- Telugu News Photo Gallery Cinema photos Know This Actress Who Acted 8 Films and Only 2 Hits, She Is Nidhhi Agerwal
Actress: చేసింది 8 సినిమాలు.. రెండే బ్లాక్ బస్టర్స్.. అయినా పెద్ద హీరోలతోనే ఛాన్సులు..
సినీరంగంలో ఎన్నో సంవత్సరాలుగా రాణిస్తున్న చాలా మంది హీరోయిన్లు ఇప్పటికీ సరైన సక్సెస్ అందుకోలేకపోయారు. వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేసినప్పటికీ బ్రేక్ రాని ముద్దుగుమ్మలు ఉన్నారు. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ హీరోయిన్ మాత్రం ప్రత్యేకం. వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయి. కానీ ఒక్క హిట్టు మాత్రమే అందుకుంది.
Updated on: Aug 25, 2025 | 3:00 PM

చాలా కాలంగా సినీరంగంలో వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ఇప్పటివరకు 8 సినిమాల్లో నటించింది. కానీ అందులో ఒక్కటి మాత్రమే హిట్టయ్యింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ప్రభాస్ వంటి స్టార్ హీరోలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటుంది. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ ఎవరో తెలుసా.. ?

తనే హీరోయిన్ నిధి అగర్వాల్. 2017లో మున్నా మైఖేల్ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత 2018లో సవ్యసాచి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఫస్ట్ మూవీ అంతగా ఆకట్టుకోలేకపోయింది. అయినప్పటికీ ఈ బ్యూటీకి వరుస అవకాశాలు వచ్చాయి.

తెలుగులో మిస్టర్ మజ్ను, హీరో వంటి చిత్రాల్లో నటించింది. తెలుగుతోపాటు తమిళంలోనూ పలు అవకాశాలు అందుకుంది. 2019లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ మాత్రమే బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్టు అయ్యింది. ఈ మూవీతో ఏకైక విజయాన్ని అందుకుంది.

ఇటీవలే పవన్ కళ్యాణ్ సరసన హరి హర వీరమల్లు సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చింది. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. ప్రస్తుతం ఈ అమ్మడు ప్రభాస్ సరసన రాజా సాబ్ చిత్రంలో నటిస్తుంది. ఈ సినిమాతో సరైన బ్రేక్ కోసం చూస్తుంది.

డైరెక్టర్ మారుతి దర్శకత్వం వహిస్తున్న పాన్ ఇండియా మూవీ రాజా సాబ్ ఈ ఏడాదిలో విడుదల కానుంది. ఈ సినిమాతోపాటు నిధికి తెలుగు, తమిళం భాషలలో మరిన్ని ఆఫర్స్ వస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.




