- Telugu News Photo Gallery Cinema photos Financial gains for people of four zodiac signs due to Venus transit
సెప్టెంబర్‌లో అదృష్టం అంటే వీరిదేరా బాబు..నక్కతోక తొక్కినట్లే!
జ్యోతిష్య శాస్త్రంలో గ్రహా సంచారం, గ్రహాల కలయిక, గ్రహాలు నక్షత్ర సంచారం, రాశి సంచారం అనేది సహజం. అయితే కొన్ని రాశులు నెలకు ఒకసారి, మరికొన్ని రాశులు రెండు లేదా మూడు నెలలకు ఒకసారి ఒక రాశి నుంచి మరో రాశిలోకి సంచారం చేస్తుంటాయి. అయితే అతి త్వరలో శుక్ర గ్రహం సంచారం చేయనుంది. అయితే దీని ప్రభావం 12 రాశులపై పడగా, నాలుగు రాశుల వారికి మాత్రం అదృష్టం కలిసి రానున్నది.
Updated on: Aug 25, 2025 | 12:54 PM

శుక్రగ్రహం సంపద, ఆనందం, శ్రేయస్సుకు చిహ్నం. అయితే శుక్రగ్రహం సెప్టెంబర్ నెలలో కర్కాటక రాశిలోకి సంచారం చేయనున్నాడు. దీంతో నాలుగు రాశుల వారికి సొంతింటి కల సాకరం కావడమే కాకుండ, పట్టిందల్లా బంగారమే కానుంది. ఇంతకీ ఆ రాశులు ఏవి అంటే?

వృషభ రాశి : వృషభ రాశి వారికి శుక్రసంచారంతో సెప్టెంబర్ నెల మొత్త అద్భుతంగా ఉండబోతుంది. ఈ రాశి వారు ఏ పని చేసినా కలిసి వస్తుంది. విద్యార్థులు మంచి ర్యాంకులు అందుకుంటారు. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది. ఆర్థికంగా అనేక ప్రయోజనాలు చేకూరుతాయి.

మిథున రాశి : మిథున రాశి వారికి పట్టిందల్లా బంగారమే కానుంది. వీరికి సెప్టెంబర్ నెల ఊహించని లాభాలు తీసుకొస్తుంది. ఈ రాశి వారి సొంతింటి కల నెరవేరుతుంది. స్థిరాస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. వ్యాపారస్తులు అనేక లాభాలు అందుకుంటారు. పెట్టుబడులు అనుకూలంగా ఉంటాయి.

కన్యా రాశి : కన్యారాశి వారికి ఊహించని విధంగా డబ్బు చేతికందుతుంది. బంధుమిత్రులతో కలిసి విందు, వినోదాల్లో పాల్గొంటారు. నూతన కార్యాలకు శ్రీకారం చుడుతారు. మీ పిల్లల భవిష్యత్తు కోసం మీరు తీసుకునే నిర్ణయాలు చాలా అనుకూలంగా ఉంటాయి. ఫ్యామిలీతో చాలా సంతోషంగా గడుపుతారు.

మేష రాశి : ఈ రాశి వారు అనుకోని విధంగా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. అలాగే ఆకస్మిక ధనలాబం కలుగుతుంది. విదేశయాన ప్రయత్నాలకు మార్గం సుగమమవుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది.



