబడింది. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. సాధారణ ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది)