Garuda Puran: ఈ అలవాట్లు ఉంటే వెంటనే గుడ్ బై చెప్పండి.. లేదంటే జీవితాంతం వ్యాధుల బారిన పడతారంటున్న గరుడ పురాణం..
గరుడ పురాణం అష్టాదశ పురాణాలలో ఒకటి. ఈ పురాణం శ్రీ మహా విష్ణువు తన భక్తుడైన గరుడికి ఉపదేశించాడు. అందుకే ఈ పురాణాన్ని గరుడ పురాణం అని పిలుస్తారు. ఈ పురాణంలో మనిషి మరణించిన తరువాత జీవి చేసే ప్రయాణం, నరక లోక వర్ణన ఉంటుంది. అంతేకాదు మానవుడు పాపాలకు ఇలలో, నరకలోకంలో విధించే శిక్షలు సహా ప్రాయశ్చిత్తం, పుణ్య కార్యాల వర్ణన ఉంటుంది. ఈ నేపధ్యంలో ఈ రోజు గరుడ పురాణం ప్రకారం మీరు వ్యాధుల బారిన పడటానికి 6 కారణాల గురించి చెబుతుంది. వీటిని తెలుసుకుని పాటించిన వ్యక్తి ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంటాడట.

హిందూ మతంలో గరుడ పురాణానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ పురాణం 18 మహాపురాణాలలో ఒకటి. స్వర్గం, నరకం, పాపాలు, పుణ్యాలు, మరణం గురించి అనేక విషయాలను వెల్లడిస్తుంది. దీనితో పాటు, జీవితంలో కలిగే ప్రతి కష్టం నుంచి మిమ్మల్ని దూరంగా ఉంచడంలో సహాయపడే అనేక విధానాలను గురించి చెబుతుంది. ఒక వైపు గరుడ పురాణం మరణ రహస్యాన్ని చెబుతుంది. మరోవైపు తనలో దాగి ఉన్న జీవిత రహస్యాలను కూడా చెబుతుంది. గరుడ పురాణం మీరు వ్యాధుల బారిన పడటానికి 6 కారణాల గురించి చెబుతుంది. ఈ విషయాల గురించి తెలుసుకోండి. వాటి గురించి తెలుసుకోవడం ద్వారా ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండవచ్చు.
పద్యం
अत्यम्बुपानं कठिनाशनं च, धातुक्षयो वेगविधापणं च। दिवाशयो जागरणं च रात्रौ, षड्भिर्नराणा प्रभवन्ति रोगाः।।
ఎక్కువ నీరు తాగడం నీరు తాగడం ఆరోగ్యానికి మంచిదని భావిస్తారు. ప్రతిరోజూ తగినంత నీరు త్రాగడం ద్వారా కడుపుతో పాటు మొత్తం శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. గరుడ పురాణం ప్రకారం.. ఎవరైనా అవసరమైన దానికంటే ఎక్కువ నీరు తాగితే అనేక వ్యాధుల బారిన పడవచ్చు.
ఒత్తిడి పెరిగిందని దినచర్యను ఆపేస్తే దినచర్య పనిని క్రమం తప్పకుండా చేయడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ఎవరైనా ఒత్తిడికి గురైనప్పుడు తమ పనులను పక్కకు పెట్టేస్తారు. అయితే శరీరంలో ఒత్తిడి పెరిగిందని తమ దినచర్యని విస్మరించడం వలన భవిష్యత్తులో అనేక వ్యాధుల బారిన పడవచ్చు.
అధికంగా ఆహారం తినడం: శరీరంలో పోషకాల కొరతను తీర్చడానికి విటమిన్లు, ప్రోటీన్లు అధికంగా ఉండే వాటిని తినే ఆహారంలో చేర్చుకుంటారు. అయితే ఆహారం తినే విషయంలో జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం. ఎక్కువగా తినడం ఆరోగ్యానికి హానికరం. అందువల్ల ఎప్పుడూ అల్పాహారంగా ఆరోగ్యకరమైన మంచి ఆహారాన్ని తినండి. అదే సమయంలో భోజనంలో తేలికపాటి ఆహారం తినండి, రాత్రి భోజనంలో తక్కువ నూనె, సుగంధ ద్రవ్యాలున్న ఆహారాన్ని తినండి.
పగలు నిద్రపోవడం నిద్ర ప్రతి జీవికి అవసరం. రోజులో తగినంత నిద్రపోవడం వలన ఆరోగ్యంగా ఉంటారు. అయితే పగలు విశ్రాంతి కోసం నిద్రపోవడం వల్ల అనేక వ్యాధుల బారిన పడతారు. కనుక ఈ అలవాటును వెంటనే మానేయడం మంచిది.
రాత్రి మేల్కొనే అలవాటు రాత్రి నిద్రపోకుండా పగలు నిద్రపోయే అలవాటు చాలా మందికి ఉంటుంది. గరుడ పురాణం ప్రకారం ప్రతి పనికీ ఒక నిర్ణీత సమయం ఉంది. ఎవరైనా రాత్రంతా మేల్కొని ఉంటే.. వారి శరీరంలో రక్త ప్రసరణ చెదిరిపోతుంది. దీని కారణంగా అనేక వ్యాధుల బారిన పడవచ్చు.
రోగనిరోధక శక్తి బలహీనపడటం వ్యాధులతో పోరాడటానికి శరీరానికి బలమైన రోగనిరోధక శక్తి ఉండటం చాలా ముఖ్యం. రోగనిరోధక శక్తి దినచర్యపై ఆధారపడి ఉంటుంది. కనుక మేల్కొనడం, నిద్రపోవడం నుంచి తినడం, త్రాగడం వరకు ప్రతిదానికీ ఒక టైమ్ టేబుల్ తయారు చేసుకోవాలి. ఇలా చేయడం వలన రోగనిరోధక శక్తి బలోపేతం అవుతుంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.








