Swapna Shastram: కలలో ఈ పక్షులు కనిపిస్తే మీకు మంచి రోజులు వచ్చాయని అర్ధమట.. లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఉన్నదట
కలలో కొన్ని పక్షులను చూడటం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ప్రకృతి మనకు కలల ద్వారా..ముఖ్యంగా కొన్ని పక్షులు శుభ రూపంలో కనిపిస్తే ఆ కలలు కొన్ని సంకేతాలను ఇస్తాయట. స్వప్న శాస్త్రం ప్రకారం ప్రతి కల మంచి, చెడు సంకేతాలను ఇస్తుంది. అలాంటి శుభ సంకేతం ఏమిటంటే.. కలలో కొన్ని ప్రత్యేక పక్షులను చూడటం. స్వప్న శాస్త్రం ప్రకారం ఆ పక్షులు ఏమిటి? అవి కలల ద్వారా మనకు ఏ సంకేతాలను ఇస్తాయో తెలుసుకుందాం..

స్వప్న శాస్త్రం ప్రకారం కొన్ని రకాల పక్షులు జీవితంలో సానుకూల మార్పులు, ఆర్థిక లాభాలు, పురోగతిని సూచిస్తాయి. హిందూ మతం ప్రకారం కలలు మానవ జీవితంలో గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. రాత్రి సమయంలో కనిపించే కలలు ఖచ్చితంగా మన జీవితానికి సంబంధించిన కొన్ని సూచనలను ఇస్తాయి. ఈ కలల సంకేతాలను స్వప్న శాస్త్రం లో వివరంగా వివరించబడింది. కలలలో కనిపించే విషయాలు మన జీవితంలో శుభ, అశుభ సంఘటనలను సూచిస్తాయి. కలలలో కనిపించే విషయాలకు అర్ధాన్ని స్వప్న శాస్త్రం వివరిస్తుంది.
మన కలలో మనకు ఏది కనిపించినా ఆ కలకు ఖచ్చితంగా కొంత అర్థం ఉంటుంది. ఈ కలలు భవిష్యత్తులో ఏమి జరగనున్నాయో ముందుగా తెలియజేస్తాయి. స్వప్న శాస్త్రం ప్రకారం మన కలలో ఈ మూడు పక్షులు కనిపిస్తే ఈ జీవితంలో రానున్న మంచి రోజులను ముందుగానే మీకు తెలియజేస్తున్నాయని అర్ధం. మీరు ఈ పక్షులను కలలో చూసినట్లయితే మంచి రోజులు వచ్చాయని అర్థం చేసుకోవాలట.
కలలో చిలుకను చూస్తే.. స్వప్న శాస్త్రం ప్రకారం కలలో చిలుకను చూసినట్లయితే మంచి రోజులు రాబోతున్నాయని అర్థం చేసుకోండి. అంటే చిలుకను చూడటం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. చిలుకను చూడటం ధన లాభానికి సంకేతం అని చెబుతారు. మరోవైపు కలలో జంట చిలుకలను చూసినట్లయితే వివాహ జీవితంలో ప్రేమ పెరుగుతుందని అర్థం. చిలుకను చూడటం కూడా ఇంట్లో ఆనందం, శ్రేయస్సుకు సంకేతం.
కలలో గుడ్లగూబ కనిపిస్తే ఎవరి కలలోనైనా గుడ్లగూబ కనిపిస్తే లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తున్నదానికి సంకేతం. గుడ్లగూబను చూసినట్లయితే ఆర్థిక సమస్యలు త్వరలోనే తీరబోతున్నాయని అర్థం చేసుకోవాలట. కలలో గుడ్లగూబను చూడటం వ్యాపారం, ఉద్యోగంలో పురోగతికి కూడా సంకేతం.
కలలో నెమలిని చూడటం స్వప్న శాస్త్రం ప్రకారం కలలో నెమలిని చూడటం చాలా శుభ సంకేతం. నెమలి కార్తికేయ భగవానుడి వాహనం, కలలో నెమలిని చూడటం అంటే పని చేసే రంగంలో విజయాన్ని సూచిస్తుందని నమ్ముతారు. అలాగే అలాంటి కల ఇంటిలో ఆనందం, శ్రేయస్సులో పురోగతిని సూచిస్తుంది.
కలలో హంసను చూస్తే నీటిలో ఈత కొడుతున్న హంసను లేదా హంసల జతను చూడటం కూడా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇది శుభ కార్యం లేదా ఆర్థిక లాభాన్ని సూచిస్తుంది.
కలలో పాలపిట్టని చూస్తే ఒంటరి వ్యక్తులకు నీలకంఠ పక్షిని చూడటం శుభసూచకంగా పరిగణించబడుతుంది. ఇది త్వరలో జీవిత భాగస్వామిని లభించనుందని సంకేతం.
కలలో డేగను చూస్తే కలలో గరుడుడిని చూడటం కూడా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ముఖ్యంగా డేగ శ్రీ మహా విష్ణువు వాహనం కనుక కలలో కనిపిస్తే.. మీకు మంచి సమయం మొదలు కానుందని నమ్మకం.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.








