- Telugu News Photo Gallery Spiritual photos Vinayaka Chavithi special: Ganesha is worshiped in various forms across the world, know the details
Lord Ganesha: హిందువులు మాత్రమే కాదు వివిధ దేశాల్లో పూజలను అందుకునే గణపయ్య.. వివిధ రూపాల్లో పూజించే 11 దేశాలు
హిందూ సనాతన ధర్మంలో విఘ్నాలను తొలగించే దైవంగా భావించి వినాయకుడికి మొదటి పూజను చేస్తారు. పండగలు , పూజ, శుభకార్యాలు ఇలా ఏ సందర్భంలోనైనా మొదట పూజ గణపతి అందుకుంటాడు. అయితే వినాయకుడిని హిందువులు మాత్రమే కాదు.. అనేక ఇతర దేశాల్లో పూజిస్తారు. వివిధ సంస్కృతులలో వివిధ రూపాల్లో గుర్తింపు పొండతాడు. ఆరాదింప బడుతున్నాడు. ఈ రోజు వినాయకుడిని పూజించే ఇతర దేశాల గురించి తెలుసుకుందాం..
Updated on: Aug 25, 2025 | 1:34 PM

మన దేశంలో మాత్రమే కాదు విదేశాల్లో కూడా గణపతిని పుజిస్తారు. వివిధ రూపాల్లో,వివిధ పేర్లతో పూజిస్తారు. నేపాల్, శ్రీలంక, మయన్మార్, థాయిలాండ్, ఇండోనేషియా, కంబోడియా, జపాన్, చైనా, టిబెట్, మలేషియా, వంటి అనేక దేశాల్లో గణపతిని వివిధ పద్దతుల్లో పూజిస్తారు. ఆయా దేశాల్లో వినాయకుడిని విఘ్నాలు తొలగించే దైవంగా భావిస్తారు. దేవాలయాలలో , వీధుల్లో గణపతి విగ్రహాలున్నాయి.

భారత దేశంలో దాదాపు ప్రతి హిందువుల ఇంట్లో , ప్రతి ఆలయంలో గణేశుడిని పూజిస్తారు. గణపతి జన్మ దినోత్సవాన్ని వినాయక చవితి పండగగా విశేషంగా జరుపుకుంటారు. దేశంలో గల్లీ గల్లీ గొప్ప ఉత్సాహంతో వినాయకుడిని పుజిస్తారు. అనేక పేర్లతో పిలుస్తారు. ఏదైనా పూజ, ముఖ్యమైన కార్యక్రమంలో గణపతి పూజతో మొదలు పెడతారు.

నేపాల్‌లో గణేశుడు: ఈ దేశంలో కూడా వినాయకుడికి ప్రత్యేక పూజలు చేస్తారు. ముఖ్యంగా పండుగల సమయంలో, కొత్త వ్యాపారాల ప్రారంభంలో గణేశుడిని విస్తృతంగా పూజిస్తారు. గణపతి చిత్రం అనేక దేవాలయాలలో కనిపిస్తుంది. దశైన్ పండుగ సమయంలో గణపతిని విశేషంగా పుజిస్తారు.

థాయిలాండ్‌లో గణేశుడు: ఈ దేశంలో వినాయకుడిని ఫ్రా ఫికనెట్ అంటారు. ఆయనను అదృష్టం, విజయన్ని ఇచ్చే దైవంగా గౌరవిస్తారు, దేశవ్యాప్తంగా ఆయనకు ఆలయాలు అంకితం చేయబడ్డాయి.

కంబోడియాలో గణేశుడు: హిందూ మతంలో గణపతి పూజకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. అంగ్కోర్ వాట్ వంటి పురాతన దేవాలయాలలో వినాయక విగ్రహం కనిపిస్తుంది. ఆయన శ్రేయస్సుతో ముడిపడి ఉంది. చేపట్టిన పని విజయం కోసం ప్రార్థిస్తారు.

ఇండోనేషియాలో గణేశుడు: ఈ దేశంలో గణేశుడు జ్ఞానం, తెలివి తేటలకు చిహ్నంగా గుర్తించబడ్డాడు. గణపతి చిత్రం రూపాయి కరెన్సీపై కనిపిస్తుంది. ఈ దేశంలో 1వ శతాబ్దానికి చెందిన విగ్రహాలు కనుగొనబడ్డాయి. ఇది గణపతి చారిత్రక ప్రాముఖ్యతను సూచిస్తుంది.

జపాన్‌లో గణేశుడు: జపాన్ దేశ ప్రజలు గణేశుడిని కంగిటెన్ అని పిలుస్తారు. ఆయనను దాదాపు 250 దేవాలయాలలో పూజిస్తారు. ఆ దేశంలో గణపతిని కష్టాలు తీర్చే దైవంగా విశ్వసిస్తారు. అక్కడ ఆయన బలమైన సంబంధాలు , ఆనందంతో ముడిపడి ఉన్నాడు.

మయన్మార్‌లో గణేశుడు: ఈ దేశంలో శ్వేశాంద్ పగోడాతో సహా వివిధ దేవాలయాలలో గణేశుడిని పుజిస్తారు. అక్కడ గణపతి విగ్రహాలు ప్రముఖంగా ప్రదర్శించబడతాయి. అడ్డంకులను తొలగించే వ్యక్తిగా గుర్తింపు పొందారు. స్థానిక బౌద్ధ ఆచారాలలో గణపతి పూజ కలిసి పోయింది.

వియత్నాంలో గణేశుడు: ఈ దేశంలో చాం ప్రజలకు గణేశుడు అత్యంత పూజనీయమైన దైవం. వ్యవసాయ శ్రేయస్సుతో గణపతికి ముడిపడి ఉంది. గణపతి ఆరాధన హిందూ,బౌద్ధ సంప్రదాయాలను ప్రతిబింబిస్తుంది.

చైనాలో గణేశుడు: డ్రాగన్ కంట్రీలోని కొన్ని ప్రాంతాలలో గణేశుడిని సంపద, శ్రేయస్సుకు చిహ్నంగా పూజిస్తారు. తరచుగా స్థానిక ఆచారాలలో గణపతిని పుజిస్తారు.

టిబెట్‌లో గణేశుడు: ఈ దేశంలో గణేశుడు వివిధ రూపాల్లో కనిపిస్తాడు, తరచుగా రక్షక దేవతగా. అతను టిబెటన్ బౌద్ధమతంలో వినాయకుడిగా కలిసిపోయాడు.

మంగోలియాలో గణేశుడు: ఈ దేశంలో కొన్ని బౌద్ధ ఆచారాలలో గణేశుడిని పుజిస్తారు. అక్కడ ఆయనను రక్షకుడిగా , అదృష్ట దేవతగా భావిస్తారు.
