AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Astro Tips: వివాహం ఆలస్యం అవుతుందా.. ఆర్ధిక సమస్యలా.. పసుపు కలిపిన నీటితో స్నానం చేయండి..

వివాహానికి ముందు నిర్వహించిన క్రతువులో పసుపు వేసిన నీటితో వధువు వరుడిని స్నానం చేయిస్తారు. దీనిని మంగళ స్నానం అంటారు. అయితే ఈ ఒక్క రోజు మాత్రమే కాదు.. జ్యోతిషశాస్త్రం ప్రకారం చిటికెడు పసుపు కలిపిన నీటిని స్నానం చేయడం వలన అనేక ప్రయోజనాలున్నాయి. పసుపు పవిత్రమైన, శుద్ధి చేసే లక్షణాలను కలిగి ఉంటుంది. పసుపు నీటితో స్నానం చేయడం వల్ల ప్రతికూల శక్తి తొలగిపోతుంది. బృహస్పతి ప్రభావాన్ని పెంచడంలో పాటు వివాహంలో అడ్డంకులను తొలగించడంలో సహాయపడుతుంది.

Astro Tips: వివాహం ఆలస్యం అవుతుందా.. ఆర్ధిక సమస్యలా.. పసుపు కలిపిన నీటితో స్నానం చేయండి..
Astrological Benefits
Surya Kala
|

Updated on: Aug 25, 2025 | 11:53 AM

Share

జ్యోతిష్యం ప్రకారం పసుపుకు శుద్ధి చేసే లక్షణాలు ఉన్నాయి. ఇది శరీరం నుంచి ప్రతికూల శక్తిని తొలగిస్తుంది. స్నానపు నీటిలో పసుపును జోడించడం వల్ల అదృష్టం, శ్రేయస్సు లభిస్తుందని నమ్ముతారు. పసుపుకి దేవ గురువు బృహస్పతితో, అంటే నవ గ్రహాల్లో గురువు తో సంబంధం కలిగి ఉంటుంది. కనుక పసుపుతో స్నానం చేయడం జాతకంలో బృహస్పతిని బలపరుస్తుంది. మీ జాతకంలో బృహస్పతి బలహీనంగా ఉంటే, పసుపు నీటితో స్నానం చేయడం వల్ల బృహస్పతి దోషాలు తొలగిపోతాయని చెబుతారు.

సనాతన ధర్మం విశ్వాసం ప్రకారం.. స్నానపు నీటిలో పసుపు కలపడం వల్ల ఆర్థిక లాభాలు, ఆనందం , శాంతి లభిస్తాయి. వ్యక్తికి విజయం లభిస్తుంది. జ్యోతిషశాస్త్రంలో పసుపు నీటితో స్నానం చేయడం అదృష్టానికి ద్వారాలు తెరవడంతో పాటు అనేక ప్రయోజనాలు కలిగిస్తుందని నమ్మకం.

గురువారం నాడు పసుపుతో స్నానం చేయడం వల్ల వివాహ అడ్డంకులు తొలగిపోతాయని నమ్ముతారు. అంతేకాదు త్వరగా వివాహం జరిగే అవకాశాలు ఉంటాయి. పసుపును శుభప్రదంగా, పవిత్రంగా భావిస్తారు. కనుక పసుపు కలిపిన నీటితో స్నానం చేయడం వల్ల ఇంటికి శ్రేయస్సు, ఆనందం కలుగుతుంది.

ఇవి కూడా చదవండి

ఒక బకెట్ నీటిలో చిటికెడు పసుపు పొడి వేసి.. ఆ పసుపును బాగా కలిపి ఆ నీటితో స్నానం చేయండి. ముఖ్యంగా గురువారం ఈ పసుపు నీటి స్నానం ఒక పరిహారం అని చెబుతున్నారు. అంతేకాదు గురువారం పసుపు నీటితో స్నానం చేస్తే.. స్నానం చేసిన తర్వాత ఖచ్చితంగా పసుపు రంగు దుస్తులు ధరించండి. ఇలా చేయడం వలన శ్రీ మహా విష్ణువు అనుగ్రహంతో పాటు.. గురు దోషం తొలగిపోతుందని విశ్వాసం.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

అగ్రికల్చర్ వర్సిటీలో పేపర్ లీక్ కలకలం.. 35 మంది అభ్యర్థులపై వేటు
అగ్రికల్చర్ వర్సిటీలో పేపర్ లీక్ కలకలం.. 35 మంది అభ్యర్థులపై వేటు
ఆ దేవుడిని దర్శిస్తే జుట్టు పెరుగుతుందని నమ్ముతారని తెలుసా?
ఆ దేవుడిని దర్శిస్తే జుట్టు పెరుగుతుందని నమ్ముతారని తెలుసా?
‘స్పిరిట్’ విషయంలో ప్రభాస్ షాకింగ్ నిర్ణయం! ఫ్యాన్స్‌ మాత్రం ఫిదా
‘స్పిరిట్’ విషయంలో ప్రభాస్ షాకింగ్ నిర్ణయం! ఫ్యాన్స్‌ మాత్రం ఫిదా
హీరోయిన్ అమలా పాల్ ముద్దుల కుమారుడిని చూశారా? ఫొటోస్ వైరల్
హీరోయిన్ అమలా పాల్ ముద్దుల కుమారుడిని చూశారా? ఫొటోస్ వైరల్
ఒక్క సీన్‌కి అంతా! ప్రభాస్ పట్టుబడితే డైరెక్టర్ నో అని చెప్పగలడా?
ఒక్క సీన్‌కి అంతా! ప్రభాస్ పట్టుబడితే డైరెక్టర్ నో అని చెప్పగలడా?
హోమ్‌ లోన్‌ తీరితే.. మర్చిపోకుండా పూర్తి చేయాల్సిన పనులు ఇవే!
హోమ్‌ లోన్‌ తీరితే.. మర్చిపోకుండా పూర్తి చేయాల్సిన పనులు ఇవే!
వంటలో 'ఆకు' మ్యాజిక్! వీటిలో తింటే రుచితో పాటు ఆరోగ్యమూ..
వంటలో 'ఆకు' మ్యాజిక్! వీటిలో తింటే రుచితో పాటు ఆరోగ్యమూ..
మన శంకరవరప్రసాద్ గారు 'హుక్ స్టెప్' కంపోజ్ చేసింది ఎవరో తెలుసా?
మన శంకరవరప్రసాద్ గారు 'హుక్ స్టెప్' కంపోజ్ చేసింది ఎవరో తెలుసా?
పండగ ముందు బంగారం ధర భారీగా తగ్గుతుందా?
పండగ ముందు బంగారం ధర భారీగా తగ్గుతుందా?
ఆ 21 దేశాలకు ట్రావెల్ బ్యాన్ విధించిన ట్రంప్ సర్కార్ !
ఆ 21 దేశాలకు ట్రావెల్ బ్యాన్ విధించిన ట్రంప్ సర్కార్ !