AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Unique Temple:ఈ ఆలయంలో 32 రూపాల్లో కొలువైన గణపతి.. ఒకొక్క రూపానికి ఒకొక్క విశిష్టత..

దేశ వ్యాప్తంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నారు. మండపాలలో కొలువైన గణపతి భక్తులతో పూజలను అందుకుంటున్నాడు. అంతేకాదు దేశంలోని ప్రసిద్ధిగాంచిన గణపతి ఆలయాలను దర్శించుకోవడానికి భక్తులు ఆసక్తిని చూపిస్తున్నారు. ఈ నేపధ్యంలో గణేశుడు 32 విభిన్న రూపాల్లో ఉన్న ప్రత్యేక ఆలయం గురించి తెలుసుకుందాం. జ్ఞానం, అదృష్టం, అడ్డంకులను తొలగించే గణేష్ ఆలయం చాలా ప్రత్యేకమైనది. ఈ ఆలయంలోని గణపతి దర్శనం కోసం సుదూర ప్రాంతాల నుంచి భక్తులు వస్తారు.

Unique Temple:ఈ ఆలయంలో 32 రూపాల్లో కొలువైన గణపతి.. ఒకొక్క రూపానికి ఒకొక్క విశిష్టత..
Unique Ganesha Temple
Surya Kala
|

Updated on: Aug 30, 2025 | 8:29 AM

Share

భారతదేశంలో విఘ్నాలకధిపతి అయిన గణేశుని అనేక ఆలయాలు ఉన్నాయి. అయితే 32 రూపాల్లో వెలసి భక్తులతో పూజలను అందుకుంటున్న ప్రపంచంలోని ఏకైక గణేశ ఆలయం మైసూర్ లో ఉంది. కర్ణాటకలోని మైసూర్‌లో ఉన్న నంజన్‌గూడ్ శివాలయం శివుడికి అంకితం చేయబడింది. అయితే ఈ ఆలయంలో 32 రకాల గణేశులు ఉన్నారు. ఈ ఆలయం మైసూర్ నగరం నుంచి 27 కి.మీ దూరంలో ఉంది. కాబిని నది ఒడ్డున నిర్మించబడింది.

ఈ ప్రత్యేకమైన ఆలయంలో వివిధ రూపాల్లో 100 కి పైగా దేవుళ్లు, దేవతల విగ్రహాలు ఉన్నాయి. నంజన్‌గూడ్ ఆలయం కర్ణాటకలోని అతిపెద్ద ఆలయాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ ఆలయంలో భక్తుల రద్దీ నిరంతరం ఉంటుంది మరియు ఈ ఆలయాన్ని సందర్శించడానికి ప్రజలు దూర ప్రాంతాల నుంచి వస్తారు.

ఈ ఆలయంలో గణేశుడు నృత్య భంగిమలో, యోగా భంగిమలో, యువకుడి రూపంలో కనిపిస్తాడు. అన్ని విగ్రహాలు చక్కటి శిల్పకళను కలిగి ఉన్నాయి. గణపతికి అంకితం అయిన ముద్గల పురాణం గణేశ పురాణాలలో గణేశుడి ఈ రూపాలు ప్రస్తావించబడ్డాయి. ఈ ప్రత్యేక ఆలయంలో శ్రీ గణేశుడు ఏ రూపాల్లో ఉన్నాడో తెలుసుకుందాం.

