AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Naga Panchami 2025: రేపే నాగ పంచమి.. సర్ప దోషం సహా గ్రహ దోషాలు తొలగేందుకు పూజా శుభ సమయం ఎప్పుడు? ఎలా పూజించాలంటే

శ్రావణ మాసం శుక్ల పక్షం పంచమి తిథిని నాగ పంచమిగా జరుపుకుంటారు. ఈ రోజు పాములను, శివుడు, సుబ్రమణ్యస్వామిని పూజించడానికి చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఈ ఏడాది నాగ పంచమి పండగను రేపు ( 29 జూలై 2025) జరుపుకోనున్నారు. ఈ రోజున ఎలా పూజ చేయడం వల్ల కాల సర్ప దోషం, సర్ప భయం నుంచి ఉపశమనం లభిస్తుంది. నాగ పంచమి పూజ ప్రాముఖ్యత, పూజ శుభ సమయాన్ని తెలుసుకోండి.

Naga Panchami 2025: రేపే నాగ పంచమి.. సర్ప దోషం సహా గ్రహ దోషాలు తొలగేందుకు పూజా శుభ సమయం ఎప్పుడు? ఎలా పూజించాలంటే
Naga Panchami
Surya Kala
|

Updated on: Jul 28, 2025 | 12:51 PM

Share

శ్రావణ మాసంలోని ప్రతి రోజునూ హిందూ మతంలో పవిత్రంగా భావిస్తారు. అయితే నాగ పంచమి రోజు ప్రత్యేక ఆధ్యాత్మిక, జ్యోతిషశాస్త్ర ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఈ రోజున నాగ దేవతలను భక్తితో పూజించడం వల్ల జీవితంలోని కష్టాలు, ముఖ్యంగా కాల సర్ప దోషం, సర్ప భయం సహా నవ గ్రహ దోషాలు తొలగిపోతాయని నమ్ముతారు.

ఈ సంవత్సరం నాగ పంచమి ఎప్పుడు?

2025 నాగ పంచమి జూలై 29, మంగళవారం నాడు జరుపుకోవాల్సి ఉంటుంది. పంచమి తిథి జూలై 28న రాత్రి 11:24 గంటలకు ప్రారంభమై జూలై 30న తెల్లవారుజామున 12:46 గంటలకు ముగుస్తుంది. పంచమి తిథి జూలై 29న సూర్యోదయం నుంచి ఉండనుంది కనుక ఈ రోజున అంటే మంగళవారం నాగ దేవతకు పూజ చేయాల్సి ఉంటుది. ఈ రోజున ఉపవాసం చేస్తారు.

పూజకు శుభ సమయం

నాగ పంచమి పూజకు ఉత్తమ సమయం ఉదయం. 5:41 నుంచి 8:23 వరకు. అంటే పుట్టలో పాలు పోసేందుకు సుమారు రెండు గంటలు శుభ సమయం.

ఇవి కూడా చదవండి

ఈ కాలంలో నాగ దేవతని పూజించడం వల్ల ప్రత్యేక ప్రయోజనాలు లభిస్తాయి. ఈ సమయంలో పూజించడం వల్ల సర్ప దోషం, కాలసర్ప దోషం సహా ఇతర గ్రహ దోషాలు తొలగిపోతాయని నమ్ముతారు.

నాగ పంచమి ఎందుకు ప్రత్యేకమైనది?

నాగ పంచమి కేవలం ఒక సంప్రదాయం లేదా ఉపవాసం కాదు. ఈ రోజు శక్తిని సమతుల్యం చేసుకోవడానికి, ప్రతికూల ప్రభావాలను తొలగించడానికి ఒక ప్రత్యేక సందర్భం. పాములను పూజించడం వల్ల జీవితంలో ఆనందం, శ్రేయస్సు , భద్రత లభిస్తాయని పురాణ గ్రంథాలలో ప్రస్తావించబడింది. ముఖ్యంగా జాతకంలో కాలసర్ప దోషం ఉన్నవారికి ఈ రోజు చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది.

పాములను ఎలా పూజించాలి?

  1. సర్ప దేవత విగ్రహానికి లేదా చిత్రానికి పాలతో స్నానం చేయించండి.
  2. తర్వాత పసుపు, కుంకుమ, అక్షతలతో అలంకరించండి.
  3. ఆవు పాలు, లడ్డు, అటుకులు దర్భలను నైవేద్యం పెట్టండి.
  4. కొంత మంది సుభ్రమణ్య స్వామి ఆలయాలను సందర్శిస్తారు. మరికొందరు తమకు సమీపంలో ఉన్న పాము పుట్టల్లో పాలు పోసి పాములను పూజిస్తారు
  5. ఈ రోజు పాములను పూజించడం వలన సర్ప దోషం తొలగి పోతుందని నమ్మకం.
  6. పాములను శివుని ఆభరణాలుగా, ప్రకృతి రక్షకులుగా భావిస్తారు. కనుక నాగ పంచమి రోజున పాములను పూజించడం ద్వారా ఆధ్యాత్మికంగానే కాదు పర్యావరణ సమతుల్యత రెండూ కాపాడబడతాయని విశ్వాసం.

ఏ పాములను ప్రత్యేకంగా పూజిస్తారు?

ఈ రోజున “అనంత, వాసుకి, శేష, పద్మ, కంబళ, కర్కోటక, అశ్వితరా, ధృతరాష్ట్ర, సంకపాల, కాల్య, తక్షక, పింగళ అనే 12 ప్రధాన సర్పాలను పూజించే ప్రత్యేక ఆచారం ఉంది.

నాగ పంచమి రోజున సర్పాలను పూజించడం వలన కలిగే ఫలితాలు ఏమిటంటే

  1. అకాల మరణ భయం పోతుంది
  2. ఆకస్మిక ప్రమాదాల నుంచి రక్షణ కలుగుతుంది.
  3. ఎప్పటి నుంచో ఇబ్బంది పడుతున్న వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది.

నాగ పంచమి పూజ మాత్రమే కాదు, సాధన

నాగ పంచమి నాడు చేసే పూజ దోషాలను శాంతింపజేయడమే కాదు ఇది ఒక ఆధ్యాత్మిక సాధన కూడా.. హిందువులు సర్పాలను శక్తి, రక్షణ, ఆధ్యాత్మిక పురోగతికి చిహ్నంగా భావిస్తారు. ఈ రోజున భక్తితో, పద్ధతితో పూజించే వ్యక్తి భౌతిక సుఖాలతో పాటు ఆధ్యాత్మిక శాంతిని , కర్మ శుద్ధిని పొందుతాడని విశ్వాసం.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.