AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rakhi Festival: రాఖీ కట్టిన మీ సోదరికి ఈ వస్తువులను గిఫ్ట్ గా ఇచ్చారో.. మీ బంధంలో బీటలు గ్యారెంటీ..

శ్రావణ మాసం వచ్చేసింది.. దీంతో రాఖీ పండగ సందడి కూడా మొదలైంది. అప్పుడే మార్కెట్ లో రకరకాల రాఖీలు దర్శనం ఇస్తున్నాయి. మరోవైపు తనకు రక్షాబంధనం కట్టిన సోదరికి బహుమతులు ఇచ్చేందుకు సోదరులు కూడా షాపింగ్ వైపు దృష్టి సారిస్తున్నారు. ఎందుకంటే బహుమతులు ఇవ్వడం ప్రేమను వ్యక్తపరుస్తుంది. అయితే రాఖీ కట్టిన మీ ప్రియమైన సోదరికి పొరపాటున కూడా కొన్ని వస్తువులను గిఫ్ట్ గా ఇవ్వదట. ఆ వస్తువులను బహుమతులుగా ఇవ్వడం వలన మీ సోదరసోదరుల బంధానికి అశుభం అని వాస్తు శాస్త్రంలో పేర్కొంది.

Rakhi Festival: రాఖీ కట్టిన మీ సోదరికి ఈ వస్తువులను గిఫ్ట్ గా ఇచ్చారో.. మీ బంధంలో బీటలు గ్యారెంటీ..
Raksha Bandhan
Surya Kala
|

Updated on: Jul 28, 2025 | 12:00 PM

Share

శ్రావణ మాసం పౌర్ణమి రోజున రాఖీ పండగగా జరుపుకుంటాం. ఈ రోజున అక్కా చెల్లెలు తమ అన్నదమ్ములకు ప్రేమతో రాఖీని ధారణ చేస్తారు. తనకు రక్ష కట్టిన సోదరికి ప్రేమతో అన్నదమ్ములు తమ శక్తికి తగిన విధంగా ప్రేమగా బహుమతిని ఇస్తారు. ఇలా రాఖీ పండుగని సోదరులు… సోదరీమణులు ఆప్యాయతతో, ప్రేమతో జరుపుకుంటారు. అయితే అన్నదమ్ములు తమ అక్కాచెల్లెలకు రాఖీ కట్టినందుకు ఇచ్చే బహుమతుల విషయంలో కూడా కొన్ని నియమాలున్నాయని తెలుసా..

సోదరికి బహుమతిగా ఇచ్చే కొన్ని రకాల వస్తువులు మీ సోదరికి దురదృష్టాన్ని తెచ్చిపెడతాయని లేదా సంబంధాలలో సమస్యలను సృష్టిస్తాయని వస్తూ శాస్త్రం కొన్ని వస్తువుల గురించి పేర్కొంది. ముఖ్యంగా హిందువుల విశ్వాసాల ప్రకారం కొన్ని నమ్మకాలు జీవితంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి. ఈ రోజు సోదరికి పోరపాటున కూడా ఏ వస్తువులను బహుమతిగా ఇవ్వకూడదో ఈ రోజు తెలుసుకుందాం..

పెర్ఫ్యూమ్స్ సంబంధాలను సువాసనగా ఉంచుకోవడం ముఖ్యం. అయితే రాఖీ కట్టిన సమయంలో మీ సోదరికి పెర్ఫ్యూమ్‌ను బహుమతిగా ఇవ్వాలని భావిస్తుంటే.. ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే పెర్ఫ్యూమ్ ఎంపిక చాలా వ్యక్తిగత విషయం. కొన్ని సువాసనలు ప్రతికూల శక్తిని కలిగి ఉండవచ్చని.. తద్వారా ఎవరైనా గిఫ్ట్ గా అత్తరు వంటి వాటిని బహుమతిగా ఇస్తే.. అవి ఆరోగ్యాన్ని లేదా అతని ప్రకాశాన్ని ప్రభావితం చేస్తుందని కొందరు నమ్ముతారు. కనుక రాఖీ కట్టిన మీ సోదరికి పొరపాటున కూడా పెర్ఫ్యూమ్‌ను బహుమతిగా ఇవ్వకూడదు.

ఇవి కూడా చదవండి

గాజుసామాను గాజు పాత్రలను బహుమతిగా ఇచ్చే విషయంలో కూడా కొన్ని నియమాలున్నాయి. గాజు పాత్రలను గిఫ్ట్ గా ఇవ్వడం అశుభంగా భావిస్తారు. గాజు పెళుసుదనం కూడా సంబంధాలతో ముడిపడి ఉంటుంది. అది పెళుసుగా ఉన్నట్లుగానే..దానిని బహుమతిగా ఇవ్వడం వల్ల మీ అన్నాచెల్లెళ్ళ మధ్య సంబంధం కూడా విచ్ఛిన్నమవుతుందని నమ్ముతారు.