ఇవి కూడా చదవండి
  1. శ్రీ బాల గణపతి – ఇది గణేశుడి బాల రూపం. ఈ భగవంతుని రూపాన్ని గణేష్ చతుర్థి నాడు కూడా పూజిస్తారు.
  2. తరుణ గణపతి – ఇది గణపతి టీనేజ్ రూపం. ఆయన శరీరం ఎరుపు రంగులో మెరుస్తుంది.
  3. భక్తి గణపతి – ఈ రూపంలో ఆయన తెలుపు రంగులో ఉంటాడు. ఆయన రంగు పౌర్ణమి చంద్రుడిలా ప్రకాశిస్తుంది.
  4. వీర గణపతి – ఇది గణేష్ యోధ రూపంలో ఉంటాడు. ఈ రూపంలో ఆయనకు 16 చేతులు ఉన్నాయి. ఈ రూపంలో ఉన్న గణపతికి పూజలు చేస్తే మంచి జరుగుతుందని నమ్మకం.
  5. శక్తి గణపతి – ఈ రూపంలో ఆయనకు నాలుగు చేతులు ఉన్నాయి. ఒక చేతితో ఆయన భక్తులందరినీ ఆశీర్వదిస్తూ ఉంటాడు.
  6. ద్విజ గణపతి – ఈ రూపంలో గణపతి రెండు లక్షణాలు ముఖ్యమైనవి. అవి జ్ఞానం, సంపద. ఈ రెండింటినీ పొందడానికి ఈ గణపతి రూపాన్ని పూజిస్తారు.
  7. సిద్ధి గణపతి – ఈ రూపంలో గణేశుడు పసుపు రంగులో ఉంటాడు. అతనికి నాలుగు చేతులు ఉన్నాయి. అతను జ్ఞానం, విజయానికి చిహ్నం. ఈ రూపంలో అతను రిలాక్స్డ్ భంగిమలో కూర్చుని ఉన్నాడు.
  8. ఉచ్చిష్ట గణపతి – ఈ రూపంలో గణేశుడు నీలం రంగులో ఉంటాడు. ఆయన తాంత్రిక రూపం. ఈ రూపం మోక్షాన్ని అలాగే శ్రేయస్సును ఇస్తుంది. ఆయన ఒక చేతిలో సంగీత వాయిద్యం పట్టుకుని కూర్చుని ఉంటాడు.
  9. విఘ్న గణపతి – ఈ రూపంలో గణేష్ బంగారం రంగులో ఉంటాడు. అతనికి ఎనిమిది చేతులు ఉన్నాయి. ఆయన అడ్డంకులను తొలగించే దేవంగా భావించి పుజిస్తారు.
  10. క్షిప్ర గణపతి – ఈ రూపంలో గణేశుడు ఎరుపు రంగులో ఉంటాడు. అతనికి నాలుగు చేతులు ఉంటాయి. అతను సులభంగా సంతోషిస్తాడు. తన భక్తులు కోరిన కోరికలను అత్యంత వేగంగా తీర్చే రూపం.
  11. హేరంబ గణపతి – ఐదు తలల హేరంబ గణేశుడు బలహీనులను రక్షించేవాడు. ఇది అతని ప్రత్యేక రూపం. ఈ రూపంలో అతను సింహంపై స్వారీ చేస్తాడు.
  12. లక్ష్మీ గణపతి – ఈ రూపంలో గణేష్ జ్ఞానం, విజయంతో ఉన్నాడు. అతనికి ఎనిమిది చేతులు ఉన్నాయి. అతని ఒక చేయి అభయ ముద్రలో ఉంటుంది. ఇది అందరికీ విజయం, జ్ఞానాన్ని ఇస్తుంది.
  13. మహాగణపతి – ఎరుపు రంగులో ఉండి.. శివుడిలా మూడు కళ్ళు కలిగి ఉంటాడు. ఆయనకు పది చేతులు ఉన్నాయి. ఆయన శక్తి ఆయనతో కలిసి కూర్చుని ఉంటుంది.
  14. విజయ గణపతి – ఈ రూపంలో అతను తన ఎలుకను స్వారీ చేస్తుంటాడు. దాని పరిమాణం సాధారణం కంటే పెద్దదిగా చూపబడింది.
  15. నృత్య గణపతి – ఈ రూపంలో గణపతి కల్పవృక్షం కింద నృత్యం చేస్తున్నట్లు చూపబడింది. ఆయన సంతోషకరమైన మానసిక స్థితిలో ఉన్నాడు. ఆయనకు నాలుగు చేతులు ఉన్నాయి.
  16. ఊర్ధ్వ గణపతి – ఈ రూపంలో ఆయనకు ఎనిమిది చేతులు ఉన్నాయి. ఆయన శక్తి ఆయన పక్కనే కూర్చుని ఉంది. ఆయన ఒక చేతిలో దానిని పట్టుకుని ఉన్నాడు. ఒక చేతిలో విరిగిన దంతాన్ని పట్టుకుని ఉన్నాడు.
  17. ఏకక్షర గణపతి – ఈ రూపంలో గణేష్‌కి మూడు కళ్ళు ఉంటాయి. చంద్రుడు శివుడి జడలో ఎలా కొలువుదీరి ఉంటాడో.. అదే విధంగా ఈ రూపంలో గణపతి జడలో చంద్రుడు ఉంటాడు.
