Pradosh Vrat: సెప్టెంబర్ 2025లో ప్రదోష వ్రతం తేదీ, పూజ విధి, ప్రాముఖ్యత తెలుసుకోండి
ప్రదోష వ్రత రోజున ప్రదోష సమయంలో శివుడిని పూజించడం వల్ల శివుడి అనుగ్రహం కలుగుతుంది. మత విశ్వాసాల ప్రకారం ప్రదోష ఉపవాసం పాటించడం వల్ల ఒక వ్యక్తి జీవితంలోని దుఖం, బాధలు తొలగిపోతాయి. సెప్టెంబర్‌లో మొదటి శుక్ర ప్రదోష ఉపవాసం ఎప్పుడు వస్తుంది? ఈ రోజున పూజకు ఎప్పుడు శుభ సమయం అని తెలుసుకుందాం.

ప్రతి నెలా ప్రదోష వ్రతంఆచరిస్తారు. శివుడి అనుగ్రహం కోసం ఉపవాసం పాటిస్తారు. పుజిస్తారు. ఈ ప్రదోష వ్రతం.. ఉపవాసం ప్రతి నెల శుక్ల , కృష్ణ పక్ష త్రయోదశి తిథిలో ఆచరిస్తారు. ఈ ఉపవాసం స్వామిని ప్రసన్నం చేసుకోవడానికి.. శివుడి అనుగ్రహాన్ని కోరుతూ ఆచరిస్తారు. ప్రదోష సమయంలో చేసే పూజలు భక్తుల దుఃఖాలన్నింటినీ తొలగిస్తాయి.. జీవితంలో ఆనందం . శ్రేయస్సును తెస్తాయని నమ్మకం.
పంచాంగం ప్రకారం భాద్రపద మాసంలో మొదటి ప్రదోష ఉపవాసం శుక్ల పక్ష త్రయోదశి తిథి నాడు పాటించబడుతుంది. త్రయోదశి తిథి సెప్టెంబర్ 5వ తేదీ ఉదయం 4:08 గంటలకు ప్రారంభమై సెప్టెంబర్ 6, ఉదయం 3:12 గంటలకు ముగుస్తుంది.
పంచాంగం ప్రకారం సెప్టెంబర్ 5 న స్వామిని పూజించడానికి శుభ సమయం సాయంత్రం 6:38 నుంచి రాత్రి 8:55 వరకు ఉంటుంది.
ప్రదోష వ్రత సమయంలో పాటించాల్సిన ఆచారాలు
ఉదయాన్నే లేచి, స్నానం చేసి, పూజా ఏర్పాట్లు చేయాలి.
శివ పార్వతి విగ్రహాలను పూర్తి భక్తితో, నిర్మలమైన మనసుతో పూజించాలి.
స్వామికి పూలు, దండలు, పండ్లు, స్వీట్లు, ఇతర వస్తువులను సమర్పించవచ్చు.
శివలింగానికి అభిషేకం చేయాలి. శివ అభిషేకం,పూజ లో పాలు, తేనె, చక్కెర, నెయ్యి, గంగాజలం, జమ్మి ఆకులు, పుష్పాలు, బిల్వ పత్రం సమర్పించాలి.
పూజ సమయంలో స్వచ్ఛమైన నెయ్యి వేసి దీపం వెలిగించి ‘ఓం నమః శివాయ’ మంత్రాన్ని జపించాలి.
శివ చాలీసాను పఠించాలి. ప్రదోష వ్రత కథను కూడా చదవాలి.
ఈ రోజున శివుడి అనుగ్రహం కోసం దానధర్మాలు కూడా చేయవచ్చు. అవసరమైన వారికి ఆహారాన్ని ఇవ్వడం వలన శివయ్య అనుగ్రహం కలుగుతుంది.
ప్రదోష వ్రత ప్రాముఖ్యత:
ప్రదోష వ్రతం ఆచరించడం వలన ఆత్మ శుద్ధి అవుతుందని, పాపాలు తొలగిపోతాయని, ప్రతికూల కర్మల ప్రభావాలను తగ్గిస్తుందని నమ్ముతారు. ఇది ఆధ్యాత్మిక శుద్ధి, పురోగతికి దారితీస్తుంది. భక్తులు ఆరోగ్యం, సంపద, శాంతి, శ్రేయస్సు కోసం ప్రార్థిస్తారు. ఈ వ్రత సమయంలో శివుని ఆశీస్సులు అడ్డంకులను తొలగించి వ్యక్తిగత , వృత్తి జీవితంలో విజయాన్ని తెస్తాయని నమ్ముతారు. ఈ వ్రతం స్వీయ క్రమశిక్షణను, కోరికలపై నియంత్రణను ప్రోత్సహిస్తుంది, ఆధ్యాత్మిక లక్ష్యాలపై ఏకాగ్రతను పెంచుతుంది. ప్రదోష వ్రత సమయంలో ఉపవాసం, ప్రార్థన ధ్యానంలో దైవంతో బలమైన సంబంధాన్ని పెంపొందించడంలో సహాయపడతాయి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.








