AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాకిస్తాన్ లో ఘనంగా వినాయక చవితి వేడుకలు.. గణపతి మండపాల్లో ప్రత్యేక పూజలు.. వీడియో వైరల్…

వినాయక చవితి వేడుకలను మనదేశంలో మాత్రమే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులు అందరూ ఎంతో ఘనంగా జరుపుకున్నారు. తాజాగా దాదాయాది దేశం పాకిస్తాన్‌లోని కరాచీలో గణేశోత్సవం ఎంతో ఉత్సాహంగా, భక్తితో జరుపుకున్నారు. కరాచీ నగరం మొత్తం 'గణపతి బప్పా మోరియా' , జయ దేవ జయ దేవ అనే నినాదాలతో ప్రతిధ్వనించింది. చవితి వేడుకలకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి

పాకిస్తాన్ లో ఘనంగా వినాయక చవితి వేడుకలు.. గణపతి మండపాల్లో ప్రత్యేక పూజలు.. వీడియో వైరల్...
Vinyaka Chavithi Celebrations In Pakistan
Surya Kala
|

Updated on: Aug 30, 2025 | 7:50 AM

Share

వినాయక చవితి పండుగను దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులు ఘనంగా జరుపుకున్నారు. మన పొరుగు దేశమైన పాకిస్తాన్‌లో కూడా గణేశోత్సవాన్ని జరుపుకున్నారు. పాకిస్తాన్‌లోని కరాచీలో నివసిస్తున్న కొంకణి మరాఠీ సమాజానికి చెందిన హిందువులు బప్పాను ఉత్సాహంతో, ఎంతో భక్తి శ్రద్దలతో స్వాగతించారు. ఈ సమయంలో కరాచీ నగరం మొత్తం ‘గణపతి బప్పా మోరియా’ , జయ దేవ , జయ దేవ అనే నినాదాలతో ప్రతిధ్వనించింది. ఈ వేడుకలకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో కూడా వైరల్ అయింది. ఆ దేశంలో వినాయక చవితి వేడుకలను చూసి భారతీయులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. పాకిస్తానీ హిందువులకు ( పాకిస్తానీ హిందువులు ) శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

కరాచీలోని రత్నేశ్వర మహాదేవ ఆలయం, గణేష్ మఠం, స్వామినారాయణ ఆలయంలో ప్రత్యేక పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. సాంప్రదాయ పద్దతిలో వినాయక చవితి వేడుకలను జరుపుకున్నారు.

ఇవి కూడా చదవండి

ఈ పోస్ట్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో వీక్షించండి

వైరల్ అవుతున్న మరొక వీడియోలో కరాచీలోని స్వామినారాయణ్ ఆలయంలో బాలీవుడ్ చిత్రం ‘అగ్నిపథ్’ లోని ‘దేవా శ్రీ గణేశ’ పాటకు హిందూ యువకుల బృందం ఉత్సాహంగా నృత్యం చేస్తున్నట్లు చూడవచ్చు.

గణేష్ చతుర్థి నాడు భక్తిశ్రద్ధలతో నిండిన కరాచీ నగరం

ఈ అందమైన వీడియోలను పాకిస్తానీ ఇన్‌స్టాగ్రామ్ యూజర్లు @vikash_vada , @ariyadhanwani షేర్ చేశారు, ఇవి నెటిజన్ల హృదయాలను, ముఖ్యంగా భారతీయుల హృదయాలను గెలుచుకున్నాయి.

ఈ వైరల్ వీడియోలపై నెటిజన్లు ప్రేమను కురిపిస్తున్నారు. ఒక యూజర్, “అల్లాహ్ మిమ్మల్ని ఎప్పటికీ సంతోషంగా ఉంచుగాక” అని వ్యాఖ్యానించారు. మరొక యూజర్, “ఇలా ఐక్యతను కాపాడుకుంటూ ఉండండి” అని రాశారు. మీకు గణేష్ చతుర్థి శుభాకాంక్షలు” అని రాశారు. ఒక పాకిస్తానీ యూజర్, “నేను పాకిస్తానీ హిందువుగా ఉన్నందుకు గర్వపడుతున్నాను” అని రాశారు. నేను పాకిస్తాన్‌లోని షాదారాకి చెందిన వ్యక్తిని అని చెప్పారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..