  18. వర గణపతి – ఈ గణపతి రూపం ఆశీర్వాదాలను ఇవ్వడానికి ప్రసిద్ధి చెందింది. అతను తన తొండంలో రత్నపు కుండను కలిగి ఉంటాడు. అతను విజయం శ్రేయస్సు లను ఆశీర్వాదంగా ఇస్తాడు.
  19. త్రయక్షర గణపతి – ఇది గణేశుడి ఓం కార రూపం. బ్రహ్మ, విష్ణు మరియు మహేశ్వరులు ఇందులో ఉత్నారు. అంటే ఆయన విశ్వం సృష్టికర్త, రక్షకుడు నాశనం చేసేవాడని అర్ధం.
  20. క్షిప్ర ప్రసాద గణపతి – ఈ రూపంలో గణేశుడు కోరికలను త్వరగా తీరుస్తాడు. తప్పులను అంతే త్వరగా శిక్షిస్తాడు. ఆయన పవిత్రమైన దర్భలతో చేసిన సింహాసనంపై కూర్చుంటాడు.
  21. హరిద్ర గణపతి – ఈ రూపంలో గణేష్ పసుపుతో తయారు చేయబడి రాజ సింహాసనంపై కూర్చుని ఉంటాడు. ఈ రూపాన్ని పూజించడం వల్ల కోరికలు నెరవేరుతాయి.
  22. ఏకదంత గణపతి – ఈ రూపంలో గణపతి బొడ్డు ఇతర రూపాల కంటే పెద్దదిగా ఉంటుంది. ఆయన విశ్వాన్ని తనలోనే కలిగి ఉంటాడు. దారిలో వచ్చే అడ్డంకులను తొలగిస్తాడు.
  23. సృష్టి గణపతి – ఈ గణేష్ రూపం ప్రకృతి శక్తులన్నింటినీ సూచిస్తుంది. ఆయన ఈ రూపం బ్రహ్మను పోలి ఉంటుంది.
  24. ఉదండ గణపతి – ఈ రూపంలో గణేశుడు న్యాయాన్ని స్థాపిస్తాడు. ఇక్కడ అతని ఉగ్ర రూపం ఉంటుంది. ఈ రూపంలో గణపతికి 12 చేతులు ఉన్నాయి. అతని శక్తి అతనితో కూర్చుని ఉంది.
  25. “ఋణమోచన గణపతి”- ఈ గణేష్ రూపం అపరాధం, రుణాల నుంచి విముక్తిని ఇస్తుంది. ఈ రూపం భక్తులకు మోక్షాన్ని కూడా ఇస్తుంది. అతను తెల్లటి రంగులో ఉంటాడు. నాలుగు చేతులు కలిగి ఉంటాడు.
  26. ధుంధి గణపతి – ఎరుపు రంగులో ఉన్న గణేష్ రూపంలో, అతని చేతిలో రుద్రాక్ష జపమాల ఉంది. రుద్రాక్షను అతని తండ్రి శివుని చిహ్నంగా భావిస్తారు. అంటే ఈ రూపంలో అతను తన తండ్రి ఆచారాలను మోస్తున్నాడు. అతని చేతిలో ఒక ఎరుపు రంగు రత్నపు పాత్ర కూడా ఉంటుంది.
  27. ద్విముఖ గణపతి – ఈ రూపంలో గణేష్ కు రెండు ముఖాలు ఉంటాయి. అవి అన్ని దిశలలో చూడగల సామర్థ్యాన్ని సూచిస్తాయి. రెండు ముఖాలలో గణపతి తొండం పైకి ఉంటుంది.
  28. త్రిముఖ గణపతి – ఈ రూపంలో గణపతికి మూడు ముఖాలు,ఆరు చేతులు ఉన్నాయి. కుడి , ఎడమ ముఖాల తొండం పైకి లేచి ఉంటుంది. ఆయన బంగారు కమలం మీద కూర్చుని ఉంటాడు.
  29. సింహ గణపతి – ఈ రూపంలో, గణేష్ సింహం రూపంలో కూర్చుని ఉంటాడు. అతని ముఖం కూడా సింహం ముఖంలా ఉంటుంది. అతనికి తొండం కూడా ఉంటుంది.
  30. యోగ గణపతి – ఈ రూపంలో గణేశుడు యోగిలా కనిపిస్తాడు. ఆయన మంత్రాలు జపిస్తూ ఉత్నాడు. ఆయన పాదాలు యోగ భంగిమలో ఉంటాయి.
  31. దుర్గా గణపతి – ఈ గణేశ రూపం అజేయుడు. గణేశుడు ఈ అంశాన్ని ప్రకటించడానికి అతను తన శక్తి, బలానికి చిహ్నంగా విజయ పతాకాన్ని ప్రదర్శిస్తాడు!
  32. సంకష్టహరణ గణపతి – ఈ రూపంలో గణేశుడు భయం, దుఃఖాన్ని తొలగిస్తాడు. ఆయనను పూజించడం వల్ల సంక్షోభ సమయాల్లో బలం లభిస్తుందని నమ్ముతారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..