వాచ్ వేద జ్యోతిషశాస్త్రంలో సమయం “కర్మ ప్రభువు” అయిన శనీశ్వరుడితో ముడిపడి ఉంది. వ్యక్తీ జన్మ కుండలిలో శనీశ్వరుడు అశుభ స్థానంలో ఉంటే చేపట్టిన పనిలో అడ్డంకులు, జాప్యాన్ని కలిగిస్తుందని నమ్ముతారు. గడియారం ఇవ్వడం కొన్నిసార్లు సింబాలిక్ కౌంట్‌డౌన్‌గా పరిగణించబడుతుంది. గడియారం ఆగిపోతే అది సంబంధం ముగింపుకు సంకేతంగా కూడా పరిగణించబడుతుంది.

పదునైన వస్తువులు కత్తులు లేదా కత్తెర వంటి వస్తువులను సాధారణంగా మంచి బహుమతులుగా పరిగణించరు. పదునైన వస్తువులు దురదృష్టాన్ని తెచ్చిపెడతాయని,యు సంబంధాలను నాశనం చేస్తాయని ఒక సాధారణ నమ్మకం.

నలుపు రంగు దుస్తులు అనేక సంప్రదాయాలలో నలుపు రంగు దుఃఖం, విచారం , ప్రతికూలతతో ముడిపడి ఉంటుంది. ఈ కారణంగా ఈ రంగుల బహుమతులు తరచుగా నివారించబడతాయి. అవి అశుభ శక్తిని సృష్టిస్తాయని, సంబంధంలో అసంతృప్తిని కలిగిస్తుందని నమ్ముతారు. కనుక ఎప్పుడూ సోదరికి నల్లటి దుస్తులు లేదా నల్లటి రంగు వస్తువులను బహుమతిగా ఇవ్వకండి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

ప్లీజ్ కామెరాన్.. ఇక ఆపేస్తే బెటరేమో బాస్.. అవతార్ 3 రివ్యూ
ప్లీజ్ కామెరాన్.. ఇక ఆపేస్తే బెటరేమో బాస్.. అవతార్ 3 రివ్యూ
పురుషుల మూత్రం ఆ రంగులో ఉంటే.. క్యాన్సర్ సంకేతమా? వాస్తవం ఏంటి.?
పురుషుల మూత్రం ఆ రంగులో ఉంటే.. క్యాన్సర్ సంకేతమా? వాస్తవం ఏంటి.?
ఊరు ఊరంతా కరెంట్‌ షాక్‌.. సెల్‌ఫోన్‌ ఛార్జింగ్‌ పెడుతూ యువకుడు
ఊరు ఊరంతా కరెంట్‌ షాక్‌.. సెల్‌ఫోన్‌ ఛార్జింగ్‌ పెడుతూ యువకుడు
11 సినిమాలు చేస్తే అన్ని అట్టర్ ప్లాప్.. ఫాలోయింగ్ చూస్తే..
11 సినిమాలు చేస్తే అన్ని అట్టర్ ప్లాప్.. ఫాలోయింగ్ చూస్తే..
కొబ్బరి, బెల్లం కలిపి తిన్నారంటే..
కొబ్బరి, బెల్లం కలిపి తిన్నారంటే..
30 రోజులు మాంసం తినకపోతే మీ శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా..?
30 రోజులు మాంసం తినకపోతే మీ శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా..?
వీళ్లు మనుషులా లేక రన్ మిషన్లా? టీ20 చరిత్రలో టాప్ రికార్డులు ఇవే
వీళ్లు మనుషులా లేక రన్ మిషన్లా? టీ20 చరిత్రలో టాప్ రికార్డులు ఇవే
కోటక్ మహీంద్రా బ్యాంక్‌పై ఆర్బీఐ రూ.61.95 లక్షల జరిమానా.. కారణం?
కోటక్ మహీంద్రా బ్యాంక్‌పై ఆర్బీఐ రూ.61.95 లక్షల జరిమానా.. కారణం?
భార్యాభర్తలు ఉదయం నిద్రలేవగానే ఈ పనులు చేస్తే.. లైఫ్ అంతా హ్యాపీ
భార్యాభర్తలు ఉదయం నిద్రలేవగానే ఈ పనులు చేస్తే.. లైఫ్ అంతా హ్యాపీ
ఓటీటీలోకి ఆంధ్ర కింగ్ తాలూకా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
ఓటీటీలోకి ఆంధ్ర కింగ్ తాలూకా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..